మోరిస్‌కు పిలుపు  | Chris Morris replaces Anrich Nortje in South Africa CWC19 squad | Sakshi
Sakshi News home page

మోరిస్‌కు పిలుపు 

Published Wed, May 8 2019 12:28 AM | Last Updated on Wed, May 8 2019 12:28 AM

 Chris Morris replaces Anrich Nortje in South Africa CWC19 squad - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పేసర్‌ అన్రిచ్‌ నోర్జి గాయంతో ఇంగ్లండ్‌ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని కుడి బొటనవేలికి ఫ్రాక్చర్‌ కావడంతో 6 నుంచి 8 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ నెల 30 నుంచి మొదలయ్యే ప్రపంచకప్‌ కోసం నోర్జి స్థానంలో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను జట్టులోకి తీసుకున్నారు.

మోరిస్‌ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన వన్డేలో బరిలోకి దిగాడు. అనంతరం అతన్ని వన్డేల నుంచి తప్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఈ ఆల్‌రౌండర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లాడిన మోరిస్‌ 13 వికెట్లు తీశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement