Graeme Smith
-
అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లా ఆలోచించి ఉంటే..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ ఓ ఆటగాడు టైమ్ ఔట్ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్ టైమ్ ఔట్ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్ ఔట్ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్‌ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) టైమ్ ఔట్ విషయంలో బ్యాటర్ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్‌ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్ స్మిత్ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్ స్మిత్ చేసిన పనికి క్రికెట్ ప్రపంచం జేజేలు కొట్టింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో షకీబ్.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్ స్మిత్ కూడా షకీబ్లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్ ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్ ఔట్ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు. On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5 — Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023 నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..? శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం సైగలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ ఔట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదివరకే ఎలిమినేట్ అయిన బంగ్లాదేశ్‌కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌లా సెమీస్‌కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్ కూడా ఇదివరకే ఎలిమినేట్ కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నడుస్తుంది. చదవండి: మాథ్యూస్ టైమ్ ఔట్.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్ -
అలా చేస్తేనే రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడు
-
WC 2023: టీ20 లీగ్ కోసమే వన్డే సిరీస్ రద్దు! ఇది కచ్చితంగా సరైన నిర్ణయమే!
CSA T20 Challenge 2022: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని ప్రొటిస్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సమర్థించాడు. కొత్తగా ప్రవేశపెట్టనున్న టీ20 లీగ్ కోసం బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా బోర్డుతో ఎన్ని సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందన్న స్మిత్.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జనవరి 12 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, దక్షిణాఫ్రికాలో కొత్తగా టీ20 క్రికెట్ లీగ్ ఆరంభించనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా ప్రొటిస్ బోర్డు.. ఆసీస్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రేమ్ స్మిత్ కుదరదు! కానీ, అప్పటికే తమ అంతర్జాతీయ కాలెండర్ నిండిపోయిన కారణంగా తేదీలు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విధిలేక దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో నేరుగా అడుగుపెట్టే అవకాశాలను దక్షిణాఫ్రికా చేజేతులా సంక్లిష్టతరం చేసుకున్నట్లయింది. సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ప్రొటిస్.. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టాలంటే క్వాలిఫికేషన్ రౌండ్ ఆడాల్సిన పరిస్థితి. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరైందే! ఈ విషయంపై తాజాగా స్పందించిన గ్రేమ్ స్మిత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘‘సొంతగడ్డపై ఇలాంటి మ్యాచ్‌లు(టీ20) ఆదాయం తెచ్చిపెడతాయి. మా క్రికెట్ లీగ్ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో అన్ని రకాలుగా చర్చించాం. రీషెడ్యూల్ విషయమై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాం. అయినా, వర్కౌట్ కాలేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా టి20 లీగ్‌కు గ్రేమ్ స్మిత్ కమిషనర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా సెప్టెంబరులో టీమిండియా పర్యటనకు రానున్నట్లు బీసీసీఐ బుధవారం ధ్రువీకరించింది. భారత్‌లో ప్రొటిస్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చదవండి: South Africa T20 League: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్ తలపిస్తోంది Zim Vs Ban: మరీ జింబాబ్వే చేతిలోనా.... అస్సలు ఊహించలేదు! మాకిది ఘోర అవమానం! -
కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
క్రికెట్లో అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్), టి10 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక వీటి జాబితాలోకి సౌతాఫ్రికా కూడా చేరనుంది. క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సౌతాఫ్రికా టి20 లీగ్ పేరిట కొత్త టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీ వెనుక పరోక్షంగా ఐపీఎల్ ప్రాంచైజీలు ఉండడం విశేషం. మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ పేర్లతో ఉన్న ప్రాంచైజీలను ముంబై ఇండియన్స్, సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి. ఈ కొత్త టి20 లీగ్‌కు ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా ఎన్నో ఘనతలు సాధించిన స్మిత్.. తాజాగా సీఎస్ఏలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్(డీఓసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌతాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలని.. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు సీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా ఎంపికైన స్మిత్ స్పందించాడు. ''కొత్త తరహా టోర్నీకి కమిషనర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా క్రికెట్‌కు పనిచేయడానికి ఎంత సమయమైనా సంతోషంగా కేటాయిస్తా. ఇలాంటి పోటీతత్వం ఉన్న కొత్త టి20 లీగ్‌ను నడిపించేందుకు దైర్యం కావాలి. అది ఉందనే నమ్ముతున్నా. దేశవాలీ క్రికెట్లో మనకు తెలియని అద్బుత ఆటగాళ్లను వెలికి తీయాలనేదే సీఎస్ఏ ప్రధాన ఉద్దేశం. అందుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆరంభ దశలో సక్సెస్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలెట్సీ మోసికీ కొత్త బాధ్యతలు తీసుకున్న గ్రేమీ స్మి్త్‌కు శుభాకాంక్షలు తెలపగా.. దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ రెండు నెలల విండో క్రికెట్‌కు అనుమతించాలని బీసీసీఐ ఐసీసీని కోరగా.. అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆటంకం లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించాలని సీఎస్ఏ భావిస్తోంది. ఇక గ్రేమి స్మిత్ దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక ఆల్‌టైమ్ టెస్టు కెప్టెన్లలో స్మిత్ పేరు కూడా ఉంటుంది. సౌతాఫ్రికాకు 54 టెస్టుల్లో విజయాలు అందించి.. అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. 2003లో షాన్ పొలాక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న స్మిత్.. 2014లో తాను రిటైర్ అయ్యే వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగడం విశేషం. ఇక బ్యాటింగ్‌లోనూ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్స్ జాబితాలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. 2002-2014 వరకు సౌతాఫ్రికా తరపున స్మిత్ 117 టెస్టుల్లో 9265 పరుగులు, 197 వన్డేల్లో 6989 పరుగులు, 33 టి20ల్లో 982 పరుగులు సాధించాడు. స్మిత్ ఖాతా 27 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు ఉన్నాయి. చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ
Racism In Cricket South Africa: ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారులపట్ల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లపై సౌతాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారికంగా విచారణ ప్రారంభించనుంది. ప్రస్తుతం స్మిత్ సీఎస్ఏ డైరెక్టర్‌గా, బౌచర్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్లో జాతివివక్షకు సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్) ఇటీవల ఇచ్చిన నివేదికలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు. ఎస్‌జేఎన్ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై సీఎస్ఏ మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. నివేదికలో పై ఇద్దరితో పాటు ఏబీ డివిలియర్స్ పేరు కూడా ఉంది. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ నిమిత్తం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఓవైపు సిరీస్ కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రస్తుత హెడ్‌కోచ్, డైరెక్టర్‌పై సీఎస్ఏ అధికారిక విచారణకు ఆదేశించడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! IND VS SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. క్రికెట్ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక! -
Ashes Series: సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్
Ashes Series Adelaide Test: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కెరీర్లో మరో రికార్డు చేరింది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అతడు ఐదో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును అధిగమించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా 1563 పరుగులు పూర్తి చేసుకుని ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన జో రూట్ బృందం దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు హసీబ్ హమీద్(6), రోరీ బర్న్స్'(4) విఫలమైనా... డేవిడ్ మలన్, జో రూట్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు: ►మహ్మద్ యూసఫ్(2006)- 1788 పరుగులు ►వివియన్ రిచర్డ్స్(1976)- 1710 పరుగులు ►గ్రేమ్ స్మిత్(2008)- 1656 ►మైఖేల్ క్లార్క్(2012)- 1595 ►జో రూట్(2021)- 1563 (నాటౌట్) ►సచిన్ టెండుల్కర్(2010)- 1562 పరుగులు ►సునిల్ గావస్కర్(1979)- 1555 పరుగులు చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం -
తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని బెదిరించారు..
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా ఆ దేశ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ దేశ దిగ్గజ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆ దేశ క్రికెట్లో సంచలనం రేపుతోంది. సఫారీ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌లపై అదే దేశానికి చెందిన నల్లజాతి క్రికెటర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే జాత్యాంహంకార ఆరోపణలు చేశాడు. గతంలో (2011-2015) ఐదేళ్ల పాటు తాను నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సమయంలో నాటి కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఏబీడీలు తనకు సరైన అవకాశాలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకున్నారని, తనను జట్టులోకి తీసుకుంటే రిటైరవుతామని కూడా బెదిరించారని సోలికెలే ఆరోపించాడు. ఆ ఇద్దరు తనను తొక్కేశారని, అందువల్లే బ్యాకప్ ప్లేయర్‌గా మిగిలిపోయానని పేర్కొన్నాడు. 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనకు, కేవలం మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కిందని వాపోయాడు. నాడు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్రేమ్ స్మిత్‌కు నేను జట్టులో ఉండటం అస్సలు ఇష్టం లేదని జాతీయ సెలక్షన్ కన్వీనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఆరోపణలు చేశాడు. 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో రెగ్యులర్ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడని, తనకు తుది జట్టులో చోటు ఖాయమని సెలక్టర్ హడ్సన్ చెప్పాడని పేర్కొన్నాడు. అయితే, అప్పటివరకు ఎన్నడూ వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు జట్టులో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడని ఆరోపించాడు. గ్రేమ్ స్మిత్, ఏబీడీలకు నల్ల జాతీయులతో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకోవడమన్నా, వారితో మాట్లాడటమన్నా అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు. నేను తన జట్టులో ఉండడం గ్రేమ్ స్మిత్‌కు ఇష్టం లేదని స్వయానా సెలక్టర్లే తనతో చెప్పినట్లు తెలిపాడు. కాగా, తమీ సోలెకిలే తన ఐదేళ్ల కాంట్రాక్ట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలు విదేశీ టూర్లకు ఎంపికయ్యాడు. -
టీమ్‌మేట్స్‌ను ఎంటర్టైన్ చేసిన జడేజా
ముంబై: గత ఐపీఎల్ సీజన్లో ఘోరంగా చతికిలబడ్డ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించిన సీఎస్కే.. ఆపై హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలిచిన సీఎస్కే టాప్‌ను ఆక్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సీఎస్కేకు పరాజయం ఎదురుకాగా, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్‌లపై విజయం సాధించింది ధోని అండ్ గ్యాంగ్. కోల్‌కతాపై విజయం తర్వాత సీఎస్కే మంచి ఎంటర్టైన్ మూడ్‌లో కనిపించింది. ప్రధానంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన టీమ్‌మేట్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ వారిలో నవ్వులు పూయించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరించి తన యాక్టింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసే క్రమంలో కాళ్లను బాగా ఎడంగా చాపడమే కాకుండా, చేతుల్ని కూడా కాళ్లకు సమానంగా ఉండేటట్లు చూసుకుని ఆడేవాడు. దీన్ని అనుకరించాడు జడేజా. ఈ అనుకరణను చూసిన సహచర సీఎస్కే ఆటగాళ్ల ఒక్కసారిగా నవ్వగా, ఆ వీడియోను జడేజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక్కడ చదవండి: వైరల్: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! View this post on Instagram A post shared by CricTracker (@crictracker) -
క్రికెట్లో ‘కొల్పాక్’ ఖేల్ ఖతం
కేప్‌టౌన్: గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ను బాగా దెబ్బ తీసిన కొల్పాక్ ఒప్పందం కథ ముగిసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాలకు చెందిన వ్యక్తులకు వర్క్ పర్మిట్‌తో ఈయూ ఉద్యోగుల తరహాలోనే అన్ని హక్కులు వర్తిస్తాయి. దీనిని ఉపయోగించుకొని కైల్ అబాట్, ఒలివర్, రిలీ రోసో, సైమన్ హార్మర్వంటి పలువురు కీలక ఆటగాళ్లు సహా 45 మంది క్రికెటర్లు సునాయాసంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడే అనుమతి పొంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు. కొల్పాక్ ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లకు మళ్లీ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం ఉండదు. ఈ కారణంగా దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ బాగా బలహీన పడింది. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. దాంతో కొల్పాక్ ఒప్పందాలకు ఇకపై అవకాశం లేదు. ఇప్పుడు సఫారీ ఆటగాళ్లంతా సొంతగడ్డపైనే తమ సత్తాను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వెళ్లిపోయిన వారి పట్ల కూడా తాము కఠిన వైఖరి అవలంబించమని, తిరిగి వస్తే స్వాగతిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ కొత్త డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రకటించాడు. ‘కొల్పాక్ కథ ముగిసిపోయింది కాబట్టి మా దేశపు అత్యు త్తమ ఆటగాళ్లంతా ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాం. వస్తారా లేదా అనేది వారిష్టం. వారిని ప్రోత్సహించడం మా బాధ్యత. వారంతా మళ్లీ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో ఆడితే వారి ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేయడానికి అభ్యంతరం లేదు’ అని స్మిత్ స్పష్టం చేశాడు. -
డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) డైరెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన రోజే గ్రేమ్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా తాత్కాలిక టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్వింటాన్ డీకాక్‌ను తప్పించాడు. గత డిసెంబరులో సీఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితుడైన స్మిత్.. తాజాగా పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 2022, మార్చి 20 వరకూ స్మిత్ ఈ పదవిలో కొనసాగుతాడు.. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్‌గా డీకాక్‌ను తొలగిస్తున్నట్లు తెలిపాడు. డుప్లెసిస్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక కెప్టెన్‌గా డీకాక్‌ను నియమించారు. ఇప్పుడు డీకాక్‌ను తప్పిస్తూ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కాగా, ఇంకా ఎవరిని నియమిస్తారన్న చర్చ మాత్రం తనకు సవాలుగా నిలిచిందన్నాడు. (గ్రేమ్ స్మిత్.. మరో రెండేళ్లు!) ‘వన్డే జట్టు కెప్టెన్‌గా, కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా డీకాక్‌పై పెద్ద బాధ్యతలున్నాయి. అందువల్ల డికాక్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం లేదు. డీకాక్ నుంచి ఇంకా స్థిరమైన ప్రదర్శన కోరుకుంటున్నాము. టెస్టులకు కూడా కెప్టెన్ ఉంటే అతనిపై ఒత్తిడి పెరుగుతుంది. అది జట్టుకు ప్రయోజనకరం కాదు’ అని స్మిత్ తెలిపాడు. కాగా, మరి టెస్టు కెప్టెన్ ఎవరు అనే దానిపై స్మిత్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉందని స్మిత్ తెలిపాడు. తాను ఇచ్చే కచ్చితమైన సమాధానం ఏదైనా ఉందంటే అది డీకాక్‌ను తప్పించడమే కానీ, ఆ స్థానం ఎవరిది అనే దానిపై ఇప్పుడే చెప్పలేనన్నాడు. కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మాత్రమే డీకాక్ ఉంటాడని, టెస్టు ఫార్మాట్‌కు కాదన్నాడు. త్వరలో వెస్టిండీస్ సిరీస్ ఉన్న తరుణంలో అది జరుగుతుందా.. లేదా అనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేనన్నాడు. కరోనా వైరస్ కారణంగా విండీస్‌తో సిరీస్‌పై పూర్తిస్థాయి స్పష్టత లేదన్నాడు. -
దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్‌గా గ్రేమ్ స్మిత్
జోహన్నెస్‌బర్గ్: క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) పూర్తిస్థాయి డైరెక్టర్‌గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ శుక్రవారం నియమితుడయ్యాడు. గతేడాది డిసెంబర్ నుంచి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న 39 ఏళ్ల స్మిత్ రానున్న రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్ఏ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫౌల్ ప్రకటించారు. తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరునెలల పని కాలంలో కఠిన శ్రమ, అనుభవం, అంకితభావంతో స్మిత్ అద్భుత ఫలితాలు సాధించాడని జాక్వెస్ కొనియాడారు. స్మిత్ 2003–14 మధ్య కాలంలో 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 108 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పూర్తిస్థాయి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రేమ్ స్మిత్ వచ్చీరాగానే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సఫారీ టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి డికాక్‌ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. -
గ్రేమ్ స్మిత్.. మరో రెండేళ్లు!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. గతేడాది డిసెంబర్లో సీఎస్ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించబడ్డ స్మిత్‌ను రెండేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకుంది. స్మిత్‌ను తాత్కాలిక డైరక్టర్‌గా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వరకే నియమించారు. కాగా, సీఎస్ఏ డైరక్టర్‌గా 2022, మార్చి నెల వరకూ స్మిత్ కొనసాగనున్నట్లు తాజా ప్రకటనలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాక్వస్ ఫాల్ తెలిపారు. ‘ స్మిత్ మా క్రికెట్‌కు మూలస్తంభం. దక్షిణాఫ్రికా క్రికెట్లో పరివర్తనకు స్మిత్ గేమ్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!) తాత్కాలిక పదవీ కాలంలో స్మిత్ అద్భుతంగా పనిచేశాడని, మెరుగైన ప్రణాళికలతో ముందుండి నడిపించాడు.అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్‌గా లిండా జోండి సహా అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టాడని, అందుకే స్మిత్‌కు పూర్తిస్థాయి క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు జాక్వస్ ఫాల్ తెలిపాడు. ఇక తన పదవీ కాలం పొడిగించడంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించడంతో రోడ్ మ్యాప్‌పై ప్లానింగ్ అనేది సులభం అవుతుంది. జాక్వస్ ఫాల్ చెప్పినట్లు నా ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ను మెరుగుపరచడమే కాకుండా కిందిస్థాయి(దేశవాళీ) క్రికెట్‌ను పటిష్టం చేసుకుంటూ రావాలి’ అని స్మిత్ స్పష్టం చేశాడు. (ఏయ్ కోహ్లి.. చౌకా మార్!) -
దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా బౌచర్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా జట్టు హెడ్ కోచ్‌గా మాజీ టెస్టు వికెట్ కీపర్ మార్క్ బౌచర్ శనివారం నియమితులయ్యాడు. అతను ప్రొటీస్ జట్టుకు 2023 వరకు కోచ్‌గా పనిచేస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ తాత్కాలిక డైరెక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తెలిపాడు. బుధవారం తాత్కాలిక డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గ్రేమ్ స్మిత్ వెంటనే జట్టు కోచింగ్ సిబ్బంది నియామకంపై దృష్టి సారించాడు. హెడ్ కోచ్‌గా 43 ఏళ్ల మార్క్ బౌచర్‌తో పాటు, అసిస్టెంట్ కోచ్‌గా ఇనోచ్ ఎన్వే, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు కోచ్‌గా మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ యాష్వెల్ ప్రిన్స్‌ను నియమించాడు. మరో వారం రోజుల్లో సీనియర్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్స్ను నియమిస్తానని తెలిపాడు. బౌచర్ 147 టెస్టులు, 290 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కంటికి తీవ్ర గాయం కావడంతో అతను ఆటకు స్వస్తి పలికాడు. -
రెండో పెళ్లి చేసుకున్న మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (38).. తన చిరకాల ప్రేయసి రోమీ లాంఫ్రాంచీని పెళ్లాడాడు..ఈ విషయాన్ని స్వయంగా స్మిత్ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిలోనే ఆమెకు ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగిన స్మిత్ తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నవంబరు 2, శనివారం తన జీవితంలో మరిచిపోలేని లేని రోజని పోస్ట్ చేశారు. దీంతో దీంతో తమ అభిమాన క్రికెటర్ పోస్టుకు స్పందించిన, ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అటు రోమీ కూడా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రగ్బీ ప్రపంచ కప్ గెలిచిన రోజున అతని వివాహం జరిగింది. కాగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2011లో, ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే 2015, ఫిబ్రవరిలో (4 సంవత్సరాల తరువాత) ఆమెనుంచి విడిపోయాడు. వీరికి పాప కాడెన్స్ (7), కుమారుడు కార్టర్ (6) అనే ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబర్ 2016 లో, స్మిత్ స్నేహితురాలు ప్రస్తుత భార్య రోమి తన మూడవ బిడ్డ అబ్బాయికి జన్మనిచ్చింది. 2003 లో 22 సంవత్సరాల అతి చిన్న వయస్సులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్ తన ప్రతిభతో ఉత్తమ కెప్టెన్‌గా సేవలందించాడు. గ్రేమ్ టెస్టుల్లో 108 గేమ్స్‌లో 53 విజయాలు, వన్డేల్లో 149 ఆటలలో 92 విజయాలు, టీ 20 లో 27 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో, స్మిత్ అన్ని ఫార్మాట్లలో 17000 పరుగులు చేశాడు. స్మిత్ కెరీర్లో టెస్టుల్లో 277, వన్డేల్లో 141 ఉత్తమ స్కోరుగా నిలిచింది. 2014లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్మిత్ ప్రస్తుతం, క్రికెట్ వ్యాఖ్యాతగా విశ్లేషకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 2 November was an incredible day!!❤️ #wedding #love #beloftebos #family #friends #blendedfamily #Celebrations 😍💍 pic.twitter.com/8Ft5R9xM1r — Graeme Smith (@GraemeSmith49) November 4, 2019 View this post on Instagram I am not often at a loss for words, but today I am. There are no words to describe the perfection of our special day. To say everything exceeded all our expectations is an understatement to say the least. We cannot thank all our family, friends, venue hosts and incredible service providers enough. My cup runneth over. That is all ❤️ A post shared by Romy Lanfranchi Smith (@stansfield1) on Nov 4, 2019 at 2:01am PST -
అసలు మీరు ఆడితేనే కదా?
రాంచీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్కు వెళ్లే క్రమంలో బావుమాను వెంట తీసుకురావడంపై ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇంతకంటే దయనీయ పరిస్థితి మరొకటి ఉంటుందా అంటు చురకలంటించాడు. ఇలా టాస్కు కెప్టెన్ హోదాలో ఉన్న మరొక క్రికెటర్‌ను తీసుకురావడం తమ ఆటగాళ్ల మైండ్‌సెట్‌కు అర్థం పడుతోందన్నాడు. ‘ మీ మైండ్ సెట్ సరిగా లేకనే టాస్కు వేరొక క్రికెటర్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది చాలా దయనీయమైన, కొద్దిపాటి విషాదకరమైన అంశం. ఈ విషయం నన్ను తీవ్ర నిరూత్సాహానికి గురి చేసింది. గేమ్ ఓడిపోయినందుకు తప్పుడు కారణాలు వెతుక్కుంటున్నారు. మీ దురదృష్టం కొద్ది సరిగా ఆడలేదు. దాంతో సిరీస్ కోల్పోయారు. ఉపఖండలో టాస్‌ది కీలక పాత్రే.. అది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నువ్వు బాగా ఆడినప్పుడు ఈ తరహా సెంటిమెంట్‌తో అవసరం లేదు. పూర్తిస్థాయిలో ఆడండి.. అంతేకానీ టాస్లకు కెప్టెన్ల కాకుండా వేరే వాళ్లు వెళ్లడం నాకు అసహ్యంగా అనిపించింది’ అని స్మిత్ పేర్కొన్నాడు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో డుప్లెసిస్ టాస్ కోల్పోవడంతో అందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాడు. టాస్కు తాను కాకుండా వేరే వాళ్లను తీసుకెళ్లాలని భావించి బావుమాను వెంటబెట్టుకెళ్లాడు. కాకపోతే టాస్‌ను టీమిండియానే గెలవడంతో డుప్లెసిస్ టాస్ రాత మారలేదు. కాగా, ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా జట్టు టాస్ ఓడిపోవడం వరుసగా 10వసారి కావడం గమనార్హం. -
‘విరాట్ కోహ్లినే అతిపెద్ద సూపర్‌స్టార్’
కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని క్రికెట్లో ‘సూపర్ స్టార్’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్‌ను సజీవంగా ఉంచగలిగే ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడని తెలిపాడు. శుక్రవారం(నవంబర్ 2)న కోల్‌కతాలో జగ్మోహన్ దాల్మియా వార్షిక కాన్క్లేవ్ లో ప్రసగించిన గ్రేమ్ స్మిత్.. ‘ఈ ఏడాది కోహ్లికి బాగా కలిసొచ్చింది. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగులు చేయడం, వరుసగా సెంచరీలు చేసి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తన విలువను పెంచుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో సూపర్స్టార్ల కొరత ఎక్కువైంది. ఇంగ్లండ్‌లో ఒకరిద్దరు ఉన్నారు. మిగతా వాళ్లలో విరాట్ కోహ్లి అతిపెద్ద సూపర్‌స్టార్. టెస్ట్‌లంటే అతనికి ప్రాణం. అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. దేశంలో ఐపీఎల్, టీ20లతో సమానంగా ఈ ఫార్మాట్‌కు ఆదరణ తెస్తున్నాడు. టెస్ట్‌లను విరాట్ కోహ్లి ప్రమోట్ చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా లేదు’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. -
భువీ బౌలింగ్ ఎలా ఆడాలో తెలుసా!
జొహన్నెస్‌బర్గ్: తొలి టీ20లో టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పదునైన బంతులకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు దాసోహమయ్యారు. 5/24తో చెలరేగిన భువీ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే భువీ అద్భుత ప్రదర్శనపై సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ స్పందించాడు. ప్రత్యర్థి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిగా కంటే కామెంటెటర్‌గా భువీ బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు. భువీ బౌలింగ్ స్కిల్స్ ప్రొటీస్ బౌలర్లు కంటే మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చాడు. భువనేశ్వర్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్న సఫారీ ఆటగాళ్లకు గ్రేమ్ స్మిత్ కొన్ని సూచనలిచ్చాడు. 'స్టార్ బౌలర్ భువనేశ్వర్‌ను అంత తేలికగా తీసుకోవద్దు. భువీ బంతులు సంధించే తీరు అద్భుతం. లెగ్ కట్టర్స్, నకుల్ బాల్, స్వింగ్ బంతులతో ఆతిథ్య జట్టును కట్టడి చేస్తున్నాడు భువీ. కావాలంటే తొలి టీ20 మ్యాచ్ వీడియోను పరిశీలించండి. భువనేశ్వర్ బంతులు ఎలా వేస్తున్నాడో గమనించండి. తర్వాతి మ్యాచ్‌లో ఎలా ఆడాలో మీకే అర్థమవుతోంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తుంటే.. సఫారీలు అన్ని విభాగాల్లో సమష్టిగా వైఫల్యం చెందుతున్నారని' అభిప్రాయపడ్డాడు స్మిత్. -
భారత్ విజయాల్లో ఆ ఇద్దరు కీలకం
సెయింట్ మోర్టిజ్ : భారత్ వరుస విజయాలను చూస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్టిజ్‌లో జరుగుతున్న ఐస్ టీ20 టోర్నీ ఆడేందుకు వచ్చిన స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్ ఆటగాళ్లు సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించడానికి అర్హులు. గాయాలతో దూరమైన కీలక ఆటగాళ్ల స్థానాలు భర్తీ చేయడానికి ప్రొటీస్ యువ ఆటగాళ్లు సిద్దంగా లేరనిపిస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ భవిష్యత్తుపై సందేహం కలుగుతోంది. క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే దిశగా యువ ఆటగాళ్లను తయారు చేయాలి. ఈ ఓటములతో నేను చాలా నిరాశా చెందాను. కానీ క్రెడిట్ భారత జట్టుదే. వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. సరిగ్గా ప్రపంచకప్ ముందే ఇంత పెద్ద సిరీస్‌లో వరుసగా ఓడిపోవడం నిరాశ చెందే విషయమే. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడం మాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆటగాళ్లు వారి సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలి. కనీసం పోరాటపటిమనైన కనబర్చాలని’ స్మిత్ అభిప్రాపడ్డారు. చెత్త బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా చెత్త బ్యాటింగే ఓటములకు కారణమని స్మిత్ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవుతున్నారని, ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్లో స్పిన్‌ను ఎదుర్కొన్న అనుభవం గల డుమినీ, మిల్లర్లు రాణించలేక పోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక భారత స్పిన్నర్లు చాహల్-కుల్దీప్లు అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా ఈ మణికట్టు స్పిన్నర్లు మిడిల్ఓవర్లలో దెబ్బతీస్తున్నారని, ఇదే భారత విజయానికి దోహదపడుతుందన్నారు. ఇక చివరి టెస్టు ముందు కోహ్లి కెప్టెన్సీకి పనికిరాడని సంచలన వ్యాఖ్యలు చేసిన స్మిత్.. వరుస విజయాలనంతరం భారత జట్టును కొనియాడడం చర్చనీయాంశమైంది. చివరి టెస్టు నుంచి గత మూడో వన్డే వరకు భారత్ ఆతిథ్య జట్టుపై వరుస విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో కోహ్లి దూకుడు మీదుండగా యువ స్పిన్నర్లు కుల్దీప్, చహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌లను భారత్ వైపు తిప్పేస్తున్నారు. -
కోహ్లిపై అంత పరుషమైన విమర్శలా..!
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి.. విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరోసారి మాజీ సారథి సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రెహం స్మిత్ చేసిన విమర్శలను గంగూలీ తోసిపుచ్చారు. స్మిత్ చేసిన విమర్శలు చాలా పరుషంగా ఉన్నాయని అన్నారు. స్వదేశంలో, ఉపఖండంలో వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్ విజయాలు భారత్‌కు అందించిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఆ విజయపరంపరను కొనసాగించలేకపోయాడు. కేప్‌టౌన్, సెంచూరియన్లలో జరిగిన టెస్టుల్లో కోహ్లి టీమ్ సెలక్షన్, వ్యూహాత్మక నిర్ణయాలు పలు ప్రశ్నలకు తావిచ్చాయి. విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మంచి రికార్డు ఉన్న అజింక్యా రహానేను బెంచికే పరిమితం చేయడం, టీమిండియా బెస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్‌ను రెండో టెస్టుకు కోహ్లి తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. రెండో టెస్టు అనంతరం ఈ విషయమై మీడియా అడిగిన కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కోహ్లి అసహనానికి లోనై.. చిర్రుబుర్రులాడాడు. ఈ నేపథ్యంలో స్మిత్ స్పందిస్తూ.. టీమిండియాకు దీర్ఘకాలిక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి సరైన ఆప్షన్ కాదని పేర్కొన్నాడు. కోహ్లికి వ్యూహాత్మక సామర్థ్యాలు ఉన్నప్పటికీ.. జట్టు నుంచి నిర్మాణాత్మక సలహాలు తీసుకొని.. అందరినీ కలుపుకొని ముందుకునడిచే వాతావరణం కల్పిస్తేనే మంచి నాయకుడిగా ఎదుగుతాడని స్మిత్ చెప్పుకొచ్చాడు. స్మిత్ వ్యాఖ్యలతో గంగూలీ విభేదించారు. ‘స్మిత్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. విరాట్ యువసారథి. కెప్టెన్‌గా అతనికిది తొలి పూర్తిస్థాయి విదేశీ పర్యటన. ఇంత పరుషమైన ప్రకటన చేయడం సరికాదు. విరాట్ మంచి వ్యక్తి. కొన్ని నెలల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నాయి. అక్కడ అతను నేర్చుకుంటారు. స్మిత్ గొప్ప కెప్టెనే కానీ, కోహ్లిపై అతని అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు’ అని గంగూలీ పేర్కొన్నారు. అదే సమయంలో రహనేను పక్కనబెట్టాలన్న కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై గంగూలీ విస్మయం వ్యక్తం చేశారు. విదేశీ టెస్టులకు రహానే తప్పనిసరి అని సూచించారు. -
‘భారత్ కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడు’
కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా : భారత క్రికెట్ జట్టును ఎక్కువ కాలం ముందుకు నడిపే శక్తి సామర్ధ్యాలు విరాట్ కొహ్లీకి లేవని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. వాండరర్స్ మైదానంలో దక్షిణాఫ్రికా భారత్‌ల మధ్య చివరి టెస్టుకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. కొహ్లీ క్రికెట్ ప్రపంచంలో గొప్ప ఆటగాడే కావొచ్చని, జట్టు సభ్యుల గురించి పట్టించుకోని గొప్ప ఆటగాడు నాయకుడు ఎన్నటికీ కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 22 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న స్మిత్.. కెప్టెన్ అనే వ్యక్తితో జట్టులోని ఆటగాళ్లందరూ కలసి నడవాలని చెప్పారు. అందుకు నాయకుడు నిరంతరం వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉండటం మంచిదని చెప్పారు. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కొహ్లీ మాటే వేదంలా భావిస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పారు. విరాట్ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని, ఒక నిర్ణయంపై డిబేట్ జరిగితేనే సరైన జవాబు దొరుకుతుందని అన్నారు. కొహ్లీకి చుట్టు పక్కల ఉండే వ్యక్తుల్లో ఎవరైనా ఈ పని చేయాలని చెప్పారు. అప్పుడే నిర్మాణాత్మక దిశగా సాగే ఆలోచన కొహ్లీని మచ్చలేని నాయకుడిగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. ఫీల్డింగ్ సమయంలో కొహ్లీ రియాక్షన్స్ జట్టులోని ఇతర ఆటగాళ్లను నెగటివ్ ఆలోచనలను రేకెత్తించే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ ఏడాది విదేశీ గడ్డలపై భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది విరాట్‌పై ఒకింత ఒత్తిడిని పెంచుతుందని అన్నారు. భారత టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువగా విరాట్‌పై ఆధారపడుతున్నామా? అనే అంశంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన మూడో టెస్టు బుధవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
భారత్‌కు కష్టాలే: స్మిత్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్‌తో భారత్‌కు కష్టాలు తప్పవని ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నారు. ఈ పర్యటనలో టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. జనవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్మిత్ మాట్లాడుతూ ‘మా జట్టు పటిష్టంగా ఉంది. డివిలియర్స్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగింది. బౌలింగ్ కూడా అత్యంత శక్తిమంతంగా ఉంది. నలుగురు అనుభవజ్ఞులైన పేసర్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది’ అని అన్నారు. స్పిన్‌కు సహకరించే కేప్‌టౌన్ వేదిక భారత్‌కు అనుకూలించే అవకాశమున్నా... తదుపరి ప్రిటోరియా (రెండో టెస్టు), జొహన్నెస్‌బర్గ్ (మూడో టెస్టు)లు పూర్తిగా పేస్ పిచ్‌లని... అక్కడ కోహ్లి సేనకు పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. అయితే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ భారీ స్కోర్లు చేస్తే గట్టెక్కే అవకాశముందని స్మిత్ వివరించారు. ‘భారత ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లిలే కీలకం. వీళ్లిద్దరు గత టూర్లో అద్భుతంగా ఆడారు’ అని కితాబిచ్చారు. ఉమేశ్, షమీ, భువీ, ఇషాంత్, బుమ్రాలలో ముగ్గురు రాణిస్తే భారత్ సిరీస్‌లో విజయవంతం అయ్యే అవకాశాలున్నాయని స్మిత్ విశ్లేషించారు. భారత ఉపఖండంలో బౌలర్లు చిన్న చిన్న స్పెల్స్‌తో సరిపెట్టేయవచ్చని... కానీ సఫారీలో బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. -
కోహ్లికి అంత ఈజీ కాదు!
కేప్‌టౌన్ :ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్‌గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి అసలు సిసలైన పరీక్ష ముందన్నదని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న టీమిండియా సారథికి కఠిన పరీక్ష తప్పదని స్మిత్ అభిప్రాయపడ్డాడు. తమ పిచ్ ల్లో కోహ్లి రాణించడం అంత ఈజీ కాదని, అదే అతని బ్యాటింగ్ లో సత్తాకు సవాల్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'టెస్టు క్రికెట్ లో టీమిండియా అదరగొడతుంది. భారత్ విజయాల్లో కెప్టెన్ కోహ్లి భాగస్వామ్యం అధికం. బ్యాట్ తో రాణిస్తూ జట్టుకు వరుస విజయాల్ని కోహ్లి అందిస్తున్నాడు. భారత్ తో శ్రీలంక, కరీబియర్ పిచ్ ల్లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తుంది.అయితే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ రాణించడం అనుకున్నంత ఈజీ కాదు. శ్రీలంక, కరీబియన్లలో బంతి బ్యాట్ మీదకి స్లోగా వస్తుంది. సఫారీ పిచ్ లు అందుకు భిన్నం. ఈ నేపథ్యంలో మా గడ్డపై భారత జట్టు కఠినమైన సవాల్ ఎదుర్కోవడం ఖాయం'అని స్మిత్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ ఏబీ డివిలియర్స్ తీసుకున్న నిర్ణయాన్ని స్మిత్ స్వాగతించాడు. అదే సమయంలో డు ప్లెసిస్ కు వన్డే సారథ్య బాధ్యతల్ని సైతం అప్పచెబితే బాగుంటుందన్న ఏబీ అభిప్రాయాన్ని స్మిత్ కూడా సమర్ధించాడు. టెస్టుల్లో, టీ 20ల్లో అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్న డు ప్లెసిస్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మానసికంగా జట్టు పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు. -
భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు రచిస్తున్నారు . గురువారం భారత్- శ్రీలంక మ్యచ్‌లో శ్రీలంక గెలుపుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచనలే కారణమని కెప్టెన్ మాథ్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు సంగక్కర శ్రీలంక ఆటగాళ్ల శిక్షణ శిభిరంలో పాల్గొని యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ టిప్స్ అందించాడు. ఈ సూచనలు అమలు చేసిన లంకేయులు భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఆ దారిలోనే సఫారీలు నడుస్తున్నారు. ఇక ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో భారత్‌ను మట్టికరిపించేందుకు ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సలహాలు తీసుకుంటున్నారు. శుక్రవారం సఫారీల ప్రాక్టీస్ సెషన్లో గ్రేమ్ స్మిత్ పాల్గొన్నాడు. సుమారు 35 నిమిషాలపాటు వారి శిక్షణను గమనించాడు. ఆ జట్టు ప్రధాన కోచ్ రస్సెల్ డొమింగో, సహాయక సిబ్బందితో భారత్ మ్యాచ్‌కు అనుసరించే ప్రణాళికలపై ముచ్చటించాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకంజీతో ప్రస్తావించగా.. గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా గొప్ప కెప్టెన్ అని ఆయన సూచనలు ఆటగాళ్లకు విలువైనవని బదులిచ్చాడు. భారత్ జరిగే మ్యాచ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్దం కావాలని స్మిత్ తన అభిప్రాయాలను ఆటగాళ్లతో పంచుకున్నాడని నీల్ పేర్కొన్నాడు. స్మిత్ చాంపియన్స్ ట్రోఫీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
నేను క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేను!
లండన్: తాను రాబోవు ఇంగ్లిష్ కౌంటీలో ఆడటానికి సిద్ధంగా లేనని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. ఇంగ్లిష్ కౌంటీల్లో భాగంగా సర్రే స్టింట్ తో మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నస్మిత్ ప్రస్తుతం ఆ లీగ్ కు దూరంగా ఉండనున్నాడు. ఆ కౌంటీ నుంచి పిలుపు వచ్చిన అనంతరం స్మిత్ స్పందించాడు. 'నేను వచ్చే ఇంగ్లిష్ లీగ్ లో ఆడలేను. నా గాయం పూర్తిగా నయం కాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్రేకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా పాత్ర సమర్ధవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా లేను' అంటూ పేర్కొన్నాడు. గత సంవత్సరం మే నెల్లో స్మిత్ కు మోకాలు చిట్లడంతో క్రికెట్ కు దూరమయ్యాడు. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్న డాక్టర్లు స్మిత్ ను క్రికెట్ కు దూరంగా ఉండమని సూచించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో చాలా గేమ్ లను స్మిత్ వదులుకోక తప్పలేదు. తాజాగా ఇంగ్లిష్ కౌంటీతో ఒప్పందం నేపథ్యంలో స్మిత్ మరోసారి క్రికెట్ దూరంగా ఉంటున్నందుకు ఆవేదన వ్యక్తం చేశాడు. -
బై... బై... కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్‌కు గ్రేమ్ స్మిత్ వీడ్కోలు ఆస్ట్రేలియాతో ఆడుతున్నదే ఆఖరి మ్యాచ్ కెరీర్లో విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం వీడ్కోలు చెప్పాడు. కలిస్ వైదొలిగి రెండు నెలలు కాకముందే... దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఆటకు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు తనకు ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాడు. తన చివరి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే అవుటైన స్మిత్.. భారంగా కెరీర్‌ను ముగించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాను టెస్టుల్లో నంబర్‌వన్ చేయడంలో... అంతర్జాతీయ క్రికెట్లో బలమైన జట్టుగా మార్చడంలో అత్యంత కీలక పాత్ర గ్రేమ్ స్మిత్‌ది. తను ఆడిన 117 టెస్టుల్లో ఏకంగా 109 టెస్టులకు సారథిగా పని చేసిన దిగ్గజం అతను. ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్... అనూహ్యంగా మ్యాచ్ మధ్యలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన తర్వాత తన నిర్ణయాన్ని సహచరులకు చెప్పాడు. చివరి టెస్టులో స్మిత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 (5, 3) పరుగులు మాత్రమే చేశాడు. ‘నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయం ఇదే. ఏడాది నుంచి రిటైర్మెంట్పై ఆలోచిస్తున్నా. న్యూలాండ్స్ నాకు సొంతగడ్డ లాంటిది. అందుకే ఇక్కడే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇకపై కుటుంబ సభ్యులతో గడుపుతా’ అని స్మిత్ చెప్పాడు. కెరీర్ హైలైట్స్ మొత్తం 117 టెస్టుల్లో 109 మ్యాచ్‌లకు స్మిత్ సారథిగా వ్యవహరించాడు. (ఇందులో 108 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు, ఒక్క మ్యాచ్‌లో ఐసీసీ ఎలెవన్‌కు కెప్టెన్సీ చేశాడు.) కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (53). పాంటింగ్ (48) స్మిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో స్మిత్ సెంచరీ చేసిన ప్రతిసారీ (27 సెంచరీలు) దక్షిణాఫ్రికా గెలిచింది. వంద టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఒకే ఒక్క క్రికెటర్ స్మిత్. బోర్డర్ (93) తర్వాతి స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 149 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. ఇందులో దక్షిణాఫ్రికా 92 గెలిచి, 51 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా... మిగిలిన మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. టి20ల్లో 27 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా దక్షిణాఫ్రికా 18 మ్యాచ్‌ల్లో నెగ్గి, 9 మ్యాచ్‌ల్లో ఓడింది. స్మిత్ అంతర్జాతీయ కెరీర్... టెస్టు వన్డే టి20 మ్యాచ్‌లు 117 197 33 పరుగులు 9265 6989 982 సెంచరీలు 27 10 0