Bachelor Villages Carve Road Through Mountains, To Make Way for Brides - Sakshi
Sakshi News home page

Bachelor Village: ఆ ఊరు మొత్తం బ్రహ్మచారులే.. ఎక్కడంటే?

Published Sun, Feb 12 2023 2:05 PM | Last Updated on Sun, Feb 12 2023 2:30 PM

bachelor villages carve road through mountains, to make way for brides - Sakshi

ఆ ఊళ్లో ఎక్కడ చూసినా పెళ్లికాని బ్రహ్మచారులే కనిపిస్తారు. దాదాపు యాభైఏళ్లుగా ఆ ఊళ్లో పెళ్లిళ్లే జరగలేదంటే, ఆ ఊరి పరిస్థితిని ఊహించుకోవచ్చు. బిహార్‌లోని కైమూర్‌ జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు బర్వాంకలా. ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో కైమూర్‌ కొండల మధ్య ఎగుడు దిగుడు దారిలో ఉన్న ఈ ఊరికి చేరుకోవడం అంత తేలిక కాదు. సమీపం పట్టణాల నుంచి ఇక్కడకు రాకపోకలు జరిపే వాహనాలూ తక్కువే. రోజువారీ అవసరాలకు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా ఈ ఎగుడు దిగుడు దారిలో కనీసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

ఒక మాధ్యమిక పాఠశాల, రేషన్‌ దుకాణం తప్ప మరో సౌకర్యమేదీ ఈ ఊళ్లో కనిపించదు. ఈ ఊరి పరిస్థితి ఇలా ఉండటంతో ఇక్కడి కుర్రాళ్లకు పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవాళ్లే కరువయ్యారు. యాభై ఏళ్ల పాటు పెళ్లిళ్లకు నోచుకోని ఈ ఊరి యువకుడు అజయ్‌కుమార్‌ యాదవ్‌కు ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. అతడు వధువును తీసుకొస్తున్న సందర్భంగా గ్రామస్థులే స్వయంగా రోడ్డు నిర్మించి, నూతన వధూవరులకు ఘనస్వాగతం పలికారు. అయితే, ఇప్పటికీ ఈ గ్రామ పరిస్థితుల్లో పెద్దగా మార్పురాలేదు. ‘బ్రహ్మచారుల గ్రామం’ అనే పేరూ తొలగిపోలేదు.
చదవండి:  మనుషులే ఉండని ఊరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement