బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి పరుగులేమి చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే కివీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన విరాట్.. 9 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
న్యూజిలాండ్ యువ పేసర్ ఓ'రూర్క్ అద్బుతమైన బంతితో కోహ్లిని బోల్తా కట్టించాడు. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రూర్క్.. ఆఖరి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి లోపలకు వచ్చింది. దీంతో బంతి తన ప్యాడ్‌లకు తాకకుండా ఉండడానికి కోహ్లి లెగ్ సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫిలిప్స్ జంప్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే అది క్లీన్ క్యాచ్ కాదా? అని ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌తో సప్రందించాడు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి ఔట్‌గా ప్రకటించాడు.
దీంతో చేసేదేమి లేక కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. అయితే ఆఫ్ సైడ్ పడిన బంతి అంత షార్ప్‌గా టర్న్ అవుతుందని కోహ్లి అస్సలు ఊహించలేదు. అంతేకాకుండా లెగ్ సైడ్‌లో గల్లీ ఫీల్డర్‌ను పెట్టి మరి విరాట్‌ను ట్రాప్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఎనిమిదేళ్ల తర్వాత..
కాగా టెస్టుల్లో కోహ్లి ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే మొదటి సారి. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో ఈసారి కోహ్లి వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ కోహ్లికి వన్ డౌన్ కలిసిరాలేదు.
గతంలో కోహ్లి వన్ డౌన్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు విరాట్ కేవలం నాలుగు టెస్టుల్లోనే ఈ ప్లేస్‌లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు సాధించాడు.
— ViratKingdom (@kingdom_virat1) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment