South Africa team
-
తొలి కల నెరవేరింది
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్‌లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్‌కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను. ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన? 2023లో జరిగిన ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్‌కప్‌నకు ముందు ఎలాంటి సాధన చేశారు? కెరీర్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్‌కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్‌గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది. జట్టు సభ్యులతో మీ అనుబంధం? చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్‌లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఈ వరల్డ్‌కప్‌లో మీకు అప్పగించిన బాధ్యతలు? ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం. గత ప్రపంచకప్‌నకు, ఈ వరల్డ్‌కప్‌నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి? 2023లో జరిగిన ప్రపంచకప్‌లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి. మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది? కేవలం ఈ ప్రపంచకప్‌లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్‌కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. టోర్నీలో త్రిష గణాంకాలు మ్యాచ్‌లు 7 ఇన్నింగ్స్‌లు 7 పరుగులు 309 అత్యధిక స్కోరు 110 సగటు 77. 25 సెంచరీలు 1 ఫోర్లు 45సిక్స్‌లు 5 అభినందనల వెల్లువఅండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రివరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్ ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిఅండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ -
అజేయం... అద్వితీయం
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్‌ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్‌రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్‌లో కనబరిచిన ఆల్‌రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్‌లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది. సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్‌సైడ్ అయ్యింది. కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్‌తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్‌రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది. స్పిన్ వలలో విలవిల దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది. రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. ధనాధన్ ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్‌ను ఓపెనర్ త్రిష తన షాన్‌దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్‌తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3. భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్‌తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0. -
ఒకటే లక్ష్యం... రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్ సై
కౌలాలంపూర్: రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్ సంగ్రామానికి సిద్ధమైంది. అజేయంగా తుది పోరుకు అర్హత సాధించిన నికీ ప్రసాద్ నాయకత్వంలోని భారత అమ్మాయిల జట్టు విజయవంతంగా ‘రెండో ప్రపంచకప్ మిషన్’ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్‌కప్ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జోరు మీదున్న రెండు అజేయ జట్ల మధ్య నేడు జరిగే అండర్–19 ప్రపంచకప్ టైటిల్ పోరుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారీ భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందా! లేదంటే కొత్త చాంపియన్ ఆవిర్భవిస్తుందా! మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్ సామర్థ్యంతో ఉన్న టీనేజ్ టీమిండియాను ఎదుర్కోవడమే ఎవరికైనా అతిపెద్ద సవాల్. ఇక అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో పెద్ద ‘ప్రపంచ’ యుద్ధమే చేయాలనడంలో అతిశయోక్తే లేదు! ఆ ఇద్దరిని కట్టడి చేస్తే... తెలంగాణ స్టార్ బ్యాటర్ గొంగడి త్రిష! మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో తనను విస్మరించిన ఫ్రాంచైజీల కళ్లకు కట్టుకున్న గంతల్ని తన అసాధారణ బ్యాటింగ్‌తో విప్పేసింది. ఇప్పుడు ‘ఫైనల్ మిషన్’ ముంగిట అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ టోర్నీలో ఓపెనర్ త్రిష ఫామ్, క్రీజులో ఆమె కనబరుస్తున్న పోరాటపటిమ ప్రత్యర్థి బౌలర్లకు కఠిన సవాళ్లు విసురుతున్నాయి. మరో ఓపెనర్ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ నుంచి అత్యధిక పరుగులు సనిక చాల్కె (6 మ్యాచ్‌ల్లో 69) చేసింది.భారత బౌలింగ్ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. అలాగని ఫైనల్‌కు చేరిన సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేం.కేలా రెనెకి కెప్టెన్సీ లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌తో చుట్టేసింది. జెమ్మా బోతా, లౌరెన్స్, కరబొ మెసోలతో కూడిన బ్యాటింగ్ లైనప్, ఆష్లే వాన్విక్, ఎన్‌తబిసెంగ్ నిని, శేషిని నాయుడులతో కూడిన బౌలింగ్ దళం కూడా మెరుగ్గా ఉంది.పిచ్, వాతావరణం భారత్‌కు బాగా అలవాటైన పిచ్. అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణ వాతావరణమే. వాన ముప్పు దాదాపుగా లేదు. -
సెంచరీతో అదగరొట్టిన టీమిండియా కెప్టెన్.. దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత అండర్-19 జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. జోహన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ గెలుపుతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్టోల్క్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ముషీర్ ఖాన్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు నమాన్ తివారీ 3 వికెట్లు, అభిషేక్, మురగన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహ్రాన్(112) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్షు మౌలియా(76) పరుగులతో రాణించాడు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా అఫ్గానిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. -
రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ‘ఢీ’
మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ లో సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు అదరగొట్టింది. గ్రూప్–1 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్–1లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా (0.738) సెమీస్ చేరగా... న్యూజిలాండ్ (0.138), శ్రీలంక (–1.460) ఇంటిముఖం పట్టాయి. దక్షిణాఫ్రికాతో పోరులో మొదట బంగ్లాదేశ్ 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వర్డ్ ( 66 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), తజి్మన్ బ్రిట్స్ (50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీ లతో అదరగొట్టారు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
భారత్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన
South Africa Squad For ODIs Against India: జనవరి 19 నుంచి టీమిండియాతో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 17 మంది సభ్యుల దక్షిణాఫ్రికా బృందాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధ్యం వహించనుండగా.. ఇటీవలే టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్, సంచలన ఫాస్ట్ బౌలర్ మార్కో జెన్సన్, సీనియర్ పేసర్ రబాడ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ పేసర్ నోకియా నోర్జే.. వన్డే జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. Seamer Marco Jansen receives his maiden #Proteas ODI squad call-up as Temba Bavuma returns to captain the side for the #BetwayODISeries against India 🇿🇦 Wayne Parnell, Sisanda Magala and Zubayr Hamza retain their spots 💚#SAvIND #BePartOfIt pic.twitter.com/Nkmd9FBAb3 — Cricket South Africa (@OfficialCSA) January 2, 2022 టీమిండియా వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్ చదవండి: రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి -
విజేత యువ భారత్
డర్బన్: ప్రపంచకప్‌కు ముందు భారత యువ జట్టు తమ సత్తాను ప్రదర్శిస్తూ నాలుగు దేశాల అండర్–19 వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో భారత అండర్–19 జట్టు 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఆరంభంలో గెరాల్డ్ కోయిజే (3/19) విజృంభించడంతో... యశస్వి జైస్వాల్ (0), దివ్యాన్‡్ష సక్సేనా (6), సారథి ప్రియమ్ గార్గ్ (2) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ 13 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ట్రోఫీతో హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్‌వర్మ ఈ దశలో జట్టు బాధ్యతను తిలక్ వర్మ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్), ధ్రువ్ జురెల్ (115 బంతుల్లో 101; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో సిద్ధేశ్ వీర్ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది. ఛేదన ప్రారంభించిన దక్షిణాఫ్రికాను అథర్వ అన్కోలేకర్ (4/31) హడలెత్తించడంతో... ఆ జట్టు 43.1 ఓవర్లలో 190 పరుగులకే చాప చుట్టేసింది. జాక్ లీస్ (52; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ రాణించిన తిలక్ వర్మ కీలకమైన ఓపెనర్ ఆండ్రూ లోవ్ (17; 3 ఫోర్లు) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ధ్రువ్ జురెల్ అవార్డు అందుకోగా... టోర్నీ మొత్తం రాణించిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. -
మోరిస్‌కు పిలుపు
జొహన్నెస్‌బర్గ్: ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ అన్రిచ్ నోర్జి గాయంతో ఇంగ్లండ్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని కుడి బొటనవేలికి ఫ్రాక్చర్ కావడంతో 6 నుంచి 8 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ నెల 30 నుంచి మొదలయ్యే ప్రపంచకప్ కోసం నోర్జి స్థానంలో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. మోరిస్ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన వన్డేలో బరిలోకి దిగాడు. అనంతరం అతన్ని వన్డేల నుంచి తప్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఈ ఆల్‌రౌండర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లాడిన మోరిస్ 13 వికెట్లు తీశాడు. -
కోహ్లి సేనతో తలపడే సఫారీ జట్టు ఇదే
కేప్‌టౌన్: కోహ్లిసేన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన క్రిస్ మోరిస్‌కు చోటు దక్కింది. అలాగే గాయం, ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకున్న డీకాక్, స్టెయిన్‌లు కూడా జట్టులో చోటు సంపాదించారు. తాజాగా జింబాబ్వేతో నాలుగు రోజుల ప్రయోగాత్మక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా జనవరి 2 నుంచి శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. స్టెయిన్ కూడా గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. జింబాంబ్వేతో ఏకైక టెస్టుకు ఎంపికైనా అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత్‌తో సిరీస్ కోసమే స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక భారత్ జట్టు కేప్‌టౌన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, బవుమా, ఏబీ డివిలియర్స్, డి బ్రూన్, ఎల్గర్, కేశవ్ మహారాజ్, మర్ర్కమ్, మోర్కెల్, క్రిస్ మోరిస్, అండిలే పెహ్లుక్వాయో, ఫిలాండర్, రబాడ, డేల్ స్టెయిన్. -
కష్టాల్లో దక్షిణాఫ్రికా
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఎదురీదుతోంది. 175 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డు ప్లెసిస్ (15 బ్యాటింగ్), డి కాక్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 321/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 489 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (176; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
తొలి పోరుకు దక్షిణాఫ్రికా సిద్ధం
నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ న్యూఢిల్లీ: భారత పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు తొలి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి పాలం మైదానంలో మంగళవారం జరిగే టి20 వార్మప్ మ్యాచ్‌లో సఫారీలు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో తలపడనున్నారు. శుక్రవారం భారత్‌తో తొలి టి20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ గేమ్‌లో పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించాలని దక్షిణాఫ్రికా భావి స్తోంది. ముఖ్యంగా ప్రధాన బ్యాట్స్‌మెన్ డివిలి యర్స్, కెప్టెన్ డు ప్లెసిస్, డుమిని, మిల్లర్ హిట్టింగ్ ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. సాధారణ గ్రౌండ్లతో పోలిస్తే పాలం మైదానం చిన్నది కావడం వల్ల భారీ షాట్ల మోత మోగవచ్చు. టి20 లకు స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమైనా... కైల్ అబాట్, మోరిస్, తాహిర్‌లు కీలక బౌలర్లు. మరోవైపు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మరీ కుర్రాళ్లతో నిండి ఉంది. సీనియర్ జట్టు తర్వాత ప్రధాన టీమ్ అయిన ఇండియా ‘ఎ’, బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వీరు ప్రత్యర్థికి అంత పోటీ ఇచ్చే అవకాశమైతే లేదు. అయితే తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కెప్టెన్ మన్దీప్, చహల్, కుల్దీప్, రిషి ధావన్‌లాంటి ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. ఇప్పటికే భారత్‌కు ఆడిన సంజూ శామ్సన్, మనీష్ పాండే కూడా బరిలో ఉన్నారు. -
ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌కు...
దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన జొహన్నెస్‌బర్గ్ : భారత గడ్డపై సుదీర్ఘ పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్ల జట్లను ప్రకటించింది. టెస్టుల్లో స్పిన్ పిచ్‌లు ఎదురయ్యే అవకాశం ఉండటంతో తమ జట్టులో కూడా ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. టెస్టు జట్టులోకి లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్లు డేన్ పైడ్, సైమన్ హార్మర్లను ఎంపిక చేసినట్లు దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జోండి ప్రకటించారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు ఆడిన జట్టులో లేని తాహిర్, పైడ్లతో డివిలియర్స్ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. మూడు జట్లలో చూస్తే టి20 సిరీస్‌కు ఎంపికైన బ్యాట్స్‌మన్ ఖాయా జోండో ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు డివిలియర్స్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, తాహిర్‌లు మూడు ఫార్మాట్లలోనూ ఉన్నారు. వన్డే, టి20 జట్లలో కూడా ఎలాంటి సంచలనాలు లేకుండా రెగ్యులర్ సభ్యులనే ఎంపిక చేశారు. గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమైన రోసో... వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లాంటి ప్రధాన బౌలర్లకు టి20ల్లో విశ్రాంతినిస్తూ మోరిస్, డి లాంజ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నెల 29న జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 7న ముగుస్తుంది. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: హషీం ఆమ్లా (కెప్టెన్), డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, ఇమ్రాన్ తాహిర్, బవుమా, ఎల్గర్, హార్మర్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, పైడ్, రబడ, స్టెయిన్, వాన్‌జిల్, విలాస్. -
అక్షర్ పటేల్ మాయాజాలం
♦ దక్షిణాఫ్రికా ‘ఎ’ 260 ఆలౌట్ ♦ భారత్ ‘ఎ’తో రెండో అనధికార టెస్టు వాయ్‌నాడ్ (కేరళ) : స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/92) స్పిన్ మాయాజాలానికి మంగళవారం ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తడబడింది. ఓపెనర్ వాన్‌జెల్ (193 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు సఫారీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా తొలి రోజు దక్షిణాఫ్రికా 89.5 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ ఓపెనర్లలో హెండ్రిక్స్ (22) విఫలమైనా.. వాన్‌జెల్ నిలకడగా ఆడాడు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించిన వాన్‌జెల్... క్లొయెటీ (26)తో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు సమకూర్చాడు. తర్వాత రమేలా (30) మెరుగ్గా ఆడటంతో సఫారీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వాన్జెల్తో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించి రమేలా వెనుదిరిగాడు. దీంతో ఓ దశలో దక్షిణాఫ్రికా జట్టు 59 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 72వ ఓవర్లో వాన్జెల్ను... జయంత్ అవుట్ చేయడంతో పర్యాటక జట్టు ఇన్నింగ్స్ తడబడింది. దక్షిణాఫ్రికా 75 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో జయంత్ 3, కర్ణ్ 2 వికెట్లు తీశారు. -
భారీస్కోరు దిశగా దక్షిణాఫ్రికా
ఎల్గర్ సెంచరీ వెస్టిండీస్‌తో రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్: ఓపెనర్ డీన్ ఎల్గర్ (239 బంతుల్లో 121; 18 ఫోర్లు) సెంచరీ సహాయంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (228 బంతుల్లో 99 బ్యాటింగ్; 12 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. క్రీజులో తనకు జతగా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (17 బ్యాటింగ్) ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 47 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ పీటర్సన్ మరోసారి పేలవ ఆటతీరుతో పెవిలియన్‌కు చేరగా... ఎల్గర్ జట్టుకు అండగా నిలబడ్డాడు. డు ప్లెసిస్‌తో కలిసి విండీస్ బౌలర్లను ఆడుకున్నాడు. దీనికి తోడు ప్రత్యర్థి ఫీల్డింగ్ లోపాలను ఈ జోడీ సొమ్ము చేసుకుంది. డు ప్లెసిస్ 8, 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అటు ఎల్గర్ కూడా 48, 73 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జత చే శారు. 208 బంతుల్లో ఎల్గర్ కెరీర్లో మూడో సెంచరీ సాధించాడు. పీటర్స్, గాబ్రియెల్‌లకు చెరో వికెట్ దక్కింది. -
పన్నెండున్నరేళ్ల తర్వాత
ఓ టోర్నీ గెలిచిన దక్షిణాఫ్రికా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఆసీస్‌పై విజయం హరారే: దక్షిణాఫ్రికా జట్టు పన్నెండున్నర సంవత్సరాల తర్వాత ఓ టోర్నీ టైటిల్ గెలవగలిగింది. 2002 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ముక్కోణపు టోర్నీ టైటిల్ గెలిచాక సఫారీలు ఎక్కడా ఏ వన్డే టోర్నీ టైటిల్ గెలవలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం గెలిచారు. ఈ లోటును శనివారం తీర్చుకున్నారు. డుఫ్లెసిస్ (99 బంతుల్లో 96; 8 ఫోర్లు; 1 సిక్స్) విజృంభణతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు చేసింది. పేసర్ డేల్ స్టెయిన్ (4/34) ధాటికి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ ఫించ్ (87 బంతుల్లో 54; 5 ఫోర్లు) మాత్రమే రాణించాడు. చివర్లో ఫాల్క్‌నర్ (37 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మోర్కెల్, పార్నెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 221 పరుగులు చేసి నెగ్గింది. ఆమ్లా (75 బంతుల్లో 51; 2 ఫోర్లు), డివిలియర్స్ (41 బంతుల్లో 57; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్‌కు డివిలియర్స్, డు ప్లెసిస్ కలిసి 91 పరుగులు జత చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా డు ప్లెసిస్‌కు దక్కింది. -
సెమీస్‌లో సఫారీ
ఇంగ్లండ్‌పై విజయం రాణించిన డివిలియర్స్ టి20 ప్రపంచకప్ చిట్టగాంగ్: ఏబీ డివిలియర్స్ (28 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు; 3 సిక్స్) మెరుపు బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘1’లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 పరుగుల తేడాతో నెగ్గింది. మరోవైపు ఈనెల 31న శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఇక ఇంగ్లండ్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌పై గెలిచినా ఫలితం ఉండదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (37 బంతుల్లో 56; 6 ఫోర్లు; 2 సిక్స్), డి కాక్ (33 బంతుల్లో 29; 2 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్ని అందించి తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు పడినా మిల్లర్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ జట్టు స్కోరును పరిగెత్తించాడు. చివర్లో మరింత రెచ్చిపోయి డివిలియర్స్ బౌండరీల వరద పారించడంతో 4 ఓవర్లలోనే జట్టు 68 పరుగులు పిండుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు ప్రయత్నించిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 193 పరుగులు చేసి ఓడింది. అలెక్స్ హేల్స్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరింపించినా వేన్ పార్నెల్ (3/31) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. హేల్స్‌తోపాటు మొయిన్ అలీని వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బట్లర్ (24 బంతుల్లో 34; 2 ఫోర్లు; 1 సిక్స్), బొపారా (18 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్లో బ్రెస్నన్ (4 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్) 6, 4, 6తో చెలరేగి పరాజయం తేడా తగ్గించగలిగాడు. సంక్షిప్త స్కోర్లు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 196/5 (20 ఓవర్లలో) (డివిలియర్స్ 69 నాటౌట్, ఆమ్లా 56, జోర్డాన్ 1/30, ట్రెడ్‌వెల్ 1/25, బ్రాడ్ 1/33); ఇంగ్లండ్ ఇన్నింగ్స్: 193/7 (20 ఓవర్లలో) (హేల్స్ 38, బట్లర్ 34, బొపారా 31, పార్నెల్ 3/31, తాహిర్ 2/27). -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
భారతజట్టు వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ, భారత ఆటగాడు విరాట్ కోహ్లి రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ లో టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు. ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్‌లో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. భారత్ 120 రేటింగ్ తో మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 114 రేటింగ్ తో రెండో ర్యాంక్ లో నిలిచింది. ఆ తరవాత స్థానాల్లో ఇంగ్లండ్(111), శ్రీలంక (111), దక్షిణాఫ్రికా (110), పాకిస్తాన్(100) వరుసగా నిలిచాయి. టాప్ 10 ప్లేయర్ ర్యాంకింగ్‌లో.. సెంచురియన్ లో భారత్ తో జరిగిన మూడో చివరి వన్డే సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ నెంబర్ వన్ గా రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాకింగ్ బోర్డు పేర్కొంది. దీంతో వన్డేమ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసినా బ్యాట్స్ మెన్ గా డివిలియర్స్ ప్రసిద్ధికెక్కాడు. ఆ తరువాత భారత ఆటగాడు విరాట్ కోహ్లి రెండవ ర్యాంక్ లో నిలిచాడు. కెప్టెన్ ధోనీ ఆరో ర్యాంకు, శేఖర్ ధావన్ పదవ ర్యాంకులో నిలిచాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 18వ ర్యాంకులో నిలిచాడు. టాప్ 10 బౌలర్ ర్యాంకింగ్‌లో... మొదటి ర్యాంకులో పాకిస్తాన్ స్పీన్ బౌలర్ సయిద్ అజ్మల్ కొనసాగుతున్నట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ తెలిపింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రెండవ ర్యాంక్ లో ఉన్నాడు. భారత్ బౌలర్ రవీంద్రా జడేజా టాప్ 10లో ఉండగా, ఆశ్విన్ 17వ ర్యాంకుతో టాప్ 20లో ఉన్నాడు. భారత్ ఈ సిరీస్ లలో 0-2 సిరీస్ లను రెండు రేటింగులు కోల్పోయి 120 రేటింగ్ పాయింట్స్ తో ముగిసింది. దక్షిణాఫ్రికా 5వస్థానంలో కొనసాగుతూ 110 రేటింగ్ పాయింట్స్ తో 3 పాయింట్స్ సొంతం చేసుకుంది. టాప్ 10 ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో... బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ ఆల్ హాసన్ మొదటి ర్యాంకులో ఉండగా, వాట్సన్ రెండవ ర్యాంకులో ఉన్నాడు. భారత ఆటగాడు రవీంద్రా జడేజా 5వ ర్యాంక్ లో నిలిచినట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్ తన జాబితాలో వెల్లడించింది. -
బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, స్కోరు: 53/3
సెంచూరియన్: భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు అమ్లా 16బంతుల్లో 3 ఫోర్లు తో 13 పరుగులకే చతికిలపడ్డాడు. కెప్టెన్ కాక్ 39 బంతుల్లో 4 ఫోర్లుతో 26 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు డెవిడ్స్ 1, డుమినీ ఏమి పరుగులు చేయకుండానే పెవిలీయన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన విల్లీయర్స్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లు శర్మ 2 వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. -
మార్పుల్లేని దక్షిణాఫ్రికా జట్టు
డర్బన్: భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈలో సిరీస్ డ్రా చేసుకున్న జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా ఎంపిక చేసింది. వన్డే టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాని గ్రేమ్ స్మిత్ టెస్టు జట్టుకు మాత్రం సారథిగా బరిలోకి దిగనున్నాడు. జట్టు వివరాలు: గ్రేమ్ స్మిత్ (కెప్టెన్), హాషిం ఆమ్లా, డివిలియర్స్, డుమిని, డు ప్లెసిస్, ఎల్గర్, తాహిర్, కలిస్, క్లీన్‌వెల్ట్, మోర్నీ మోర్కెల్, అల్విరో పీటర్సన్, రాబిన్ పీటర్సన్, ఫిలాండర్, స్టెయిన్, సోలెకైల్. -
డిసెంబర్లో సఫారీ పర్యటన!
