నేను క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేను! | Graeme Smith calls time on Surrey stint | Sakshi
Sakshi News home page

నేను క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేను!

Published Mon, Jul 21 2014 6:43 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

నేను క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేను!

నేను క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేను!

లండన్: తాను రాబోవు ఇంగ్లిష్ కౌంటీలో ఆడటానికి సిద్ధంగా లేనని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. ఇంగ్లిష్ కౌంటీల్లో భాగంగా సర్రే స్టింట్ తో మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నస్మిత్ ప్రస్తుతం ఆ లీగ్ కు దూరంగా ఉండనున్నాడు. ఆ కౌంటీ నుంచి పిలుపు వచ్చిన అనంతరం స్మిత్  స్పందించాడు. 'నేను వచ్చే ఇంగ్లిష్ లీగ్ లో ఆడలేను. నా గాయం పూర్తిగా నయం కాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్రేకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా పాత్ర సమర్ధవంతంగా నిర్వహించడానికి  సిద్ధంగా లేను' అంటూ పేర్కొన్నాడు.
 

గత సంవత్సరం మే నెల్లో  స్మిత్ కు మోకాలు చిట్లడంతో  క్రికెట్ కు దూరమయ్యాడు. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్న డాక్టర్లు స్మిత్ ను క్రికెట్ కు దూరంగా ఉండమని సూచించారు.  దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో చాలా గేమ్ లను స్మిత్ వదులుకోక తప్పలేదు. తాజాగా ఇంగ్లిష్ కౌంటీతో ఒప్పందం నేపథ్యంలో స్మిత్ మరోసారి క్రికెట్ దూరంగా ఉంటున్నందుకు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement