Schedule finalized
-
హైదరాబాద్‌లో భారత్–ఆస్ట్రేలియా టి20
న్యూఢిల్లీ: సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టి20 మ్యాచ్‌లు ఆడే టీమిండియా... ఆ తర్వాత సఫారీ టీమ్‌తో 3 టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ నిర్వహణ అవకాశం లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో జరుగుతుంది. 2019 డిసెంబర్ 6న ఇక్కడ చివరి మ్యాచ్ (భారత్–విండీస్ టి20) జరిగింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 న జరిగే 3 టి20లకు వేదికలుగా త్రివేండ్రం, గువహటి, ఇండోర్ ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికాతోనే జరిగే 3 వన్డేలకు అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
అహ్మదాబాద్‌లో డే–నైట్ టెస్టు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో లభించిన సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే ఏడాది భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలుకానుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. ► ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు జరుగుతాయి. ► కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తారు. చెన్నై, అహ్మదాబాద్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. రొటేషన్ పాలసీలో భాగంగా చెన్నై, పుణే వేదికలను ఎంపిక చేశారు. ► ఈ సిరీస్ సందర్భంగా భారత్ సొంతగడ్డపై రెండో డే–నైట్ టెస్టు (ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు) ఆడనుంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం (ప్రేక్షకుల సామర్థ్యం 1,10,000) అయిన అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ మొతేరా స్టేడియంలో ఈ డే–నైట్ టెస్టును నిర్వహిస్తారు. గత ఏడాది కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో భారత్ తొలిసారి డే–నైట్ టెస్టు ఆడింది. కొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో డే–నైట్ టెస్టుతోపాటు మరో టెస్టు కూడా జరుగుతుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై వేదిక కానుంది. తర్వాతి రెండు టెస్టులను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. టెస్టు సిరీస్ ముగిశాక అహ్మదాబాద్‌లోనే ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం పుణేలో మూడు వన్డేలతో పర్యటన ముగుస్తుంది. ► శ్రీలంకతో రెండు టెస్టులు (జనవరి 14–18; జనవరి 22–26) ఆడాక ఇంగ్లండ్ జట్టు జనవరి 27న కొలంబో నుంచి చెన్నైకు చేరుకుంటుంది. అక్కడే వారంరోజులపాటు క్వారంటైన్లో ఉంటుంది. మరోవైపు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన జనవరి 19న ముగుస్తుంది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నాక భారత క్రికెటర్లకు వారం రోజులపాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. అనంతరం కరోనా వైరస్ నిర్ధారణ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేశాక వారిని చెన్నైలోని బయో బబుల్‌లోకి పంపిస్తారు. భారత్–ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ ► తొలి టెస్టు: ఫిబ్రవరి 5–9 (చెన్నై) ► రెండో టెస్టు: ఫిబ్రవరి 13–17 (చెన్నై) ► మూడో టెస్టు: ఫిబ్రవరి 24–28 అహ్మదాబాద్ (డే/నైట్) ► నాలుగో టెస్టు: మార్చి 4–8 (అహ్మదాబాద్) ► తొలి టి20: మార్చి 12 (అహ్మదాబాద్) ► రెండో టి20: మార్చి 14 (అహ్మదాబాద్) ► మూడో టి20: మార్చి 16 (అహ్మదాబాద్) ► నాలుగో టి20: మార్చి 18 (అహ్మదాబాద్) ► ఐదో టి20: మార్చి 20 (అహ్మదాబాద్) ► తొలి వన్డే: మార్చి 23 (పుణే) ► రెండో వన్డే: మార్చి 26 (పుణే) ► మూడో వన్డే: మార్చి 28 (పుణే) -
టెట్‌కు గట్టి పోటీ
నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ ఏడాది ఫిబ్రవరి 9న నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో టెట్, డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో ఉన్న 347 ఉపాధ్యాయ ఖాళీల కోసం 11,514 మంది పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రాథమిక దశలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు పేపర్-1కు (ఎస్జీటీ) 1173 మంది, పేపర్-2కు (స్కూల్ అసిస్టెంట్) 10,229 మంది, రెండు పేపర్లూ రాసేందుకు 112 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఫిబ్రవరి 9న నిర్వహించే టెట్‌కు హాజరవుతారు. ఈ పరీక్షలో సాధించే ఉత్తీర్ణత, అర్హతలను బట్టి డీఎస్సీకి హాజరు కావాల్సి ఉంటుంది. జిల్లాలో 268 ఎస్జీటీ ఖాళీలున్నాయి. వీటితోపాటు 9 పీఈటీ, 42 పండిట్, 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 28 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 366 మంది పోటీ పడుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల భర్తీకి మాత్రం అంతగా పోటీ లేకపోవడంతో డీఎడ్ అభ్యర్థులు నూతనోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ఎస్జీటీ తత్సమానమైన పీఈటీ, పండిట్ పోస్టులు 319 ఉంటే కేవలం 1173 మంది మాత్రమే టెట్‌కు హాజరవుతున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో నిలువనున్నారు. బీఈడీ అభ్యర్థులకు శాపం : గతంలో బీఈడీ అభ్యర్థులు సైతం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు దరఖాస్తు చేసుకుని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేవారు. తాజాగా బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనతో బీఈడీ అభ్యర్థులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. గత ఏడాది వరకు డిగ్రీ పూర్తి చేసిన పలువురు బీఈడీ పూర్తి చేసేవారు. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. గత ఏడాది ప్రభుత్వం, న్యాయస్థానాలు వెలువరించిన తాజా నిర్ణయం డీఎడ్ అభ్యర్థులకు వరంగా పరిణమించించగా, బీఈడీ అభ్యర్థులకు శాపంగా మారింది.