మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ లో సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు అదరగొట్టింది. గ్రూప్–1 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్–1లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా (0.738) సెమీస్ చేరగా... న్యూజిలాండ్ (0.138), శ్రీలంక (–1.460) ఇంటిముఖం పట్టాయి.
దక్షిణాఫ్రికాతో పోరులో మొదట బంగ్లాదేశ్ 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వర్డ్ ( 66 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), తజి్మన్ బ్రిట్స్ (50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీ లతో అదరగొట్టారు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment