![US Senate Delays Kash Patel Appointment As Fbi Chief](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/america.jpg.webp?itok=Czqvt2lx)
వాషింగ్టన్:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు.
ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్ 2.0లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్ అయిన కాశ్‌పటేల్ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్ పటేల్ గతంలో వ్యాఖ్యానించారు. కాష్ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.
ఈ మాటల వల్లే కాష్ పటేల్ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్ ఆమోదించలేదు. కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.
కాష్ పటేల్ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్ నేతలతో పాటు ట్రంప్ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment