భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈలో సిరీస్ డ్రా చేసుకున్న జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా ఎంపిక చేసింది.
డర్బన్: భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈలో సిరీస్ డ్రా చేసుకున్న జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా ఎంపిక చేసింది. వన్డే టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాని గ్రేమ్ స్మిత్ టెస్టు జట్టుకు మాత్రం సారథిగా బరిలోకి దిగనున్నాడు.
జట్టు వివరాలు: గ్రేమ్ స్మిత్ (కెప్టెన్), హాషిం ఆమ్లా, డివిలియర్స్, డుమిని, డు ప్లెసిస్, ఎల్గర్, తాహిర్, కలిస్, క్లీన్‌వెల్ట్, మోర్నీ మోర్కెల్, అల్విరో పీటర్సన్, రాబిన్ పీటర్సన్, ఫిలాండర్, స్టెయిన్, సోలెకైల్.