సెంచూరియన్:తొలి టీ20లో భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తమకు స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ ఇవ్వలేదని దక్షిణాఫ్రికా ఆటగాడు హెండ్రిక్స్ స్పష్టం చేశాడు. భువనేశ్వర్ కుమార్ లయ తప్పకుండా బౌలింగ్ చేయడంతో తాము ఓటమికి కారణమన్నాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి వేచి చూడాల్సిన పరిస్థితి రావడం వల్లే లక్ష్య ఛేదనలో వికెట్లు చేజార్చుకున్నట్లు హెండ్రిక్స్ తెలిపాడు.
'తొలి టీ20లో భువనేశ్వర్ కుమార్ లయ తప్పకుండా బౌలింగ్ చేశాడు. అతను ఎక్కువగా సురక్షిత ప్రాంతంలోనే బంతులు విసరడం వల్ల అతన్ని ఆడటం కష్టంగా మారింది. మమ్మల్ని స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ భువీ ఇవ్వలేదు. ఆ క్రమంలోనే బౌండరీలకు బదులు సింగిల్స్, డబుల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓపెనర్‌గా నేను జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చి.. దాన్ని కొనసాగించాలనే తలంపుతో ఆడాను. మధ్యలో కొన్ని కీలక వికెట్లని చేజార్చుకోవడం దక్షిణాఫ్రికా జట్టుని దెబ్బతీసింది' అని హెండ్రిక్ పేర్కొన్నాడు. మొదటి టీ 20లో హెండ్రిక్స్ (70; 50 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment