ప్రేమకు ఎల్లలు ఉండవని మరో ప్రేమ జంట నిరూపించింది.
నిజామాబాద్: ప్రేమకు ఎల్లలు ఉండవని మరో ప్రేమ జంట నిరూపించింది. నిజామాబాద్ యువకుడికి శ్రీలంక అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి వివాహం సోమవారం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మచ్చారెడ్డి మండలం అక్కాపూర్ చెందిన ఆరిగ రవీందర్ దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఒక ఆస్పత్రిలో పని చేసే శ్రీలంక అమ్మాయి ఉషాని చారుకాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఆరిగ రవీందర్ తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఇరువురి కుటుంబాలు సమ్మతించడంతో ప్రేమ కథ సుఖాంతమైంది. ఈ ప్రేమ జంట ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారు.