Most Eligible Bachelor
-
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హాట్ ప్రిన్స్ పెళ్లి, పిక్స్ వైరల్
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 1788 గదులున్న ప్యాలెస్‌లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్‌గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. -
టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాద్‌లు ఇంతమంది ఉన్నారా?
టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లి టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఇంకా 30 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి ఊసెత్తని హీరోలు ఎవరెవరు ఉన్నారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ జాబితా నుంచి వైదొలిగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్. జూన్ 3న శర్వానంద్ రక్షితారెడ్డిని వివాహమాడారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం నేడు(జూన్ 9న) జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) అయితే పెళ్లి ఆలోచన లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్లో బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి మీద రోజుకో వార్త పుట్టుకొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయాడు. చివరకు ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. దీంతో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పెళ్లి గురించి అభిమానుల అరుపులకు సమాధానమిస్తూ.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చాడు. కానీ ఆ శుభాకార్యం ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇక ఇదే వరుసలో మరో హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. తన చిన్న వయసు వారంతా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో తేజ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్లో మరో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటుతున్న పెళ్లికి మాత్రం సై అనడం లేదు. ఇదే లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, అడవి శేష్, బెల్లం కొండ శ్రీనివాస్, సిద్ధార్థ్, అల్లు శిరిష్, తరుణ్ ఇలా బ్యాచ్లర్ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఎంతోమంది హీరోలు.. పెళ్లయ్యాక కూడా సక్సెస్ అయ్యారు. మరి ఈ హీరోలు మాత్రం పెళ్లి విషయాన్నే మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. ఈ హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయితే చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్) ---- పోడూరి నాగ ఆంజనేయులు -
2021 ఈ హీరోలకు చాలా స్పెషల్.. అద్భుతాలు జరిగాయి!
2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ‘క్రాక్’తొ కమ్ బ్యాక్ సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. నరేశ్ విజయానికి ‘నాంది’ 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు. సీటీ కొట్టించిన ‘సీటిమార్’ 2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అఖిల్ ఖాతాలో భారీ విజయం 2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు. -
ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
దసరా, దీపావళి వంటి పండుగలు వస్తే పెద్ద హీరోల సినిమాలు వెండితెరపై సందడి చేస్తాయి. ఇక మిగిలిన రోజుల్లో చిన్న, డెబ్యూ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. ఇలా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలు ఈ వారం థియేటర్లో సందడి చేయనున్నాయి. కొన్ని ఆసక్తికర సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దామా..! 1. రావణ లంక క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్.ఎస్.రాజు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉజ్జల కుమార్ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు. విహారయాత్ర కోసం వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 2. ఊరికి ఉత్తరాన విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ‘ఊరికి ఉత్తరాన’ నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేన్ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిందీ చిత్రం. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లికాని అబ్బాయి పాత్రలో నరేన్ నటించారు. పలు పెళ్లి చూపులకు వెళ్లిన కథానాయకుడికి అన్ని చోట్లా నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలో జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్లో చేరిన హీరో ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేదే సినిమా కథ. ఈగల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3. రామ్ అసుర్ అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్ డైమండ్’. ఇప్పుడీ టైటిల్‌ను ‘రామ్ అసుర్’గా మార్చారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కగా ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ సంయుక్తంగా నిర్మించాయి. విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమని, ఇలాంటి కాన్సెప్ట్ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదని, హీరో, నిర్మాత అభినవ్ సర్దార్ తెలిపారు. నవంబర్ 19న ‘రామ్ అసుర్’ థియేటర్లలో రిలీజ్ కానుంది. 4. స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్ సినిమాకు విశ్వ దర్శకత్వం వహించగా మామిడాల శ్రీనివాస్ నిర్మాత. నవంబర్ 19న ప్రేక్శకుల ముందుకు తీసుకువస్తున్నారు. నేరాలు చేసే ముఠాపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనేదే ఈ సినిమా కథ. మంచి ఆసక్తికరంగా సాగే చిత్రమిదని దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ చిత్రంలో తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. 5. పోస్టర్ విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పోస్టర్’. టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మించగా, యూఎఫ్ఓ సంస్థ నవంబరు 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. ఇది చిన్న సినిమాలలో పెద్ద చిత్రమవుతుందన్న నమ్మకం ఉందని దర్శకుడు మహిపాల్ పేర్కొన్నారు. హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ 'ఇది మన ఊరిలో మనకి తెలిసిన కథలాగే ఉంటుంది. అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. 6. సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి సీనియర్ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. చైతన్య కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబరు 19న థియేటర్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించగా సత్య కశ్యప్ సంగీతం అందించారు. 7. మిస్టర్ లోన్లీ విక్కీ, నూరజ్, కీయా, లోహిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ లోన్లీ’. హరీష్ కుమార్ దర్శకుడు. కండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 19న థియేటర్లలో విడుదల కానుంది. ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు? తర్వాత అతని జీవితం ఏమైంది? అన్నది ఈ చిత్ర కథాంశం. మూడు దశల్లో నడిచే ప్రేమకథ ఇది. అమ్మాయిల చేతిలో మోసపోయిన ప్రతి అబ్బాయి కథ. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాల్లా యువతరానికి కచ్చితంగా నచ్చుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఓటీటీల్లో రిలీజ్ అయే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే. 1. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ జీ5లో ఈ నెల 19 నుంచి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్ ప్రసారం కాబోతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్ ఇది. సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ, తులసి, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. 2. అద్భుతం తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా, ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 3. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. లవ్, రొమాంటిక్‌గా వచ్చిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 15న వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. నవంబరు 19న ప్రముఖ ఓటీటీ వేదికలు ఆహా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 4. ధమకా బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రామ్ మాధవానీ తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 19న అలరించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ * నెవర్ బ్యాక్ డౌన్ (హాలీవుడ్) నవంబరు 16 * ద వీల్ ఆఫ్ టైమ్ (వెబ్ సిరీస్) నవంబరు 19 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ * క్యాష్ (హిందీ) నవంబరు 19 * చురులీ (మలయాళం) నవంబరు 19 * పొన్ మాణిక్వేల్(తమిళం) నవంబరు 19 సోనీ లివ్ * యువర్ హానర్ (వెబ్ సిరీస్- సీజన్) నవంబరు 19 ఎంఎక్స్ ప్లేయర్ * మత్స్యకాండ్ (తెలుగు వెబ్‌సిరీస్) నవంబరు 19 బుక్ మై షో * డోంట్ బ్రీత్ 2 (తెలుగు డబ్బింగ్) నవంబరు 15 నెట్‌ఫ్లిక్స్ * టైగర్ కింగ్(వెబ్ సిరీస్-2) నవంబరు 17 * బంటీ ఔర్ బబ్లీ 2(హిందీ ) నవంబరు 19 * హెల్ బౌండ్ (వెబ్‌సిరీస్) నవంబరు 19 * కౌబాయ్ బే బోప్ (వెబ్ సిరీస్) నవంబరు 19 -
ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం గురిపించింది. చదవండి: బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఓటీటీకి వస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని మేకర్స్ ప్రకటించించారు.కాగా ఈ చిత్రం విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ. 20.91 కోట్ల బిజినెస్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.మ23.75 కోట్ల షేర్స్‌ను సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు. -
బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు కొల్లగొట్టిన బ్యాచ్ లర్
-
పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. గతవారం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరుణంలో మూవీ టీం హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రెషన్స్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ హాజరయ్యాడు. అల్లు అర్జున్ ఈ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతూ..‘పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు. ఆమె అందరి హీరోలకి స్పెషలే’ అని తెలిపాడు. అంతేకాకుండా.. ‘ముకుంద మూవీ నుంచి పూజాని చూస్తున్నా. ప్రతి సినిమాలో తనదైన శైలిలో వైవిధ్యమైన నటనని ప్రదర్శిస్తోంది. ఆమె ఎవరితో నటించిన ఆ హీరో హిట్ అందుకుంటాడ’ని ఐకాన్ స్టార్ చెప్పాడు. కాగా ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలు రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ డిసెంబర్లో ప్రేక్షకుల ముందకు రానుంది. చదవండి: పుష్ప: అదిరిపోయిన రష్మిక ‘శ్రీవల్లి’ సాంగ్ -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్ మీట్
-
ఇద్దరూ ఒకేసారి హిట్ కొట్టడం.. ఎంతో సంతోషాన్నిచ్చింది: అల్లు అర్జున్
‘‘అక్కినేని, అల్లు ఫ్యామిలీల జర్నీ 65ఏళ్లుగా సాగుతోంది. నాగార్జునగారితో నేను సినిమాలు నిర్మించా. మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు అల్లు అరవింద్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘అఖిల్‌కి సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. తను డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు. కానీ వాటిని పక్కనపెట్టి ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రం చేశాడు. ఆ చాయిస్‌ను గౌరవిస్తాను. రీసెంట్గా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’తో, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టారు. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్స్ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. అది ఎంతో సంతోషాన్నిచ్చింది. మా నాన్నగారు తన లైఫ్‌లో ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమా జర్నీలో ఫీలయ్యారు. ఆయన అనుకుంటే ‘ఆహా’లో రిలీజ్ చేయవచ్చు. కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని కూడా జనాలు థియేటర్స్‌కు రావాలని థియేటర్స్‌లో విడుదల చేశారు. నాన్నగారు ఎవరితో సినిమా చేస్తే వారి కెరీర్లో అది బెస్ట్ ఫిల్మ్. హిట్ కొట్టిన యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘పెళ్లి చేసుకోవాలనుకునేవారు చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్ అంత మంచి కథ రాశారు. పెళ్లిపై మంచి అవగాహన కలిగించిన సినిమా ఇది’’ అన్నారు. అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్‌గారు ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి మారిపోతారు. అల్లు అరవింద్గారితో పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సందేశం ఇద్దామని కాకుండా ఈ కథ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం ఇద్దామని అనుకున్నాం. అవి వర్కౌట్ అయ్యాయనే భావిస్తున్నాను. హిట్ రూపంలో ప్రేక్షకులు ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను ఎనర్జీగా తీసుకుని కెరీర్లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని చెప్పాను. నాకు ఇంకా నిద్ర రాలేదు. సక్సెస్ వచ్చినందుకు అంత సంతోషంగా ఉంది’’ అన్నారు. వాసూవర్మ మాట్లాడుతూ – ‘‘ఆర్టిస్టుల నటన డైలాగ్స్ చెప్పడంలో ఉండదు. తోటి నటీనటుల డైలాగ్స్‌కు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌లో తెలుస్తుంది. అఖిల్ నటన, హావభావాలు బాగున్నాయి’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూస్తే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. అలాగే వారి మధ్య ఏదైనా సెలెన్స్ ఉంటే అది బ్రేక్ అవుతుందని చెప్పగలను’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘తన సినిమా సక్సెస్ మీట్ జరగడాన్ని మించిన సంతోషం ఏదీ దర్శకుడికి ఉండదు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పూజ గ్లామరస్ స్టార్ అన్నారు. ఈ సినిమాతో పెర్ఫార్మింగ్ స్టార్ అంటున్నారు’’ అన్నారు పూజా హెగ్డే. వంశీ పైడిపల్లి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అయ్యగారి ఫ్యాన్’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అయ్యగారి ఫ్యాన్’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్
అఖిల్ అక్కినేని కొత్త మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొట్టాడు అక్కినేని వారసుడు. అయితే సినిమా రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే ఎక్కువగా వినిపించిన అఖిల్ వీరాభిమాని ‘అయ్యగారి ఫ్యాన్’ గురించి తెలిసిందే. తాజాగా తన ఫ్యాన్‌పై స్పందించాడు ఈ కుర్ర హీరో. తన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న తరుణంలో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు అఖిల్. అందులో ఓ అభిమాని ‘అయ్యగారి అభిమాని’ గురించి అడిగాడు. దీనిపై స్పందించిన ఈ కుర్ర హీరో.. ‘అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్ అయ్యిండొచ్చు. బ్రదర్ నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. చదవండి: అఖిల్ సినిమా..! సోషల్ మీడియాను షేక్ చేసిన ఫ్యాన్..! -
విశాఖలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీం సందడి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. 25 శాతం సినిమాలను ఏపీలో చిత్రీకరించేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. బీచ్‌రోడ్డులో ఆదివారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ థ్యాంక్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. నెల వ్యవధిలో అన్నదమ్ముల సినిమాలు రిలీజై హిట్ అవ్వడం గొప్ప విషయమన్నారు. ఇక హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ ఓ మైలు రాయిగా నిలిచిపోయిందన్నారు. ఇంతటి ఘనవిజయం అందజేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వంద శాతం థియేటర్ల సీట్లు అమ్మకాలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్‌కు మళ్లీ వస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు. -
అఖిల్ సినిమా..! సోషల్ మీడియాను షేక్ చేసిన ఫ్యాన్..!
ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టేశాడు. ప్రేక్షకులముందుకొచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా విన్నర్‌గా నిలిచింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టిగ్ లవ్‌స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ హిట్ టాక్‌ను సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే అఖిల్ వీరాభిమాని అయ్యగారి ఫ్యాన్ పేరే ఎక్కువగా వినిపించింది. ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్ మామూలుగా లేదు...! కొంతమంది ప్రేక్షకులు అఖిల్ సినిమా కోసం ఎదురచూడగా.... మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం అఖిల్ హర్డ్ కోర్ ఫ్యాన్ ఎప్పుడూ వస్తాడనే కళ్లు కాయేలా కాసేలా ఎదురుచూశారు. సోషల్‌మీడియాలో అఖిల్ ఫ్యాన్‌కు ఫ్యాన్‌బేస్‌ను చూసి యూజర్లు నివ్వెర పోయారు. అయ్యగారి ఫ్యాన్..‘ఓ థియేటర్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కటౌంట్‌కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప...పులీ..పులీ...కింగ్ కొడుకు.. అంటూ కేకలు వేశాడు. అయ్యగారి ఫ్యాన్ ఉత్సాహంతో ఇతర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. సోషల్‌మీడియాలో #ayyagareno1 అంటూ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది. View this post on Instagram A post shared by 👉 KIRRAK_MEMES_1 (🎯2k)❤️ (@kirrak_memes_1) View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) View this post on Instagram A post shared by b.techbabu😎 (@b.techbabu) View this post on Instagram A post shared by Telugu Meme Page (@lite_ba) View this post on Instagram A post shared by MATHU VADALARA😷 (stay home) (@mathu.vadalara) View this post on Instagram A post shared by Telugu Swaggers (@telugu_swaggers) చదవండి:బొమ్మరిల్లును గుర్తు చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్! -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా రివ్యూ
టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ విడుదల తేది : అక్టోబర్ 15, 2021 మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరి దానికి ప్రతిఫలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ దసరా విన్నర్‌గా నిలవనుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ: హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్‌కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్‌లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్‌లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్‌గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్‌లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. చివరగా.. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా చూసి ఆస్వాదించవచ్చు. అయ్యగారు మొత్తానికి హిట్ కొట్టారనే అంటున్నారు అభిమానులు! -
రొమాంటిక్ సీన్లో నటించాలంటే సిగ్గు: అఖిల్
Akhil Akkineni Interview With Sakshi TV: ‘‘ప్రస్తుతం మీకున్న మూడు విష్లు ఏంటి?’’ అనే ప్రశ్నకు.. మూడో విష్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అఖిల్. మరి మొదటి రెండు విష్లు? ‘సాక్షి’ టీవీతో ఆ విషయాలు, ఎన్నో విశేషాలు అఖిల్ పంచుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో హర్ష (అఖిల్ పాత్ర పేరు) సోల్ సెర్చింగ్‌లో ఉంటాడు. తనని తను కనుక్కునే ప్రయత్నం. సినిమాలో హర్ష తనకు 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ అంటాడు. నాకు పర్సనల్‌గా ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంటూ కెరీరే. ఇక సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై మాట్లాడుతూ.. రొమాంటిక్ సన్నివేశాల్లో తాను చాలా ఇబ్బంది పడతానని. షూటింగ్ సమయంలో చుట్టూ వంద మంది ఉంటారు అలాంటి వాతావరణంలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి కొంచెం సిగ్గనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లికి మీ నిర్వచనం ఏంటంటే.. ఇద్దరూ కంఫర్ట్‌గా ఉండాలి. నువ్వు నీలా ఉండగలగాలి, వాళ్లను వాళ్లలా ఉండనివ్వాలి. లవ్‌లో పడ్డారట కదా.. అఖిల్ (ఆశ్చర్యపోతూ..) ఈ చిత్రంలో ‘ఏ జిందగీ’ పాట పాడిన అమ్మాయి వాయిస్‌తో లవ్‌లో పడ్డానని అన్నానంతే. ఆ పాట వినగానే ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వాయిస్’ అని భాస్కర్‌తో అన్నాను. రోజూ ఉదయం ఒక్కసారైనా ఆ పాట వింటున్నాను. దేవుణ్ణి మూడు కోరికలు కోరుకునే అవకాశం వస్తే మీరు ఏం అడుగుతారు? ‘కరోనా పాండమిక్ వెళ్లిపోవాలి. రెండోది థియేటర్స్ అన్నీ తెరుచుకుని ప్రేక్షకులతో కళకళలాడాలి. మూడోది ‘మోస్ట్ ఎలిజిబుల్...’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అన్నారు అఖిల్. -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్విటర్ రివ్యూ
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ నటించిన మొదటి 3 చిత్రాలు అంతగా గుర్తింపు రాకపోవడంతో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రమిది. ఈ మూవీతో ఎలాగైనా ఓ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలను వేసుకోవాలని అఖిల్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చదవండి: పెళ్లి సందD ట్విటర్ రివ్యూ దసరా సందర్భంగా ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ వినోదం పంచేందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు వారిని ఆకట్టుకుంటుందో మరి కొద్ది సేపట్లో తెలుస్తుంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. చదవండి: దసరా సినిమా జోష్.. బోలెడన్ని అప్డేట్స్ ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని, చాలా బాగుదంటూ నెటిజన్లు తమ రివ్యూ ఇస్తున్నారు. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్. అఖిల్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక పూజ, గోపి సుందర్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని కూడా చెప్పోచ్చు అంటున్నారు. చివరగా నెటిజన్ల ట్విటర్ రివ్యూ చూస్తుంటే ఎవరు ఏమన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొనుందని తెలుస్తోంది. Yavadu yam ana lyt Booma Blockbuster 👍🥁#MostEligibleBachelor — MEBOnOct15th (@AKBadri6848) October 14, 2021 Ultra Lite second half. Music, Pooja papa plus. Bommarillu, Orange laga try chesi inko Mr. Majnu ichadu bhasker sir. #MostEligibleBachelor Ayyagaru ease 👍 Waiting for Agent. — SADDY (@king_sadashiva) October 14, 2021 అల్ట్రాలైట్ సెకండ్ హాఫ్, మ్యూజిక్, పూజ పాప ప్లస్, బొమ్మరిల్లు ఆరెంజ్‌లా ప్రయత్నించి మరో మిస్టర్ మజ్ను ఇచ్చాడు భాస్కర్ సర్ Block buster reports 👌🏻 #MostEligibleBachelor — Manni Reddy 🦁 (@_urstrulymanni) October 14, 2021 Positive reports from my friends every where 👏👏👏👏👏#MostEligibleBachelor — In a cricket mode (@naveentilak) October 15, 2021 Blockbuster talk 💥💥#MostEligibleBachelor — chaymb (@Chaymbfan23) October 15, 2021 Superb 1st half 👌 Looks like 2nd half is going to be serious but let’s see #MostEligibleBachelor https://t.co/2mIAxELHQG — Murali Krishna (@muraliii) October 15, 2021 #MostEligibleBachelor Finally Block Buster From bommarillu bhaskar — Sush🖤 (@daanish89938798) October 14, 2021 2nd half >>> 1st half….Ayyagaru 1st hit kottesinatte. Songs on screen 👌👌 #MostEligibleBachelor — ♓️arsha (@harshakaruturi) October 15, 2021 -
పారదర్శకత కోసమే ఆన్లైన్ టిక్కెటింగ్
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్) వారు మా బాధలు విన్నారు. వాటి పరిష్కార మర్గాల దిశగా ఆలోచిస్తున్నారు’’ అన్నారు నిర్మాత బన్నీ వాసు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానున్న సందర్భంగా బన్నీ వాసు చెప్పిన సంగతలు. ► పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చూస్తే జీవితం పై ఓ క్లారిటీ వస్తుంది. పెళ్లికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెబుతారు కానీ పెళ్లి జరిగాక భార్యతో భర్త ఎలా ఉండాలో అబ్బాయికి, భర్తతో భార్య ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పే తల్లిదండ్రులు తక్కవ. పెళ్లి ముందే కాదు..పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తల్లితండ్రులు నేర్పించాలన్నదే మా సినిమా కాన్సెప్ట్. ► ఆన్లైన్ టిక్కెటింగ్ దాదాపు ప్రతి థియేటర్లో రన్ అవుతోంది. ప్రేక్షకులు ఎన్ని టిక్కెట్స్ తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వంవారు అడుగుతున్నారు. మన ఎగ్జిబిటర్స్‌లో చాలామంది పన్నులు కట్టడం లేదు. దాదాపు 300 థియేటర్స్ జీఎస్టీ పరిధిలోనే లేవు. ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఇండస్ట్రీ వల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమైనా చేసిపెట్టండని ప్రభుత్వాన్ని కోరే వీలుంటుంది. చాలామంది ఎగ్జిబిటర్స్ టాక్స్ పరిధిలోకి రావడం లేదు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించడం లేదనేది ప్రభుత్వం వారి భావన. అందుకే ప్రభుత్వంవారు పారదర్శకత కోరుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వంవారు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారు ఓ రిపోర్ట్ తయారు చేయమ న్నారు. ఆ రిపోర్ట్ వచ్చాక నిర్ణయాలు ఇండస్ట్రీకి సానుకూలంగానే వస్తాయని నమ్ముతున్నాను. -
90 రోజులు 20 కొత్త సినిమాలు, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు
ఒరిజినల్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆహా వీడియో దసరా పండగ సందర్భంగా ఇప్పుడు నాన్ స్టాప్ వినోదాల పండుగకి సిద్దం అయ్యింది. మొత్తం 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు.. షోలతో.. ఆహా ప్రేక్షకులను చూపు తిప్పుకోనికుండా చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. చదవండి: కుటుంబంతో మాల్దీవుల్లో వాలిపోయిన అల్లు అర్జున్, వీడియో వైరల్ దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దం అంటూ ముందుకొస్తోంది. మొత్తం 90 రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త సినిమాలు, కొత్త షోలు, వెబ్ సీరిస్‌ల ఫుల్ షెడ్యుల్‌తో ఆహా రెడీ అవుతోంది. ఇంకా విడుదల కానీ సినిమాలతో పాటు ఈ మూడు నెలల్లో వచ్చే కొత్త సినిమాలు కూడా ఈ షెడ్యూల్లో ఉండటం విశేషం. ముఖ్యంగా ఇందులో అఖిల్ అక్కినేని-పూజ హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ గని చిత్రాలతో పాటు ఇంకేన్నో తాజా తాజా సీరిస్‌లు, షోలు కూడా ఉన్నాయి. దీంతో బుల్లితెర ప్రేక్షకులు సినిమా జాతర కోసం సిద్దమవుతున్నారు. చదవండి: దసరా పండగకు థియేటర్లో, ఓటీటీలో సందడి చెయబోతున్న చిత్రాలు 12 వారాలు... 90 రోజులు... 20 కొత్త సినిమాలు, షోలు! 🎥 ఈ దసరా నుండి సంక్రాంతి వరకు అదిరిపోయే నాన్ స్టాప్ 100% తెలుగు వినోదాల పండగ, మీ అహలో!🧡 సిద్ధమా!!!https://t.co/whilkXuvEA#CelebrateWithAHA🥳 pic.twitter.com/TTbmVrS3OG — ahavideoIN (@ahavideoIN) October 10, 2021 -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్ కావాలి!
‘‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను ఓ సినిమాకి అంత అంకితం అవుతాడు’’ అన్నారు నాగచైతన్య. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో దర్శకడు వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిపిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘జోష్’కి వాసూ వర్మ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసుతో ‘100›పర్సెంట్ లవ్’ చిత్రం చేశాను. తన ప్రయాణం చూస్తే గర్వంగా ఉంది. అరవింద్‌గారు కథ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటారు.. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే అంత కేర్ ఉండాలి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్‌లా అనిపించింది.. ఇలాంటి సమయంలో థియేటర్స్‌లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.. ఈ సినిమా ఆ సెలబ్రేషన్‌ని ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే రామానాయుడుగారిని చూశాం.. ఇప్పుడు అరవింద్‌గారిని చూస్తున్నాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి యూత్‌ఫుల్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా ఇది. చైతూగారి ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఈ టీమ్‌లో నన్ను భాగస్వామి చేసిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వాసూ వర్మ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘మీ వెనకాల (నాగచైతన్య, అఖిల్) అక్కినేని లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే అఖిల్‌ని తెలుగు ప్రేక్షకులందరి వద్దకూ చేర్చాలన్నదే నా ప్రయత్నం.. అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కచ్చితంగా జరుగుతుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం’’ అన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, నటి ఆమని, సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు బాబీ, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. -
భాస్కర్ సినిమా చూసి ప్రతి భర్త తన భార్య చేతిని పట్టుకుని వెళతాడు..
‘గీతా ఆర్ట్స్, జీఏ2 బ్యానర్స్‌లో చాలా హిట్ సినిమాలు వచ్చాయంటే.. మేం ప్రేక్షకులకు హిట్ మూవీస్ ఇవ్వలేదు.. వారే మాకు ఇచ్చారు. సినిమాని ఎంత ప్రేమిస్తారో ఆల్ ఇండియాకి తెలుగు ప్రేక్షకులు ఓ పాఠం నేర్పించారు’ అని అల్లు అరవింద్ అన్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘సినిమాలను విడుదల చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు దయచేసి ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకుని, వెసులుబాటు కల్పించాలని చిత్ర పరిశ్రమ మాటగా కోరుతున్నాను. మేము ఇండస్ట్రీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసేందుకు మీరు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికొస్తే.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ రెండు మూడు కథలు చెబితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నచ్చి, సెట్స్‌పైకి వెళ్లిపోవచ్చని చెప్పా. కరోనా వల్ల ఈ సినిమాని రెండున్నరేళ్లుగా తీస్తూ వచ్చాం. ఔట్పుట్ సంతృప్తి కలిగించింది. అఖిల్ ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోలిస్తే మా చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు’ అన్నారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ – ‘ఈ సినిమాలో బంధాల మీద ఒక వైవిధ్యమైన యాంగిల్‌ని చూపించారు భాస్కర్. ఈ సినిమా నుంచి బంధాలు, బంధుత్వాలు, ప్రేమ.. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లు అరవింద్‌గారు నాకు గాడ్ ఫాదర్లాంటి వారు. ఈ నెల 15న మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేను కూడా మీకు (అల్లు అరవింద్) ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘ఈ చిత్రం చూసి, థియేటర్ నుంచి బయటికెళ్లేటప్పుడు ప్రతి భర్త తన భార్య చేతిని పట్టుకుని వెళతాడు.. ఆ మ్యాజిక్ ఈ సినిమాకి వర్కవుట్ అయింది. అఖిల్‌కి మా బ్యానర్ నుంచి వంద శాతం హిట్ ఇవ్వాలి. ఇస్తున్నాం ఇచ్చేశామని అనుకుంటున్నాం. మేం నిజాయతీగా సినిమా తీశాం. భాస్కర్ బాగా తీశాడు. అల్లు అరవింద్‌గారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉంది. మా సినిమా కోసం ఓటీటీ నుంచి చాలా అవకాశాలొచ్చాయి.. నష్టం లేకుండా లాభంతో బయటపడొచ్చు. ఓ వైపు వడ్డీలు పెరుగుతున్నా కూడా ఇది థియేటర్ ఫిల్మ్ అని, అక్కడే రిలీజ్ చేయాలని అరవింద్‌గారు ఆపారు’ అన్నారు. వాసూ వర్మ మాట్లాడుతూ– ‘నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. పూజా హెగ్డే తొలిసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారనిపిస్తోంది’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘కొత్త కథలను ప్రోత్సహించే మంచి హృదయం అరవింద్గారిది. అఖిల్ పాత్ర కొత్తగా ఉంటుంది. నాకు కనిపించిన కొత్త దారిలో ప్రయాణిస్తూ కథ రాయడంలో ఇబ్బందులు పడ్డాను. ఆ కష్టాల్లో వాసూ వర్మ కూడా నాతో ప్రయాణించారు. అరవింద్‌గారు, బన్నీ వాసు సపోర్ట్ లేకపోతే ఈ కథ రాయడం సాధ్యం అయ్యేది కాదు’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గమడి, కెమెరామేన్ ప్రదీశ్ ఎమ్. వర్మ పాల్గొన్నారు. చదవండి: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సాంగ్ ప్రోమో విడుదల -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడ వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో అఖిల్, పూజా హెగ్డే జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైఫ్ పార్ట్నర్ గురించి పూజా చెప్పే డైలాగ్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇలా లవ్, కామెడీ అంశాలతో ట్రైలర్ ఆసక్తిగా మలిచారు మేకర్స్. చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్ ‘మన లైఫ్ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అంతకు మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని అంటూ పూజా ఇచ్చే స్పీచ్‌లు..పెళ్లి చూపుల్లో అమ్మాయిలతో ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అంటూ అఖిల్ తన అభిప్రాయాన్ని చెబుతుండగా వారి మధ్య జరిగే సన్నివేశాలు మూవీపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మొత్తానికి హీరోహీరోయిన్లు చెప్పే పెళ్లి ముచ్చట్లు బాగా అలరిస్తున్నాయి. ఇక పూజా, అఖిల్ మధ్య రొమాన్స్ అయితే మాములుగా లేదు. -
పండగ సందడి: ద‘సరదా’ షురూ
సినీప్రియులకు పండగ ఎప్పుడంటే బోలెడన్ని సినిమాలు విడుదలైనప్పుడు. పండగలప్పుడు సినిమా రిలీజుల సందడి, పండగ సందడితో డబుల్ ఆనందం దక్కుతుంది. అయితే గత ఏడాది దసరా పండగ సినీ లవర్స్‌ని నిరుత్సాహపరిచింది. థియేటర్ల లాక్డౌన్ వల్ల గత దసరాకి సినిమాలు విడుదల కాలేదు. ఈ దసరాకి సరదా షురూ అయింది. దసరా ఆరంభం నుంచి ముగిసే వరకూ ఈ నవరాత్రికి అరడజను సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. ఉద్యోగం వేటలో అలసిపోయిన రవీంద్ర యాదవ్ జీవితం ఆటలోనైనా గెలవాలని గొర్రెల కాపరిగా కొండపొలం వెళతాడు. అక్కడ ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అడవిలోని క్రూరమైన జంతువులతో పాటు హానికరమైన మనుషులతో కూడా రవీంద్ర యాదవ్ పోరాడాల్సి వస్తుంది. మరి.. ఈ పోరాట ఫలితం ఏంటి? అనేది థియేటర్స్‌లో తెలుస్తుంది. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. ‘కొండపొలం’లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల కాగా, దేవీ నవరాత్రులు మొదలైన మరుసటి రోజు.. అంటే అక్టోబరు 8న ‘కొండపొలం’ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక నెల్సన్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రం తెలుగులో ‘వరుణ్ డాక్టర్’గా అక్టోబరు 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. ‘డాక్టర్’లో శివకార్తికేయన్ అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వినయ్‌రాయ్, యోగిబాబు, మిళింద్ తదితరులు కీలక పాత్రధారులు. మరోవైపు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ల క్రేజీ కాంబినేషన్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ కూడా పండగకి వస్తోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లు. ఒక అమ్మాయి ప్రేమ, ఇద్దరు అబ్బాయిల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశంతో ఈ సినిమా కథనం సాగుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. దసరాకి ‘ఎనిమి’గా థియేటర్స్‌లోకి వస్తున్నాడు విశాల్. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్య మరో హీరో. స్నేహితుడి నమ్మకద్రోహం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘ఎనిమీ’లో విశాల్, ఆర్య ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా దూసుకొస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే, అఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు, స్టాండప్ కమెడియన్ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది. మరోవైపు ఇదే రోజు ‘వరుడు కావలెను’ అంటూ థియేటర్స్‌కు వస్తున్నారు హీరోయిన్ రీతూ వర్మ. నాగశౌర్యనే ఈ వరుడు. ‘వరుడు కావలెను’ లో రీతూవర్మ వీరి కల్యాణం పెళ్లి పీటలపైకి వెళ్లే క్రమంలో జరిగే సంఘటనల డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా దసరా రిలీజ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మరి.. ఈ విజయ దశమికి ప్రేక్షకులు ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో? ఎవరి దశను తిప్పుతారో చూడాలి. -
మరోసారి వాయిదా పడ్డ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'
Most Eligible Bachelor Release Date: యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.చదవండి : 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. మని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిచారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్ #MostEligibleBachelor Arriving in theatres near you this Oct 15th, 2021.#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/7BamMJ2Ajt — GA2 Pictures (@GA2Official) September 26, 2021 Meet our #MostEligibleBachelor in theatres from 𝐎𝐂𝐓 𝟏𝟓𝐭𝐡!🧡 This Dusshera we invite you to theatres with your families for a wholesome entertainment!🤩@AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic pic.twitter.com/e5EPlI6tkC — GA2 Pictures (@GA2Official) September 26, 2021 -
Most Eligible Bachelor:‘లెహరాయీ’ సాంగ్.. అఖిల్-పూజా కెమిస్ట్రీ అదిరింది!
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. ప్రేమగీతంగా రూపుదిద్దుకున్న ఈ పాటలో అఖిల్-పూజాల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.