
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్‌కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!
ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి.

WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:
"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025
కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్‌లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.
చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమ
BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు
అలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్‌లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్‌లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్‌మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment