రెండో పెళ్లి చేసుకున్న మాజీ కెప్టెన్‌ | Graeme Smith ties the knot again | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన మాజీ కెప్టెన్‌

Published Tue, Nov 5 2019 5:48 PM | Last Updated on Tue, Nov 5 2019 8:44 PM

Graeme Smith ties the knot again - Sakshi

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (38).. తన చిరకాల ప్రేయసి రోమీ లాంఫ్రాంచీని పెళ్లాడాడు..ఈ విషయాన్ని స్వయంగా స్మిత్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిలోనే ఆమెకు ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌ తొడిగిన స్మిత్‌ తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.  నవంబరు 2, శనివారం తన జీవితంలో మరిచిపోలేని లేని రోజని పోస్ట్‌ చేశారు. దీంతో దీంతో తమ అభిమాన  క్రికెటర్‌ పోస్టుకు స్పందించిన, ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు అందిస్తున్నారు.  అటు రోమీ కూడా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రగ్బీ ప్రపంచ కప్ గెలిచిన రోజున అతని వివాహం జరిగింది.

కాగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ 2011లో, ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు.  అయితే 2015, ఫిబ్రవరిలో (4 సంవత్సరాల తరువాత) ఆమెనుంచి విడిపోయాడు. వీరికి  పాప కాడెన్స్ (7),  కుమారుడు కార్టర్ (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబర్ 2016 లో, స్మిత్ స్నేహితురాలు ప్రస్తుత భార్య రోమి తన మూడవ బిడ్డ అబ్బాయికి జన్మనిచ్చింది.

2003 లో 22 సంవత్సరాల అతి చిన్న వయస్సులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్‌ తన ప్రతిభతో ఉత్తమ కెప్టెన్‌గా సేవలందించాడు.  గ్రేమ్‌ టెస్టుల్లో 108 గేమ్స్‌లో  53 విజయాలు, వన్డేల్లో 149 ఆటలలో 92 విజయాలు, టీ 20 లో 27 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో, స్మిత్  అన్ని ఫార్మాట్లలో 17000 పరుగులు చేశాడు. స్మిత్ కెరీర్‌లో టెస్టుల్లో 277, వన్డేల్లో 141 ఉత్తమ స్కోరుగా నిలిచింది.  2014లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్మిత్‌ ప్రస్తుతం,  క్రికెట్ వ్యాఖ్యాతగా విశ్లేషకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement