chris morris
-
అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆ రికార్డు బద్దలవడం ఖాయం!
IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీకి మార్గం సుగమం కావడంతో ఆటగాళ్లను ఎంచుకునే పనిలో పడ్డాయి. ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జట్లకు కెప్టెన్లు ఎవరా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తుండగా... అహ్మదాబాద్ శ్రేయస్ అయ్యర్‌ను కాదని హార్దిక్ పాండ్యా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే అయ్యర్ మెగా వేలంలోకి రావడం ఖాయం. ఇప్పటికే బ్యాటర్‌గా నిరూపించుకోవడం సహా ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యంతో సమవర్థవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్... టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. కాబట్టి అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విరాట్ కోహ్లి ‘గుడ్ బై’ చెప్పడంతో ఆర్సీబీ, మోర్గాన్ లేకపోవడంతో కేకేఆర్, రాహుల్ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్.. కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు జట్లలో ఏదో ఒకటి కచ్చితంగా శ్రేయస్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ యువ ఆటగాడు భారీ ధర పలికే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు క్రిస్ మోరిస్ పేరు మీదే! ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ అతడిని 16.25 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుత వేలంలో ఫ్రాంఛైజీ మధ్య పోటీ, డిమాండ్ దృష్ట్యా శ్రేయస్ అయ్యర్ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం లేకపోలేదు. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్లో ఇంగ్లండ్ కెప్టెన్ అరంగేట్రం!.. నా మొదటి ప్రాధాన్యం అదే! ‘‘ఐపీఎల్ మెగా వేలం-2022లో అయ్యర్ హాటెస్ట్ ప్రాపర్టీ. అతడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని మూడు ప్రధాన జట్లు భావిస్తున్నాయి. కాబట్టి అతడు భారీ ధర పలకడం ఖాయమే. తనలోని నాయకత్వ లక్షణాలు, బ్యాటర్‌గా తనకున్న రికార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇది నిజమే అనిపిస్తుంది కదా’’ అని ఐపీఎల్ వేలం గురించిన అంశాలను నిశితంగా పరిశీలిస్తున్న క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశాల గురించి సదరు మూడు ప్రధాన జట్లుగా భావిస్తున్న ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ వర్గాలను ఆశ్రయించగా.. ‘‘మా వ్యూహాలు మాకు ఉన్నాయి. ఐపీఎల్ వేలం వరకు ఎదురుచూడకతప్పదు’’ అని సమాధానం దాటవేశాయని జాతీయ మీడియా పేర్కొంది. అయ్యర్ ఐపీఎల్ సాలరీ ఎంతంటే! ఇన్సైడ్ స్పోర్ట్ మనీబాల్ డేటా ప్రకారం... ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా శ్రేయస్ అయ్యర్ 35.8 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏడు ఐపీఎల్ సీజన్లు ఆడిన అయ్యర్ ఈ మొత్తం అందుకున్నట్లు సమాచారం. ఇక 87 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 2375 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? -
16 కోట్లు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. రాజస్తాన్‌కు షాక్!
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు... ‘‘అన్ని రకాల ఫార్మాట్ల నుంచి నేను రిటైర్ అవుతున్నాను. నా ప్రయాణంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటాన్‌కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్‌గా పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్ మోరిస్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా జట్టు అతడిని 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు మోరిస్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. కాగా 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు క్రిస్ మోరిస్. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2019లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే 81 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ మోరిస్ 618 పరుగులు చేశాడు. 95 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో రాజస్తాన్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు చేయడంతో పాటుగా... 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్ మోరిస్ ఆవేదన
All Rounder Chris Morris Statement Not Playing South Africa.. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్ మద్దతు విషయంలో డికాక్ వివాదం మరిచిపోకముందే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు మరోషాక్ తగిలింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఇకపై దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే రోజులు పూర్తయ్యాయంటూ సంచలన ప్రకటన చేశాడు. క్రిస్ మోరిస్ తాజా ప్రకటనతో క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) తెరవెనుక సంక్షోభం మరోసారి మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎస్ఏ రాజకీయాలతో తానెంత నలిగిపోయాననేది మోరిస్ ప్రకటనలో స్పష్టంగా కనిపించింది. చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్ దీనికి సంబంధించి మోరిస్ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కోసం నేను ఆడే రోజులు పూర్తయ్యాయి.అధికారికంగా రిటైర్మెంట్పై చెప్పాల్సింది ఏమీ లేదు. నేను దేశవాళీ క్రికెట్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లకు ఆడాను. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. నేను ఎక్కడ ఉంటానో (దక్షిణాఫ్రికా బోర్డు ను ఉద్దేశిస్తూ..) వాళ్లకు తెలుసు. అలాగే నేను ఎక్కడ నిలబడగలనో నాకు తెలుసు. కానీ జాతీయ జట్టు కోసం ఆడే రోజులు మాత్రం పూర్తయ్యాయి. బాధగా ఉన్నప్పటికీ ఇదే నిజం’ అని పేర్కొన్నాడు. 34 ఏండ్ల క్రిస్ మోరిస్.. దక్షిణాఫ్రికా తరఫున 2012లో క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు. జాతీయ జట్టు తరఫున మోరిస్ చివరి వన్డేను 2019 ప్రపంచకప్ లో ఆడాడు. ఇక యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరఫున మోరిస్ తుది జట్టులో లేడు. మోరిస్ తో పాటు స్టార్ ఓపెనర్ డూప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ లను కూడా ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాలో బోర్డు, ఆటగాళ్ల మధ్య కొంతకాలంగా సఖ్యత కొరవడింది. టి20 టోర్నీ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఎన్ని వివాదాలు తలెత్తుతాయో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం -
రాజస్తాన్ స్టార్ ఆటగాడిపై ఆ జట్టు కోచ్ కీలక వాఖ్యలు..
Kumar Sangakkara Comments On Chris Morris: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపై రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార సంగర్కర స్పందించాడు. బౌలర్ల వైఫల్యంపై అతడు ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ బౌలింగ్ పేలవ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా ఆర్సీబీతో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(58), యశస్వి జైస్వాల్(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరును కట్టడి చేయలేక పేలవ బౌలింగ్ ప్రదర్శనతో రాజస్తాన్ చతికిలపడింది. ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. మ్యాచ్ అనంతరం విలేఖరల సమావేశంలో అతడు మాట్లాడుతూ.. " ఐపీఎల్ 2021 మెదటి దశలో క్రిస్ మోరిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ సెకండ్ ఫేజ్‌లో మేము ఆశించింనంతగా బౌలింగ్ చేయలేదు. అది అతడికి కూడా తెలుసు. ఎందుకంటే తన 4 ఓవర్ల కోటాలో 50 పరుగుల ఇచ్చాడు. అతడు చాలా సమయాల్లో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తదుపరి మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో తిరిగి ఫామ్ కనబరుస్తాడని భావిస్తున్నాను''అని సంగర్కర పేర్కొన్నాడు. చదవండి: Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి -
'పో.. పో.. ఫోర్ వెళ్లు' అంటూ పొలార్డ్.. నోరెళ్లబెట్టిన మోరిస్
అహ్మదాబాద్: పవర్ హిట్టింగ్‌కు మారు పేరుగా ఉండే కీరన్ పొలార్డ్ ఎంటర్టైన్ అందించడంలోనూ అంతే ముందుంటాడు. ఒక్కోసారి తన చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ను క్రిస్ మోరిస్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతి పొలార్డ్ ఆడే ప్రయత్నం చేయగా.. వేగంగా వచ్చిన బంతి అతని హెల్మెట్‌కు బలంగా తాకి బౌండరీ వైపు పరుగులు తీసింది. దీంతో పొలార్డ్ వెనుకకు తిరిగి పో.. పో.. బౌండరీ వెళ్లు.. అంటూ చేతులను ఊపాడు.. తీరా బంతి బౌండరీ దాటడం.. లెగ్ బై రూపంలో పరుగుల వచ్చాయి. అయితే ఇది ఊహించని మోరిస్ మాత్రం షాక్ తిని నోరెళ్లబెట్టాడు. ఆ తర్వాత పొలార్డ్ మోరిస్ దగ్గరకు వచ్చి మోరిస్.. నువ్వు ఇది ఊహించి ఉండవు అంటూ పేర్కొన్నాడు. పొలార్డ్ చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉండడంతో నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు చేశారు. Courtesy: IPL T20.Com ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 70 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కృనాల్ 39 పరుగులతో అతనికి సహకరించాడు. రాజస్తాన్ బౌలర్లలో మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1 వికెట్ తీశాడు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: 'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు' pic.twitter.com/4SPgRkWgJg — Cricsphere (@Cricsphere) April 29, 2021 -
16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మోరిస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న రాజస్థాన్.. అతనికి భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. కానీ అతను రాజస్థాన్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో తప్పితే పెద్దగా ఆకట్టుకున్న సందర్భాలు లేవు. ప్రధానంగా బౌలింగ్‌లో మోరిస్ బారీ పరుగుల్ని సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన మోరిస్.. 14 ఓవర్లు బౌలింగ్ వేసి 139 పరుగులిచ్చాడు. ఇందులో అతను తీసుకున్న వికెట్లు ఐదు. ఆర్సీబీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లే వేసిన మోరిస్ 38 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. మోరిస్ ప్రదర్శనను ఎత్తిచూపాడు. ‘ భారీ మొత్తం చెల్లించి మోరిస్‌ను రాజస్థాన తీసుకుంది. మోరిస్‌పై అంత ధర పెట్టడం అంటే కాస్త ఆశ్చర్యమే అనిపించింది. దక్షిణాఫ్రికా తరఫున కూడా అతను ఫస్ట్ చాయిస్ కాదు. నిజాయితీగా చెప్పాలంటే మోరిస్‌ను అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నేనైతే అంత ధర మోరిస్‌పై పెట్టను. ఇలా చేస్తే అతనిపై ఒత్తిడి పెంచినట్లు ఉంటుంది. మోరిస్ ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది అతన్ని ఒత్తిడిలోకి నెడుతుంది. ఈ ధరను అతను కూడా ఊహించలేదు. అందుకే ఒత్తిడి నెలకొంది. ఈ సీజన్లో నిలకడైన మోరిస్‌ను ఇంత వరకూ చూడలేదు. మోరిస్ ప్రదర్శన ఇలానే ఉంటే రాజస్థాన్ ఆడబోయే చాలా మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం కూడా కష్టమే అవుతుంది. మనం కూడా అతని నుంచి భారీ ప్రదర్శన ఆశిస్తున్నాం. అతని గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం. ఒకవేళ రాజస్థాన్ తరఫున రాణించినా అతనిపై ఆ ఫ్రాంచైజీ పెట్టుకోలేదు. దాంతో కొన్ని మ్యాచ్‌లు మోరిస్ తప్పకుండా మిస్సవుతాడు’ అని బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్‌తో మాట్లాడిన పీటర్సన్ తెలిపాడు. ఇక్కడ చదవండి: ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..! సామ్సన్.. వారు నీలాగ 0, 1 చేయడం లేదు: గంభీర్ -
