కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు సినిమాల్లోనే జరుగుతాయి తప్ప రియల్ లైఫ్‌లో అసాధ్యం అనిపిస్తాయి. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇక్కడొక వ్యక్తి. అతన్ని చూస్తే ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని భేరుఘాట్‌లో నివాసం ఉంటున్న సౌదాసింగ్‌కు కుమారుడు రాజేంద్రకు జుల్వానియా గ్రామానికి చెందిన సుభాష్ కుమార్తె శివానితో వివాహం నిశ్చయమైంది. వధువరులిద్దరి బంధువులు ఖాండ్వాలోని భగవాన్‌పురా నివాసితులు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను ఖాండ్వాలో నిర్వహించాలని అనుకున్నారు.
ఇంతలో అనుకోకుండా వధువు ప్రమాదం బారిన పడింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే వరుడు రాజేంద్ర సినిమాలో మాదిరి హిరోలా ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు. దీన్ని అపశకునంగా భావించకుండా తమ పెద్దలు అనుక్నున్న ముహుర్తానికే ఆస్పత్రిలోనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు రోజే శివాని కాలికి చేతికి ఆపరేషన్ జరగడం గమనార్హం. సాధారణ వార్డును పెళ్లి వేడుకగా మార్చి..పండితుడి సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
వరుడు తల్లిదండ్రులు కోడలికి కూతురికి మధ్య ఉన్న అంతరం తోలగించాలనే ఈ పెళ్లిని ఆపకుండా అనుకున్న ముహుర్తానికే జరిపించామని చెప్పారు. అలాగే తమ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురై పెళ్లి ఆగిపోతే తమకు కూడా అలానే బాధగా ఉంటుందన్నారు. తమ కోడలికి నయం అయ్యేంతవరకు ఆస్పత్రిలో చికిత్సను కూడా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ.."మా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు, వారి బంధువులు ఈ పెళ్లికి సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చారు.
दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने रचाई शादी | Unseen India pic.twitter.com/A8ENcxVuis
— UnSeen India (@USIndia_) February 20, 2023
Comments
Please login to add a commentAdd a comment