రాణించిన ఇషాంత్, కష్టాల్లో దక్షిణాఫ్రికా!
Published Thu, Dec 19 2013 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
భారత బౌలర్ ఇషాంత్ శర్మ రాణించి మూడు వికెట్లు పడగొట్టడంతో జోహన్నెస్ బర్గ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో అత్యధికంగా కెప్టెన్ స్మిత్ 68, ఆమ్లా 36 పరుగులు చేయగా, ఫిలాండర్ 48 పరుగులతో, ప్లెసిస్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. షమీ 2, జహీర్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. పీటర్సన్ (21), ఆమ్లా (36), కల్లీస్ (0) వికెట్లను ఇషాంత్ శర్మ పడగొట్టారు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. 255/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 25 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది.
అజింక్య రహానే 47, ధోనీ 19 పరుగులు చేశారు. జహీర్ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ డకౌటయ్యారు. విరాట్ కోహ్లి119, పుజారా 25, రోహిత్ శర్మ 14, ధావన్ 13 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 4, మోర్కల్ 3 వికెట్లు పడగొట్టారు. స్టెయిన్, కలిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Advertisement
Advertisement