కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని క్రికెట్‌లో ‘సూపర్ స్టార్’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్‌ను సజీవంగా ఉంచగలిగే ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడని తెలిపాడు. శుక్రవారం(నవంబర్ 2)న కోల్‌కతాలో జగ్మోహన్ దాల్మియా వార్షిక కాన్‌క్లేవ్ లో ప్రసగించిన గ్రేమ్ స్మిత్.. ‘ఈ ఏడాది కోహ్లికి బాగా కలిసొచ్చింది. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగులు చేయడం, వరుసగా సెంచరీలు చేసి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తన విలువను పెంచుకున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్ల కొరత ఎక్కువైంది. ఇంగ్లండ్‌లో ఒకరిద్దరు ఉన్నారు. మిగతా వాళ్లలో విరాట్ కోహ్లి అతిపెద్ద సూపర్‌స్టార్. టెస్ట్‌లంటే అతనికి ప్రాణం. అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. దేశంలో ఐపీఎల్, టీ20లతో సమానంగా ఈ ఫార్మాట్‌కు ఆదరణ తెస్తున్నాడు. టెస్ట్‌లను విరాట్ కోహ్లి ప్రమోట్ చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా లేదు’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment