వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని యూఎస్ మీడియా శుక్రవారం వెల్లడించింది. గతంలో ఫాక్స్ న్యూస్ టెలివిజన్‌లో పనిచేసిన 51 ఏళ్ల కింబర్లీ గిల్‌ఫాయల్.. జూనియర్ ట్రంప్ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి కింబర్లీ ఈ రోజు(శనివారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి దక్షిణా డకోటాలో ఎన్నికల సభకు హాజరు కావాల్సి ఉండగా, తాజాగా కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తుతం ట్రంప్ ప్రచార కమిటీ బృందంలో సీనియర్ ఫండ్ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. (కరోనాపై అలర్ట్ చేసింది చైనా కాదు: డబ్ల్యూహెచ్ఓ)
ఈ విషయంపై ట్రంప్ ప్రచార ఫినాన్స్ కమిటీ చీఫ్ స్టాఫ్ సెర్గియో గోర్ మాట్లాడుతూ.. కింబర్లీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆమెకు కరోనా లక్షణాలు ఏవీ లేనప్పటికి కరోనా పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు. మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాబోయే అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జూనియర్ ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. కాగా ట్రంప్ సన్నిహిత వ్యక్తుల్లో కరోనా సోకిన వారిలో కింబర్లీ మూడవ వ్యక్తి. ఇంతక ముందు ట్రంప్ వ్యక్తిగత తోపాటు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ ఉన్నారు. (కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే! )
Comments
Please login to add a commentAdd a comment