Ashes Series Adelaide Test: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కెరీర్‌లో మరో రికార్డు చేరింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అతడు ఐదో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును అధిగమించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా 1563 పరుగులు పూర్తి చేసుకుని ఈ ఫీట్ నమోదు చేశాడు.
కాగా అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన జో రూట్ బృందం దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు హసీబ్ హమీద్(6), రోరీ బర్న్స్'(4) విఫలమైనా... డేవిడ్ మలన్, జో రూట్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు:
►మహ్మద్ యూసఫ్(2006)- 1788 పరుగులు
►వివియన్ రిచర్డ్స్(1976)- 1710 పరుగులు
►గ్రేమ్ స్మిత్(2008)- 1656
►మైఖేల్ క్లార్క్(2012)- 1595
►జో రూట్(2021)- 1563 (నాటౌట్)
►సచిన్ టెండుల్కర్(2010)- 1562 పరుగులు
►సునిల్ గావస్కర్(1979)- 1555 పరుగులు
చదవండి: AUS vs ENG: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. డబ్ల్యూటీసీపై ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment