![India to play Australia, South Africa ahead of T20 World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/22/138-UPPAL.jpg.webp?itok=w1I88SVY)
న్యూఢిల్లీ: సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టి20 మ్యాచ్‌లు ఆడే టీమిండియా... ఆ తర్వాత సఫారీ టీమ్‌తో 3 టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ నిర్వహణ అవకాశం లభించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో జరుగుతుంది. 2019 డిసెంబర్ 6న ఇక్కడ చివరి మ్యాచ్ (భారత్–విండీస్ టి20) జరిగింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 న జరిగే 3 టి20లకు వేదికలుగా త్రివేండ్రం, గువహటి, ఇండోర్ ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికాతోనే జరిగే 3 వన్డేలకు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment