దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ (ఫైల్ ఫొటో)
జొహన్నెస్‌బర్గ్: తొలి టీ20లో టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పదునైన బంతులకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు దాసోహమయ్యారు. 5/24తో చెలరేగిన భువీ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే భువీ అద్భుత ప్రదర్శనపై సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ స్పందించాడు. ప్రత్యర్థి జట్టుకు చెందిన మాజీ ఆటగాడిగా కంటే కామెంటెటర్‌గా భువీ బౌలింగ్‌ను ఆస్వాదించానని చెప్పాడు. భువీ బౌలింగ్ స్కిల్స్ ప్రొటీస్ బౌలర్లు కంటే మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చాడు.
భువనేశ్వర్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్న సఫారీ ఆటగాళ్లకు గ్రేమ్ స్మిత్ కొన్ని సూచనలిచ్చాడు. 'స్టార్ బౌలర్ భువనేశ్వర్‌ను అంత తేలికగా తీసుకోవద్దు. భువీ బంతులు సంధించే తీరు అద్భుతం. లెగ్ కట్టర్స్, నకుల్ బాల్, స్వింగ్ బంతులతో ఆతిథ్య జట్టును కట్టడి చేస్తున్నాడు భువీ. కావాలంటే తొలి టీ20 మ్యాచ్ వీడియోను పరిశీలించండి. భువనేశ్వర్ బంతులు ఎలా వేస్తున్నాడో గమనించండి. తర్వాతి మ్యాచ్‌లో ఎలా ఆడాలో మీకే అర్థమవుతోంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తుంటే.. సఫారీలు అన్ని విభాగాల్లో సమష్టిగా వైఫల్యం చెందుతున్నారని' అభిప్రాయపడ్డాడు స్మిత్.
Comments
Please login to add a commentAdd a comment