ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు చెందిన ఎంపీ 14 ఏళ్ల మైనర్‌బాలకను పెళ్లి చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వివరాల ప్రకారం..జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, పాక్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 ఏళ్ల ఎంపీ.. 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006 అక్టోబరు 28వ తేదీన జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం మైనర్ బాలికను ఎంపీ వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని,తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు.
చదవండి : (భర్తను హతమార్చిన భార్య.. ఎందుకంటే?)
(గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!)
Comments
Please login to add a commentAdd a comment