ముంబై: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే తెరపడనుంది. డిసెంబర్లో ధోని సేన అక్కడ పర్యటించనుంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 19న తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముందనుకున్నట్లు సుదీర్ఘ పర్యటన కాకుండా... పూర్తిగా కుదించిన మ్యాచ్‌లతో ఈ సిరీస్‌ను నిర్వహించనున్నట్లు తెలిసింది. బోర్డు వర్గాల సమాచారం మేరకు రెండు టెస్టులు, మూడు వన్డేలకు బీసీసీఐ ఓకే చెప్పింది. మరో టెస్టు కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) చేసిన డిమాండ్‌ను బీసీసీఐ తోసిపుచ్చినట్లు సమాచారం. పర్యటన ఆరంభంలో వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత్‌కు వెస్టిండీస్, న్యూజిలాండ్‌లతో బిజీ షెడ్యూలు ఖరారైన నేపథ్యంలో అదనంగా మరో మ్యాచ్ చేర్చలేమని బోర్డు స్పష్టం చేసింది. బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్, సీఎస్ఏ చీఫ్ క్రిస్ నెన్జానిల మధ్య ఈ మేరకు గత శనివారం చర్చలు జరిగినట్లు బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే భారత్ వచ్చే నవంబర్ నుంచి జనవరి 15 వరకు మూడు టెస్టులు, ఏడు వన్డేలు, రెండు టి20లు ఆడాలి. కానీ సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బీసీసీఐకి గిట్టని లోర్గాట్‌ను నియమించడంతో వివాదం మొదలైంది. -
30న ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక
ముంబై: ఆస్ట్రేలియాతో అక్టోబరు, నవంబరులో జరిగే ఏడు వన్డేల సిరీస్, ఏకైక టి20 కోసం భారత క్రికెట్ జట్టును ఈనెల 30న ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 5న ముంబైలో అడుగుపెట్టనున్న ఆసీస్ మొదట 10న రాజ్‌కోట్‌లో ఏకైక టి20 ఆడుతుంది. 13 నుంచి నవంబర్ 2 వరకు వన్డే సిరీస్ జరుగుతుంది. పుణే, జైపూర్, మొహాలీ, రాంచీ, కటక్, నాగ్‌పూర్, బెంగళూరులో ఈ మ్యాచ్‌లు ఉంటాయి. ఏజీఎం తర్వాత తుది నిర్ణయం దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధం కాస్త తొలగింది. ఈనెల 29న జరిగే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం తర్వాత ఈ పర్యటనకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్, సీఎస్ఏ సీఈఓ లోర్గాట్‌ల మధ్య సోమవారం చర్చలు జరిగినా తుది నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని లోర్గాట్ అన్నారు. -
121 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ విజయం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టులో భారత ‘ఎ’ ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. 307 పరుగుల విజయలక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో సఫారీ జట్టు 121 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను నెగ్గింది. ఈ ఫలితంతో సిరీస్ 1-1తో సమమైంది. అజింక్యా రహానే (156 బంతుల్లో 86; 10 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (183 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. హెండ్రిక్స్ ఆరు వికెట్లు తీయగా, హార్మన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు 3/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు తొలి బంతికే కెప్టెన్ పుజారా వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్లో నదీమ్, కార్తీక్ వికెట్లను తీయడంతో పాటు ఆ తర్వాతి తన ఓవర్లోనే రాయుడును హెండ్రిక్స్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ 18 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దారుణ స్థితిలో పడిపోయింది. ఈ సమయంలో రహానే, సాహా క్రీజులో నిలిచారు. అడపాదడపా బంతిని బౌండరీలకు బాదుతూ స్కోరును పెంచారు. ఆరో వికెట్‌కు 160 పరుగులు జోడించాక రహానే అవుటయ్యాడు. అనంతరం భారత్ టపటపా వికెట్లను కోల్పోయింది. ఐదు ఓవర్లలోనే చివరి ఐదు వికెట్లు చేజార్చుకొని ఓడిపోయింది.