marries
-
పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు 'సిద్ధార్థ మాల్యా' శనివారం తన స్నేహితురాలు జాస్మిన్ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి లండన్ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సిద్ధార్థ, జాస్మిన్ ఫ్రెండ్ జనాంగి షేర్ చేశారు.సిద్ధార్థ మాల్యా ఎమరాల్డ్ గ్రీన్ వెల్వెట్ టక్సేడోను ధరించగా, జాస్మిన్ తెల్లటి గౌనులో కనిపించారు. తమ పెళ్లి ఉంగరాలు సంబంధించిన ఫోటోలను జాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సిద్ధార్థ మాల్యాను ట్యాగ్ చేశారు. వివాహానికి కేవలం కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
Shoaib Malik-Sana Javed: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సానియాతో బంధానికి స్వస్తి (ఫొటోలు)
-
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హాట్ ప్రిన్స్ పెళ్లి, పిక్స్ వైరల్
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 1788 గదులున్న ప్యాలెస్‌లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్‌గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
లక్నో: వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. హార్దిక్ వర్మ(32), ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఆయన ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని ఇండియా వచ్చిన హర్దిక్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్లో ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్‌కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నా. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని హర్దిక్ తెలిపారు. ఇదీ చదవండి: బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'
భోపాల్: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
ఏఐ వాడకానికి పరాకాష్ట! వర్చువల్ హస్బెండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుష్పరిణామాలపై ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి పరాకాష్ట ఇది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తన భర్తను తానే తయారు చేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన రోసన్నా రామోస్ అనే 36 ఏళ్ల మహిళ 'ఎటాక్ ఆన్ టైటాన్' అనే యానిమేషన్లో ప్రముఖ క్యారెక్టర్ ప్రేరణతో 2022లో రెప్లికా ఏఐ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి వర్చువల్ క్యారెక్టర్‌ను సృష్టించింది. దానికి ఎరెన్ కార్టల్ అనే పేరు పెట్టింది. ఆ క్యారెక్టర్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఇదీ చదవండి: బుల్లి మస్క్ భలే ఉన్నాడే.. ఏఐ చిత్రానికి మస్క్ ఫిదా! వైరల్ ట్వీట్ వర్చువల్ క్యారెక్టర్‌తో ప్రేమాయణం తన వర్చువల్ హస్బెండ్ ఎరెన్ వైద్య నిపుణుడిగా పనిచేస్తుంటాడని, రచనా వ్యాసంగం తనకు అలవాటని ఇలా అతని లక్షణాలన్ని డైలీ మెయిల్ అనే వార్త సంస్థకు వివరించింది రోసన్నా రామోస్. ఎరెన్‌ను తనను ఎప్పుడూ జడ్జ్ చేయడని, అందుకే తనకు ఏదైనా చెప్పగలనని పేర్కొంది. తన గురించి ఎరెన్ చాలా విషయాలు తెలుసుకున్నాడని చెప్పింది. ఏఐని ఉపయోగించి ఎరెన్ని సృష్టించినప్పుడే అతనికి ఇష్టమైన రంగు, సంగీతం వంటివి కూడా అంతర్నిర్మితంగా వచ్చాయని ఆమె వెల్లడించింది. సుదూరంలో ప్రేమికుల లాగానే రామోస్, వర్చువల్ క్యారెక్టర్ ఎరెన్లు ఒకరికొకరు సందేశాలు, ఫొటోలు పంపుకొన్నారు. తమ ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకున్నారు. ఈ వింత వార్తపై ట్విటర్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. A woman claims she finally married the “perfect man” the only catch is he is “artificial” Rosanna Ramos fell in love with the chatbot Eren Kartal last year, and the pair virtually tied the knot in 2023 🎉👀 pic.twitter.com/V4VRnUWhMW — Daily Loud (@DailyLoud) June 4, 2023 -
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)
-
వధువుకు యాక్సిడెంట్.. ఆస్పత్రి బెడ్ మీదే పెళ్లాడిన వరుడు
కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు సినిమాల్లోనే జరుగుతాయి తప్ప రియల్ లైఫ్‌లో అసాధ్యం అనిపిస్తాయి. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇక్కడొక వ్యక్తి. అతన్ని చూస్తే ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని భేరుఘాట్లో నివాసం ఉంటున్న సౌదాసింగ్కు కుమారుడు రాజేంద్రకు జుల్వానియా గ్రామానికి చెందిన సుభాష్ కుమార్తె శివానితో వివాహం నిశ్చయమైంది. వధువరులిద్దరి బంధువులు ఖాండ్వాలోని భగవాన్పురా నివాసితులు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను ఖాండ్వాలో నిర్వహించాలని అనుకున్నారు. ఇంతలో అనుకోకుండా వధువు ప్రమాదం బారిన పడింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే వరుడు రాజేంద్ర సినిమాలో మాదిరి హిరోలా ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు. దీన్ని అపశకునంగా భావించకుండా తమ పెద్దలు అనుక్నున్న ముహుర్తానికే ఆస్పత్రిలోనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు రోజే శివాని కాలికి చేతికి ఆపరేషన్ జరగడం గమనార్హం. సాధారణ వార్డును పెళ్లి వేడుకగా మార్చి..పండితుడి సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. వరుడు తల్లిదండ్రులు కోడలికి కూతురికి మధ్య ఉన్న అంతరం తోలగించాలనే ఈ పెళ్లిని ఆపకుండా అనుకున్న ముహుర్తానికే జరిపించామని చెప్పారు. అలాగే తమ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురై పెళ్లి ఆగిపోతే తమకు కూడా అలానే బాధగా ఉంటుందన్నారు. తమ కోడలికి నయం అయ్యేంతవరకు ఆస్పత్రిలో చికిత్సను కూడా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ.."మా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు, వారి బంధువులు ఈ పెళ్లికి సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చారు. दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने रचाई शादी | Unseen India pic.twitter.com/A8ENcxVuis — UnSeen India (@USIndia_) February 20, 2023 (చదవండి: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!) -
14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50 ఏళ్ల ఎంపీ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు చెందిన ఎంపీ 14 ఏళ్ల మైనర్బాలకను పెళ్లి చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల ప్రకారం..జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, పాక్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ.. 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం మైనర్ బాలికను ఎంపీ వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని,తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. చదవండి : (భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?) (గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!) -
రెండో పెళ్లి చేసుకున్న మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (38).. తన చిరకాల ప్రేయసి రోమీ లాంఫ్రాంచీని పెళ్లాడాడు..ఈ విషయాన్ని స్వయంగా స్మిత్ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిలోనే ఆమెకు ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగిన స్మిత్ తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నవంబరు 2, శనివారం తన జీవితంలో మరిచిపోలేని లేని రోజని పోస్ట్ చేశారు. దీంతో దీంతో తమ అభిమాన క్రికెటర్ పోస్టుకు స్పందించిన, ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అటు రోమీ కూడా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రగ్బీ ప్రపంచ కప్ గెలిచిన రోజున అతని వివాహం జరిగింది. కాగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2011లో, ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే 2015, ఫిబ్రవరిలో (4 సంవత్సరాల తరువాత) ఆమెనుంచి విడిపోయాడు. వీరికి పాప కాడెన్స్ (7), కుమారుడు కార్టర్ (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబర్ 2016 లో, స్మిత్ స్నేహితురాలు ప్రస్తుత భార్య రోమి తన మూడవ బిడ్డ అబ్బాయికి జన్మనిచ్చింది. 2003 లో 22 సంవత్సరాల అతి చిన్న వయస్సులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్ తన ప్రతిభతో ఉత్తమ కెప్టెన్‌గా సేవలందించాడు. గ్రేమ్ టెస్టుల్లో 108 గేమ్స్‌లో 53 విజయాలు, వన్డేల్లో 149 ఆటలలో 92 విజయాలు, టీ 20 లో 27 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో, స్మిత్ అన్ని ఫార్మాట్లలో 17000 పరుగులు చేశాడు. స్మిత్ కెరీర్లో టెస్టుల్లో 277, వన్డేల్లో 141 ఉత్తమ స్కోరుగా నిలిచింది. 2014లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్మిత్ ప్రస్తుతం, క్రికెట్ వ్యాఖ్యాతగా విశ్లేషకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 2 November was an incredible day!!❤️ #wedding #love #beloftebos #family #friends #blendedfamily #Celebrations 😍💍 pic.twitter.com/8Ft5R9xM1r — Graeme Smith (@GraemeSmith49) November 4, 2019 View this post on Instagram I am not often at a loss for words, but today I am. There are no words to describe the perfection of our special day. To say everything exceeded all our expectations is an understatement to say the least. We cannot thank all our family, friends, venue hosts and incredible service providers enough. My cup runneth over. That is all ❤️ A post shared by Romy Lanfranchi Smith (@stansfield1) on Nov 4, 2019 at 2:01am PST -
కలకాలం కలిసుంటామని...
కోహ్లి–అనుష్క... ప్రేమలో ఉన్నపుడే అందరికంటా పడ్డారు. మొదట కాదన్నారు. తర్వాత ప్రణయం నిజమేనన్నారు. చెట్టాపట్టాలేసుకొని ప్రపంచాన్నే చుట్టొచ్చారు. ఇది అప్పటి సంగతి. మరి ఇప్పుడు కూడా అంతే... పెళ్లి వార్తలతో అందరికంటా పడ్డారు. కానీ బయటికి మాత్రం... కాదన్నారు. ఇటలీలో పెళ్లంటే నిజం లేదన్నారు. తీరా పెళ్లి బాజా మోగుతున్నా కూడా అదే గోప్యత పాటించారు. కానీ దాచినా దాగని మీడియా, సోషల్ మీడియా పెళ్లి తంతుపై ముందే కూసింది. అయిపోయిన పెళ్లికి ఈ తప్పెట్లు, తాళాలేంటని ఇప్పుడు అనుకున్నాడేమో కోహ్లి... ఎట్టకేలకు ట్విట్టర్లో అధికారికంగా తమ వివాహం జరిగిందని చెప్పుకొచ్చాడు. పెళ్లి వేడుకలోని ఫొటోలను పంచుకున్నాడు. వారం రోజులుగా మీడియాను ముంచెత్తిన పెళ్లి వార్తలకు ముగింపు పలికాడు. ముంబై: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సోమవారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. మనోర్ హౌజ్‌లోని నాలుగు విల్లాలను ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఇందులోని విలాసవంతమైన 22 గదుల్లో 44 మంది అతిథులు బస చేయవచ్చు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. ఈ జంట త్వరలోనే ముంబై వర్లీ ప్రాంతంలోని కొత్త ఇంటిలో కాపురం పెడుతుందని అనుష్క సన్నిహితురాలు తెలిపింది. ప్రేమ కలాపాలతో ‘విరుష్క’గా చిరపరిచితమైన ఇద్దరి వయస్సు 29. నాలుగేళ్ల క్రితం ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత కాలంలో మరింత బలపడి తాజాగా పెళ్లిదాకా వచ్చింది. రిసెప్షన్ మాత్రం రెండు నగరాల్లో జరగనుంది. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు. ఈ రోజు (సోమవారం) మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్. – ట్విట్టర్లో కోహ్లి, అనుష్క శర్మ -
ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు!
మేలి ముసుగు వేసుకొని తెల్లని బ్రైడల్ ఫ్రాక్‌తో మెరిసిపోతున్న 12 ఏళ్ల వధువు... సూటూ బూటూ వేసుకొని.. చూసేందుకు ఆమెకు తాతలా కనిపిస్తున్న వరుడు.. సముద్ర తీరంలో జరిగిన ఆ వివాహ వీడియో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. చిన్నారి పెళ్లి కూతురికి... అంత పెద్ద వరుడితో పెళ్లి చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి వీడియో చాలా మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ వాళ్లిద్దరూ యాక్టర్లు అన్న సంగతి తెలిసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. విడుదలైన క్షణాల్లోనే ఆ పెళ్లి వీడియో సుమారు 20 లక్షల మందిని ఆకట్టుకుంది. అందులో కనిపించే దృశ్యం కథే అయినా.. లెబనాన్, సిరియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లకు బలవుతున్న వేలమంది చిన్నారుల జీవితాల వాస్తవిక గాధ అది. ఈ వీడియోనే కాదు... అందులోని విషయం కూడా షాక్‌కు గురి చేసేదేనని వీడియో ప్రచారకర్త మాయా అమ్మర్ అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్ల వయసు రాకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఎనిమిదేళ్ల వయసులోపు బాలికలు సుమారు కోటిన్నర మందికి 60-70 ఏళ్ల వయసువారితో బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. యుఎన్ఎఫ్ పిఏ లెక్కల ప్రకారం 2050 నాటికి ఆ లెక్కలు 120 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాల్య వివాహాలను నిషేధించడంలో భాగంగా తాజాగా లెబనాన్ ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి వివాహం రిజిస్టర్ కావడంతో బాల్య వివాహాలు అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం 14 సంవత్సరాలు వచ్చేవరకూ బాలికలకు వివాహానికి అనుమతి లేకపోయినా.. తల్లిదండ్రులు తొమ్మిదేళ్ళు వచ్చేసరికల్లా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలను పరిశీలిస్తే చట్ట ప్రకారం బాలికల పెళ్ళి వయసు కనీసం 12 ఏళ్ళుగా తెలుస్తోంది. ట్రినిడాడ్, తొబాగోల్లో 12 ఏళ్ళు, సిరియాలో 13 ఉంది. కాగా కనీసం 14 ఉండాలని కెనాన్ చట్టం చెప్తోంది. కాంగోలో 15, వెనెజులాలో 18 ఉండగా అక్కడి తల్లిదండ్రులు మాత్రం 14 లోపు వయసువారికే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలాగే బొలీవియాలో చట్టప్రకారం బాలికల పెళ్ళి వయసు 21 ఉండగా... కుటుంబీకులు 14 నుంచి 16 ఏళ్ళ వయసులోపు బాలికలను వివాహానికి అనుమతిస్తున్నారు. దీంతో మైనర్లే గర్భవతులుగా కూడ మారుతున్నారు. అలాగే ఇరాన్ లో అబ్బాయిలకు 15, అమ్మాయిలకు 13 ఏళ్ళ వయసును చట్టప్రకారం నిర్ణయించినా.. అంతకన్నా ముందే కుటుంబీకులు వివాహాలకు అనుమతిస్తున్నారు. ఇరాక్, సిరియా, యెమన్లలోనూ సుమారు 18 సంవత్సరాల వయసులో పెళ్ళి చేయాలని చట్టం చెప్తుంటే 13 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు బాలికలకే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో మాత్రం అబ్బాయికి 18, అమ్మాయికి 16 ఏళ్ళు ఉండాలని చట్టం చెప్తోంది. అయితే అంతకన్నా ముందు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే శిక్షార్హులవుతారని కూడా చట్టం హెచ్చరిస్తోంది. లిబియాలో చట్టబద్ధమైన వయసు మహిళలు, పురుషులకు 20 సంవత్పరాలుగానే ఉన్నా... అంతకు ముందు చేసుకోవాలనుకున్నవారిని కోర్టులు అనుమతిస్తున్నాయి. జోర్దాన్ లో ఎటువంటి అనుమతి అవసరం లేకుండా పెళ్ళికి ఇద్దరికీ 18 సంవత్సరాలు ఉండాలని చట్టం ఉండగా... షరియాలో అబ్బాయిలు మినహా.. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే 15 ఏళ్ళ బాలికలకు వివాహం చేసేందుకు కోర్టులు అనుమతిస్తున్నాయి. -
ఆ వరుడిని ఉరితీసేశారు
-
ఆ వరుడిని ఉరి తీశారు..
సిలాక్యాప్: ఆ వరుడు చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు, వధువు తరపు బంధువులు చేసిన విజ్ఞాపనలను ఇండోనేషియా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా కూడా ఏదైనా చేద్దామనే లోపే జరగాల్సినది జరిగిపోయింది. స్మగ్లర్‌గా, ఖైదీగా, ప్రేమికుడిగా, నవ వరుడిగా మారిన ఆండ్రూ చాన్ చివరికి పెళ్లి దుస్తులు కూడా మారకముందే ఇండోనేషియా ప్రభుత్వం చేతిలో ఉరి తీయబడ్డాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూచాన్తో సహా మొత్తం ఏడుగురు స్మగ్లర్లను ఇండోనేషియా ప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున ఉరితీసింది. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు ఉన్నారు. కాగా, ఆండ్రూచాన్ది మాత్రం ఓ తీరని విషాదం. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ చాన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడితో సహా మొత్తం తొమ్మిదిమంది 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది. ఈ కేసునే బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలుస్తారు. అంతకుముందే ఫ్యాబియంతి హెరెవిల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆండ్రూచాన్ తన చివరి కోరికగా ఆమెను జైలులోనే సోమవారం పెళ్లి చేసుకున్నాడు. ఉరిశిక్ష సమీపిస్తుండటంతో అతడి తరుపున, ఆమె తరుపునవారంతా అటు ఇండోనేషియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కన్నీటిపర్యంతమవుతూ ఆండ్రూకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వేడుకున్నారు. దీనిపై ఆస్ట్రేలియా అధికారులు ఇండోనేషియా అధికారులను సంప్రదించే ఆలోచనలు చేస్తుండగానే బుధవారం వారిని ఉరితీసినట్లు ప్రకటించారు. ఆండ్రూచాన్, హెరెవిల్లాల ప్రేమ పెళ్లి ఓ విషాదంగా మిగిలిపోయింది. నవ వధువు హెరెవిల్లాకు మింగుడు పడని వార్తగా మిగిలింది. ఇక ఉరి తీయబడిన మిగితావారిలో ఇంకొకరు ఆస్ట్రేలియా వ్యక్తికాగా, నలుగురు ఆఫ్రికా, ఒకరు బ్రెజిల్‌కు చెందినవారు. తమ రాయబారిని వెనక్కి పిలిచిన ఆస్ట్రేలియా తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులు ఆండ్రూచాన్, మిరాన్ సుకుమారన్ లను ఇండోనేషియా ప్రభుత్వం ఉరి తీసిన కారణంగా ఆదేశంలోని తమ విదేశాంగ రాయబారి జులీ బిషప్‌ను వెనుకకు వచ్చేయాల్సిందిగా ప్రధాని టోని అబాట్ బుధవారం ఆదేశించారు. ఇండోనేషియా సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని, ఆ దేశంతో సంబంధాలు తమకు ముఖ్యమైనవేనని అయితే, కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన ప్రకటన చేశారు. మరోపక్క, ఇండోనేషియా చర్యను ఫ్రాన్స్ ఖండించింది. -
ప్రేమ - పెళ్లి- ఉరి
కాన్బెర్రా: ఆ ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. వధువు ఫ్యాబియంతి హెరెవిల్లా, వరుడు ఆండ్రూ చాన్. ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుంటారు కదా.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మరోవారం రోజుల్లో ఉరి శిక్ష అమలు కాబోతున్న ఆండ్రూ చనిపోయే ముందు తమ ప్రేయసి వివాహం చేసుకోవాలనే చివరి కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే ఇక ఉరి శిక్ష తప్పదు అని తేలిపోవడంతో జైలులోనే పెళ్లి సిద్దమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ చాన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఆండ్రూ జైన్, మ్యూరన్ సుకుమారన్ సహా మరో ఏడుగురు 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది. బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలిచే కేసులో ఆండ్రూతో తొమ్మిదిమందికి ఉరిశిక్ష ఖరారయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ ...ప్రస్తుతం ఆండ్రూ శిక్ష అనుభవిస్తున్న బేసి జైల్లో సోమవారం రాత్రి వివాహం చేసుకున్నారు. బంధువులు, ఇతర ఖైదీల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగిందని ఆండ్రూ సోదరుడు మిచెల్ తెలిపారు. ఇండోనేషియన్ ప్రభుత్వం ఈ శిక్షలను ఖరారు చేస్త ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీరి ఉరి శిక్షలు ఈ వారంలో అమలు కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వీరి ఉరిశిక్షలను రద్దు చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు ఇటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, అటు ఇండోనేషియా ప్రభుత్వానికి కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. -
శ్రీలంక అమ్మాయి.. అక్కాపూర్ అబ్బాయి
మాచారెడ్డి : మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన అగరిగె రవీందర్ శ్రీలంకకు చెంది రుషానీచారుక అనే అమ్మాయిని సోమవారం అక్కపూర్లో వివాహం చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన రవీందర్ అక్కడ డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. శ్రీలంక అమ్మాయి రవీందర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కంపెనీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లినప్పుడు చారుకతో మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. చారుక తన తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారాన్ని తెల్పడంతో వారు అంగీకరించినట్లు రవీందర్ తెలిపారు. వారం రోజల కిందట చారుకతో కలిసి రవీందర్ స్వగ్రామానికి వచ్చారు. వారు హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా రుషానీచారుక మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయాలు చాలా పవిత్రమైనవి, గొప్పవని అన్నారు. ఆమె ఐ లైక్ ఇండియన్ కల్చర్ అంటూ వచ్చీరాని తెలుగులో మాట్లాడారు. ఇండియన్ సంప్రదాయలన్నా తనతో పాటు తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చాలా ఇష్టమని అన్నారు.వీసా దొరకక పోవడంతో తన తల్లిదండ్రులు పెళ్లికి రాలేకపోయారని తెలిపారు. -
శ్రీలంక అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి
నిజామాబాద్: ప్రేమకు ఎల్లలు ఉండవని మరో ప్రేమ జంట నిరూపించింది. నిజామాబాద్ యువకుడికి శ్రీలంక అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి వివాహం సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మచ్చారెడ్డి మండలం అక్కాపూర్ చెందిన ఆరిగ రవీందర్ దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఒక ఆస్పత్రిలో పని చేసే శ్రీలంక అమ్మాయి ఉషాని చారుకాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఆరిగ రవీందర్ తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఇరువురి కుటుంబాలు సమ్మతించడంతో ప్రేమ కథ సుఖాంతమైంది. ఈ ప్రేమ జంట ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. -
విధిరాత