
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి.
1788 గదులున్న ప్యాలెస్‌లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్‌గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్‌లను నడుపుతూ వర్కౌట్‌లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment