
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది.
తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment