అంతర్జాతీయ క్రికెట్కు గ్రేమ్ స్మిత్ గుడ్బై
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టును విజయాల బాటలో నడిపించి అద్భుతమైన కెప్టెన్గా ప్రశంసలు అందుకున్న స్మిత్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కేప్టౌన్లో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు ముగిసిన వెంటనే తాను క్రికెట్ నుంచి వైదొలగుతానన్నాడు. 117 మ్యాచ్లు ఆడిన స్మిత్ (33) 109 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇదో ప్రపంచ రికార్డు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మూడోరోజు ఆట జరుగుతున్పప్పడు తన జట్టు సభ్యులకు ఈ విషయం తెలిపాడు. తన జన్మభూమిపైనే చిట్టచివరి మ్యాచ్ ఆడితే బాగుంటుందని భావించినట్లు చెప్పాడు. గత సంవత్సరం కాలి మడమకు ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచే స్మిత్ రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నాడు.
తన జీవితంలో ఇంత కష్టమైన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదని, గత ఏప్రిల్లో ఆపరేషన్ చేయించుకున్నప్పటినుంచే ఆలోచిస్తున్నానని తెలిపాడు. న్యూలాండ్స్లో రిటైరైతే బాగుంటుందని అనుకున్నానని, తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి దీన్ని తన జన్మభూమిగానే భావిస్తున్నానని తెలిపాడు. ఇంతమంది అద్భుతమైన ఆగటాళ్లకు నేతృత్వం వహించినందుకు చాలా గర్వంగా ఉందని అన్నాడు.
స్మిత్ కెరీర్లో 27 టెస్టు సెంచరీలున్నాయి. అతడు సెంచరీ చేసిన ప్రతిసారీ ఆ జట్టు గెలిచింది. ఇంగ్లండ్ జట్టుపై డబుల్ సెంచరీలు కూడా బాదాడు. ఒకసారి ఆస్ట్రేలియా సిరీస్లో అయితే, చెయ్యి విరిగినా కూడా ఆ విరిగిన చేత్తోనే బ్యాటింగ్ చేశాడు. వన్డేల విషయానికొస్తే, మొత్తం 197 వన్డేలు ఆడి 37.98 సగటుతో 6989 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలున్నాయి.