నన్ను తక్కువగా అంచనా వేశారు.. అయినా: క్రిస్ మోరిస్
ముంబై: ‘‘ఆరోజు సంజూ ఎంతో చక్కగా హిట్టింగ్ ఆడుతున్నాడు. కాబట్టి నా వికెట్ త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేవాడిని కాదు. నేనెంత త్వరగా వెనక్కి వెళ్లిపోగలనో నాకు తెలుసు. ఈ విషయంలో చాలా మంది నన్ను తక్కువగా అంచనా వేశారు. నా కాళ్లు సన్నగా ఉండవచ్చు. కానీ వేగంగా పరిగెత్తగలను. సంజూ చక్కటి షాట్‌తో ఇన్నింగ్స్ ముగిస్తాడనుకున్నాను. చివరి బంతిని సిక్సర్‌గా మలుస్తాడని భావించా. అదే జరిగితే ఇంకా బాగుండేది’’ అని రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ అన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ సామ్సన్ సిక్స్ కొట్టడంలో విఫలమై అవుట్ కావడంతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సింగిల్ తీసే అవకాశం ఉన్నా మోరిస్‌కు స్ట్రైక్ రొటేట్ చేయకుండా షాట్ ఆడటం పట్ల విమర్శలు వినిపించాయి. ఒకవేళ సింగిల్ తీస్తే మోరిస్ ఫోర్ కొట్టే అవకాశం ఉండేదని, అప్పుడు కచ్చితంగా విజయం వరించేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే, గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో తొలి గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. 18 బంతుల్లోనే 36 పరుగులు(4 సిక్సర్లు, నాటౌట్) చేసి జట్టును విజయతీరాలకు తీర్చాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘‘నేను హిట్టర్‌ను అని నాకు తెలుసు. గోల్ఫ్ కూడా ఆడతాను. మైదానంలో వేగంగా కదలగలను కూడా. నిజానికి ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మా జట్టులో డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. అదృష్టవశాత్తూ మేం మ్యాచ్ గెలిచాం. వాంఖడే స్టేడియంలో తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ బౌలర్లు రాణించినట్లుగానే మా వాళ్లు కూడా అనుభవరీత్యా చక్కని బంతులు వేస్తూ ఆకట్టుకున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింగిల్ వివాదాన్ని విలేకర్లు ఈ సందర్భంగా ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించాడు. చదవండి: Chris Morris: ఇజ్జత్ అంటే ఇదేనేమో.. వెల్డన్ మోరిస్! -
రూ. 16 కోట్లు: డబ్బుతో పాటు ఇప్పుడు ఇజ్జత్ కూడా!
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 16 కోట్ల రూపాయలు పెట్టి కొన్నందుకు జట్టుకు విజయం అవసరమైన సమయంలో రాణించిన తీరుపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ కెప్టెన్ సంజూ సామ్సన్ సింగిల్ తీయకుండా తనను తక్కువ చేసినందుకు క్రిస్ మోరిస్ ఇలా బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడంటూ నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తున్నారు. ‘‘యోగ్యుడు అయినప్పటికీ తనను ఎవరూ గుర్తించనపుడు చాలా బాధ కలుగుతుంది కదా. కానీ మనదైన రోజు తప్పక గుర్తింపు వస్తుంది. అందుకు ఇదే ఉదాహరణ. సంజూ ఇప్పుడేమంటాడో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ 18 బంతుల్లోనే 36 పరుగులు(4 సిక్సర్లు, నాటౌట్) చేసి చేజారుతుందనుకున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ను గెలుపుబాట పట్టించాడు. ఫలితంగా, పంత్ సేన తలవంచకతప్పలేదు. రాజస్తాన్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మోరిస్ ఇన్నింగ్స్‌పై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా రెండు ఫొటోలు షేర్ చేసిన వీరూ భాయ్.. ‘‘పిక్ 1 అంతకుముందు మ్యాచ్‌కు సంబంధించింది: డబ్బులు వచ్చాయి కానీ ఇజ్జత్ లేకుండాపోయింది. రెండో పిక్ నేటి మ్యాచ్‌కు సంబంధించింది: దీనినే ఇజ్జత్ అంటారేమో. ఈసారి డబ్బుతో పాటు గౌరవం కూడా. వెల్డన్ క్రిస్ మోరిస్’’అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇక ఆకాశ్ చోప్రా సైతం.. పైసా వసూల్ పర్ఫామెన్స్ అంటూ కితాబిచ్చాడు. చదవండి: సామ్సన్.. నా బ్యాటింగ్ చూడు! IPL 2021, DC vs RR: మోరిస్ మ్యాజిక్ Pic 1 last match - Paisa mila par izzat nahi mili Pic 2 today - Isse kehte hain Izzat. Izzat bhi , Paisa bhi - Well done Chris Morris #RRvsDC pic.twitter.com/9hLqMk7OKT — Virender Sehwag (@virendersehwag) April 15, 2021 पैसा वसूल 🥳🥳 #Morris #RRvDC #IPL2021 — Aakash Chopra (@cricketaakash) April 15, 2021 -
సామ్సన్.. నా బ్యాటింగ్ చూడు!
ముంబై: క్రిస్ మోరిస్‌కు రూ.16 కోట్లకు పైగా వెచ్చించి ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పటిదాకా ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న. భారీ ధర పెట్టి కొన్న మోరిస్ అసలు రాజస్థాన్‌కు ఏమైనా ఉపయోగపడతాడా? అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్వక్తం చేశారు. దానికి సరైన సమాధానం తన బ్యాట్‌తోనే చెప్పాడు మోరిస్. ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోరిస్ చిర్రెత్తినట్లు బ్యాటింగ్ చేశాడు. క్రీజ్‌లో కుదరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోని మోరిస్.. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు సాధించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనపై ఆశలు పెట్టుకున్న రాజస్థాన్‌కు చక్కని విజయం అందించి హీరో అయ్యాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్ధేశించిన 222 పరుగుల టార్గెట్‌కు అతి దగ్గరగా వచ్చి పరాజయం చెందింది రాజస్థాన్. 20వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొడితే రాజస్థాన్ గెలిచే స్థితిలో సంజూ భారీ షాట్ కాస్తా క్యాచ్ కావడంతో ఓటమి తప్పలేదు. ఆ ముందు బంతికి సంజూ సింగిల్ తీసే అవకాశాన్ని వద్దనుకున్నాడు. తాను సెట్ అయిన బ్యాట్స్‌మన్ కావడంతో అవతలి ఎండ్‌లో ఉన్న మోరిస్‌కు అవకాశం ఇవ్వలేదు. సింగిల్ తీసే అవకాశాన్ని సంజూ కాదనడంతో నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న మోరిస్ కూడా తన భావాల ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను కూడా బ్యాట్స్‌మన్‌నే కదా.. సింగిల్ తీసే ఉంటే ఆఖరి బంతికి ఫోర్ కొట్టలేనా అని మోరిస్ మనసులో కచ్చితంగా అనుకునే ఉంటాడు. ఆ అవకాశం తదుపరి మ్యాచ్‌లోనే వచ్చింది. ‘మొన్న చాన్స్ రాలేదు... ఈసారి వదలకూడదు’ అనే కసితో మోరిస్ బ్యాట్ ఝుళిపించాడు. ఏకంగా రబడా వేసిన 19 ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మోరిస్.. ఆపై టామ్ కరాన్ వేసిన ఆఖరి ఓవర్లో కూడా రెండు సిక్స్‌లు సాధించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్‌కు విజయాన్ని అందించాడు మోరిస్. మోరిస్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇటు రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో ఆనందం, అటు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన. అప్పటివరకూ మిల్లర్ (62; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరవిహారంం చేసి ఢిల్లీకి వణికిపుట్టిస్తే, ఆ తర్వాత మోరిస్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపామన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యేలా చేశాడు మోరిస్. ఇక తన కెప్టెన్ సంజూ సామ్సన్‌కు కూడా పరోక్షంగా తన బ్యాటింగ్ ఇది అంటూ సంకేతాలు పంపాడు మోరిస్. తాను రాహుల్ తెవాతియా కంటే కింది స్థానంలో వచ్చినా తన క్లాస్ ఏమిటో రాజస్థాన్ యాజమాన్యానికి చూపించాడు. మోరిస్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా, అప్పటికీ రాజస్థాన్ లొంగిపోయినట్లే కనబడింది. మోరిస్‌పై పెద్దగా నమ్మకం లేని రాజస్థాన్ కింది స్ధానంలో అతన్ని బ్యాటింగ్‌కు పంపింది. కానీ తన మీద ఎంతో బాధ్యత ఉందని గ్రహించిన మోరిస్.. తనకు వెచ్చించిన మొత్తాన్ని కూడా మనసులో తలచుకునే ఉంటాడు. తనకు వచ్చిన అవకాశాన్ని ఈ మ్యాచ్‌లో ఉపయోగించుకోలేకపోతే మళ్లీ రాకపోవచ్చనే కసితో ఆడాడు. దాంతో రాజస్థాన్ ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు తీరాలకు చేరింది. ఇక నుంచి మోరిస్‌ను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కంటే బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా రాజస్థాన్ చూడక తప్పదు. బ్యాటింగ్ ఆర్డర్లో మోరిస్‌కు ప్రమోషన్ ఇచ్చే అంశాన్ని కూడా రాజస్థాన్ కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇక్కడ చదవండి: RCB VS SRH: అరిచి అరిచి నా గొంతు పోయింది అతనికి కోహ్లి ఒక గొప్ప ఆస్తి: బ్రెట్ లీ -
IPL 2021, DC vs RR: మోరిస్ మ్యాజిక్
ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో క్రిస్ మోరిస్‌పై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 16 కోట్ల 25 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు పొందిన మోరిస్ తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోరిస్ మ్యాజిక్ చేశాడు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన మోరిస్ ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ వైపునకు తిప్పేశాడు. చివరి రెండు ఓవర్ల వరకు గెలుపు దిశగా సాగిన ఢిల్లీ జట్టు మోరిస్ విధ్వంసంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఓటమిని ఖాయం చేసుకుంది. ముంబై: ఐపీఎల్ తాజా సీజన్ మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు వేదికైంది. అయితే గత రెండు మ్యాచ్‌లకు భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేసిన జట్టు గెలిచింది. కానీ, ఒకటి మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోలాగే జరిగింది. అదే ఓడిపోతుందనకున్న జట్టు చివరికి గెలవడం. గురువారం వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో నెగ్గి సీజన్లో బోణీ కొట్టింది. చివరి రెండు ఓవర్లో రాజస్తాన్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా... మోరిస్ (18 బంతుల్లో 36 నాటౌట్; 4 సిక్స్‌లు) అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించాడు. రబడ వేసిన 19వ ఓవర్లో క్రిస్ మోరిస్ రెండు సిక్సర్లతో కలిపి 15 పరుగులు సాధించాడు. దాంతో రాజస్తాన్ విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. చివరి ఓవర్ వేసిన టామ్ కరన్ బౌలింగ్‌లో మోరిస్ వరుసగా 2, 6, 0, 6 కొట్టి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. జైదేవ్ ఉనాద్కట్ (7 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్)తో కలిసి మోరిస్ ఎనిమిదో వికెట్‌కు 3.5 ఓవర్లలో 46 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (32 బంతుల్లో 51; 9 ఫోర్లు) మినహా మిగతా వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జైదేవ్ ఉనాద్కట్ (3/15) బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయగా... ముస్తఫిజుర్ రహమాన్ (2/29) అతడికి సహకారం అందించాడు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ మిల్లర్ అర్ధ సెంచరీతో (43 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అవేశ్ ఖాన్ (3/32), వోక్స్ (2/22), రబడ (2/30) తొలుత హడలెత్తించినా... చివరికి మోరిస్ విధ్వంసానికి చేతులెత్తేశారు. ఉనాద్కట్ సూపర్ స్పెల్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవకాశం రాని జైదేవ్ ఉనాద్కట్ ఈ మ్యాచ్‌లో అదిరే బౌలింగ్‌తో అదరొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక భాగస్వామ్యంతో అలరించిన ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (2), ధావన్ (9)లను అవుట్ చేయడంతోపాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రహానే (8)ని రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో ధావన్ కొట్టిన స్కూప్ షాట్‌ను కీపర్ సామ్సన్ తన కుడివైపునకు డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తన మొదటి స్పెల్‌ల్లో మూడు ఓవర్లు వేసిన ఉనాద్కట్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక ఢిల్లీ వికెట్లను నేలకూల్చడంతో రాజస్తాన్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సారథి పంత్ మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 36/3గా నిలిచింది. పవర్‌ప్లే అనంతరం కూడా ఢిల్లీ వికెట్ల పతనం ఆగలేదు. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ముస్తఫిజుర్ ఒక స్లో డెలివరీ బంతితో స్టొయినిస్ (0)ను బోల్తా కొట్టించాడు. దాంతో ఢిల్లీ కష్టాలు ఎక్కువయ్యాయి. పంత్ ఫిఫ్టీ... అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన పంత్ 11వ ఓవర్లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. తెవాటియా వేసిన ఆ ఓవర్లో వరుసగా 4, 4, 4, 2, 2, 4 సాధించి 20 పరగులను రాబట్టాడు. దాంతో అప్పటి వరకు 6 కంటే తక్కువగా ఉన్న రన్‌రేట్ ఒక్కసారిగా 7ను అందుకుంది. మరుసటి ఓవర్లో మరో ఫోర్ సాధించిన పంత్... 30 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఇక పంత్ నుంచి ధనాధన్ ఇన్నింగ్స్ షురూ అయిందని అనుకునేలోపే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్ నాలుగో బంతిని లెగ్ సైడ్ ఆడిన పంత్ పరుగు కోసం వెళ్లగా... బంతిని అందుకున్న పరాగ్ నేరుగా వికెట్లను గిరాటేశాడు. దాంతో లలిత్ యాదవ్ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో కలిసి నెలకొల్పిన 51 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో టామ్ కరన్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), వోక్స్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), రబడ (4 బంతుల్లో 9; 1 ఫోర్) కాస్త పోరాడటంతో... ఢిల్లీ చివరి 4 ఓవర్లలో 40 పరుగులు సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ లేకపోవడం విశేషం. ఢిల్లీ బౌలర్ల దూకుడు... పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఢిల్లీ పేసర్లు ఆరంభం నుంచే రెచ్చిపోయారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడానికి బంతిని అందుకున్న వోక్స్ దూకుడు కనబర్చాడు. రాజస్తాన్ ఓపెనర్లు మనన్ వొహ్రా (9), జోస్ బట్లర్ (2)లను బంతి వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన రబడ... గత మ్యాచ్ సెంచరీ హీరో సంజూ సామ్సన్ (4)ను అవుట్ చేయడంతో 4 పరుగుల తేడాతో మూడు వికెట్లను చేజార్చుకున్న రాజస్తాన్ ఇన్నింగ్స్ కూడా కష్టాలతోనే మొదలైంది. ఇక తన వంతంటూ బౌలింగ్‌కు వచ్చిన అవేశ్ ఖాన్ తన వరుస ఓవర్లలో క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన దూబే (2), పరాగ్ (2)లను పెవిలియన్‌కు పంపాడు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 52/5గా నిలిచింది. పోరాడిన మిల్లర్... ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఓపిగ్గా ఆడిన మిల్లర్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ నుంచి బ్యాట్‌కు పని చెప్పాడు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టడంతో పాటు... మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాది రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించాడు. మరోపక్క నిలకడగా ఆడిన తెవాటియా (17 బంతుల్లో 19; 2 ఫోర్లు) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దాంతో మిల్లర్, తెవాటియాల 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చేయాల్సిన రన్‌రేట్ పెరుగుతూ ఉండటంతో దూకుడుగా ఆడటానికి మొగ్గు చూపిన మిల్లర్ 40 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ స్క్వేర్, స్క్వేర్ లెగ్‌ల మీదుగా రెండు సిక్సర్లను బాదిన డేవిడ్ మిల్లర్... హ్యాట్రిక్ సిక్సర్‌ను కొట్టబోయి లాంగాన్‌లో లలిత్ యాదవ్ చేతికి చిక్కాడు. దాంతో మిల్లర్ పోరాటం ముగిసింది. అయితే చివర్లో దూకుడుగా ఆడిన మోరిస్, ఉనాద్కట్‌తో కలిసి రాజస్తాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మిల్లర్ (బి) ఉనాద్కట్ 2; ధావన్ (సి) సామ్సన్ (బి) ఉనాద్కట్ 9; రహానే (సి అండ్ బి) ఉనాద్కట్ 8; పంత్ (రనౌట్) 51; స్టొయినిస్ (సి) బట్లర్ (బి) ముస్తఫిజుర్ 0; లలిత్ యాదవ్ (సి) తెవాటియా (బి) మోరిస్ 20; టామ్ కరన్ (బి) ముస్తఫిజుర్ 21; క్రిస్ వోక్స్ (నాటౌట్) 15; అశ్విన్ (రనౌట్) 7; రబడ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–5; 2–16, 3–36, 4–37, 5–88, 6–100, 7–128, 8–136. బౌలింగ్: చేతన్ సకారియా 4–0–33–0; జైదేవ్ ఉనాద్కట్ 4–0–15–3; మోరిస్ 3–0–27–1; ముస్తఫిజుర్ రెహమాన్ 4–0–29–2; రియాన్ పరాగ్ 2–0–16–0; రాహుల్ తెవాటియా 3–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) పంత్ (బి) వోక్స్ 2; మనన్ వొహ్రా (సి) రబడ (బి) వోక్స్ 9; సంజూ సామ్సన్ (సి) ధావన్ (బి) రబడ 4; శివమ్ దూబే (సి) ధావన్ (బి) అవేశ్ ఖాన్ 2; డేవిడ్ మిల్లర్ (సి) లలిత్ యాదవ్ (బి) అవేశ్ ఖాన్ 62; రియాన్ పరాగ్ (సి) ధావన్ (బి) అవేశ్ ఖాన్ 2; రాహుల్ తెవాటియా (సి) లలిత్ యాదవ్ (బి) రబడ 19; మోరిస్ (నాటౌట్) 36; జైదేవ్ ఉనాద్కట్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–17, 4–36, 5–42, 6–90, 7–104. బౌలింగ్: వోక్స్ 4–0–22–2; అవేశ్ ఖాన్ 4–0–32–3; రబడ 4–0–30–2; అశ్విన్ 3–0–14–0; టామ్ కరన్ 3.4–0–35–0; స్టొయినిస్ 1–0–15–0. -
సామ్సన్ చేసింది కరెక్టే కదా..!
ముంబై: పంజాబ్ కింగ్స్‌తో సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. గత ఐపీఎల్ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగి తొలి లీగ్ మ్యాచ్‌నే దాదాపు గుర్తు చేసిన ఈ మ్యాచ్.. ఈసారి రాజస్తాన్‌కు నిరాశనే మిగిల్చింది. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతులకు 8 పరుగులు వచ్చాయి. అందులో నాల్గో బంతిని సామ్సన్ సిక్స్‌గా కొట్టడంతో ఇంకా రెండు బంతుల్లో 5 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఐదో బంతికి పరుగు రాలేదు. డీప్ ఎక్స్ట్రా కవర్లో షాట్ కొట్టినా సామ్సన్ కనీసం పరుగు కోసం కూడా ప్రయత్నం చేయలేదు. చివరి బంతికి సిక్స్ కొడితేనే గెలుస్తారు. సామ్సన్ ప్రయత్నించాడు.. కానీ సిక్స్ రాలేదు.. ఇంచుమించు బౌండరీ లైన్ వద్దే దీపక్ హుడా క్యాచ్ పట్డడంతో సామ్సన్ ఓటయ్యాడు. రాజస్తాన్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. కాగా, సామ్సన్ ఎందుకు సింగిల్‌కు ప్రయత్నించలేదుని ఒక చర్చకు దారి తీసింది. దీనిపై సోషల్ మీడియలో అయితే తీవ్రంగా చర్చ నడుస్తోంది. కానీ ఇక్కడ అంతా సామ్సన్ చేసింది కరెక్టే అని ఎక్కువ శాతం నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సామ్సన్ ఒక సెట్ అయిన బ్యాట్స్‌మన్, అందులోనూ సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. అటువంటప్పుడు అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన మోరిస్‌కు స్టైకింగ్ ఇచ్చే కంటే సామ్సన్ తాడో-పేడో తేల్చుకుంటేనే బెటర్. ఇక్కడ సామ్సన్ చేసింది కరెక్ట్’ అని అతనికి మద్దతుగా నిలుస్తున్నారు అధికశాతం మంది నెటిజన్లు. మరొకవైపు మాజీ క్రికెటర్లు, కామెంటేర్లు కూడా సామ్సన్ చేసింది కరెక్టే అని అభిప్రాయపడుతున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్ చూపించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. పంజాబ్ కింగ్స్‌కు దడపుట్టించింది. కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయి పరాజయం చెందింది రాజస్తాన్. ఇక్కడ చదవండి: ఐపీఎల్ 2021: నా హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్ -
'అందుకే మోరిస్‌కు అంత ఖర్చు చేశాం'
జైపూర్: ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మోరిస్ కొత్త చరిత్ర సృష్టించాడు. మోరిస్ కోసం ఆఖరివరకు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరకు వేలంలో రాజస్తాన్ ఎక్కువ మొత్తం వెచ్చించి అతన్ని దక్కించుకుంది. తాజాగా మోరిస్‌కు వేలంలో అంత ఖర్చు చేయడం వెనుక రాజస్తాన్ రాయల్స్ స్పందించింది. 'ఐపీఎల్ వేలంలో పంజాబ్‌తో పోటీ పడి క్రిస్ మోరిస్‌ను దక్కించుకున్నాం. క్రిస్ మోరిస్ లాంటి అనుభవం ఉన్న బౌలర్ మాకు చాలా అవసరం. దక్షిణాఫ్రికా తరపున ఎన్నో మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన అతను డెత్ ఓవర్లలో జట్టుకు కీలకంగా మారి గెలిపించాడు. ఇప్పుడే అదే స్ట్రాటజీని మేము ఉపయోగించనున్నాం. మా ఇప్పటికే జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి లాంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. మోరిస్ వారికి జత కలిస్తే మరింత బలమవుతుంది. గత సీజన్లో ఆర్సీబీ తరపున 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మోరిస్ 11 వికెట్లు తీశాడు. అంతేగాక బ్యాటింగ్ సమయంలో తన పవర్ హిట్టింగ్తో చాలాసార్లు మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మోరిస్ కోసం అంత ఖర్చు చేయాల్సి వచ్చింది. అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాడని ఆశిస్తున్నాము అంటూ తెలిపింది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: కోహ్లి విచిత్ర భాష.. షాక్‌లో పాండ్యా, అక్షర్ కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు! -
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు
ఐపీఎల్–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్ పేసర్ జాయ్ రిచర్డ్సన్ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ టీమ్ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు. చెన్నై: ఎప్పటిలాగే ఐపీఎల్ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్ బద్దలు చేయడం విశేషం. ఐపీఎల్–2021 వేలం విశేషాలు చూస్తే... ► గత ఏడాది క్రిస్ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్ మోరిస్ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్ తప్పుకోవడంతో జేమీసన్ బెంగళూరు సొంతమయ్యాడు. ► మ్యాక్స్‌వెల్ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది. ► బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్ రిచర్డ్సన్ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్సీబీ చివరకు తప్పుకుంది. ► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేస్ బౌలర్ రిలీ మెరిడిత్ కోసం పంజాబ్ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది. ► వరల్డ్ నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది. ► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది. ► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ► గత ఐపీఎల్లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు. ► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్ టెండూల్కర్. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు. విహారికి నిరాశ... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్ టీమ్ సభ్యులలో లీగ్ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు. మళ్లీ ఐపీఎల్లో పుజారా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం! ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే... భారత సీనియర్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది. గౌతమ్‌కు రికార్డు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది. షారుఖ్ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా! తమిళనాడు జట్టు ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్ షారుఖ్ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్ మొదలు పెట్టగా, ఆర్సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ముగ్గురిని మాత్రమే... గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ టీమ్ కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు. వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్ జట్టునుంచి కె. భగత్ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు. ► కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు – బెంగళూరు) ► మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు) ► జాయ్ రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు – పంజాబ్) ► కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు – చెన్నై) ► రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు – పంజాబ్) ► మొయిన్ అలీ (రూ. 7 కోట్లు – చెన్నై) -
ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్
చెన్నై: అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మోరిస్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా అతని కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకూ రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ. 12 కోట్ల 50 లక్షల వరకూ వెళ్లగా, పంజాబ్ కింగ్స్ 14 కోట్ల వరకూ బిడ్ వేసింది. కానీ రాజస్తాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కింకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక్కడ చదవండి: మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
పాండ్యా, క్రిస్ మోరిస్ మాటల యుద్ధం
అబుదాబి: నువ్వా- నేనా అంటూ పోటీపడే సందర్భంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎవరికైనా కాస్త కష్టమే. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక క్రికెట్ వంటి క్రీడల్లో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఈ మాటల యుద్ధాలు శ్రుతిమించి తీవ్రవివాదాలకు దారి తీసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తద్వారా అంపైర్ల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు.(చదవండి: కాస్త ఓపిక పట్టు సూర్యకుమార్: రవిశాస్త్రి) ఇక ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ మధ్య వాగ్యుద్ధం జరిగింది. ముంబై విజయానికి చేరువవుతున్న తరుణంలో 19వ ఓవర్లో మోరిస్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచిన పాండ్యా, అదే ఓవర్లోని ఐదో బంతికి మోరిస్ గాలానికి చిక్కాడు. భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. (చదవండి: మొదటి అడుగు ముంబైదే!) ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో పాండ్యా, మోరిస్ ఇద్దరూ ప్రవర్తనా నియమావళి(లెవల్ 1- కోడ్ ఆఫ్ కండక్ట్)ని ఉల్లంఘించారని ఐపీఎల్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. కాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, బెంగళూరుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. #IPL2020 #MIvsRCB #RCBvsMI : Pandya vs Morris - What happened there pic.twitter.com/44u7o4aPBf — IPL 2020 HIGHLIGHT (@ipl2020highlite) October 29, 2020 -
‘అతనిది మాథ్యూ హేడెన్ స్టైల్’
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదూత్ పడిక్కల్‌పై సహచర ఆటగాడు క్రిస్ మోరిస్ ప్రశంసలు కురిపించాడు. తాను ఆడుతున్న ఆరంభపు ఐపీఎల్ సీజన్లోనే అదరగొడుతున్న పడిక్కల్ అచ్చం ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తరహాలోనే ఆడుతున్నాడన్నాడు. హేడెన్‌ను పడిక్కల్ గుర్తుచేస్తున్నాడని మోరిస్ కొనియాడాడు. షాట్ సెలక్షన్లో పడిక్కల్‌ను చూస్తుంటే హేడెన్ జ్ఞప్తికివస్తున్నాడన్నాడు. ‘అరోన్ ఫించ్‌తో పడిక్కల్ ఓపెనింగ్ పంచుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తోంది. పడిక్కల్ ఆటకు హేడెన్ ఆటకు చాలా దగ్గర లక్షణాలున్నాయి. సైజ్ పరంగా హేడెన్ భారీకాయుడు. హేడెన్ చెస్ట్ చాలా పెద్దది. ఇందులో పడిక్కల్‌కు పోలిక లేదు(నవ్వుతూ). బ్యాటింగ్ టెక్నిక్ పరంగా హేడెన్‌కు పడిక్కల్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. (రోహిత్ శర్మ ఔట్..) పడిక్కల్‌ను చూస్తే అతనిలో ఏదో ఉంది అనిపిస్తోంది’ అని మోరిస్ తెలిపాడు. ఇక తమ పేసర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లపై మోరిస్ ప్రశంసలు కురిపించాడు. యువ పేసర్లు తమ జట్టులో ఉండటమే కాకుండా వారికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు విజయాల్ని అందిస్తున్నారన్నాడు. గతంలో సైనీ ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడు తాను కూడా అదే ఫ్రాంచైజీలో ఉన్నానన్నాడు. అప్పుడే అతనొక మంచి బౌలర్ అనే విషయాన్ని గ్రహించానన్నాడు. ఆ టాల్ బౌలర్ బౌలింగ్ రాకెట్లు దూసుకుపోతున్నట్లు ఉంటుందన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ అసాధారణమని మోరిస్ కొనియాడాడు. -
'మా కెప్టెన్ అందుకే జీనియస్'
దుబాయ్ : ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆ జట్టు ఆటగాడు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ప్రశంసలతో ముంచెత్తాడు.శనివారం సీఎస్కేఓ జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 90 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో 37 పరుగులతో ఆర్సీబీ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక దశలో 16వ ఓవర్ వరకు 116 పరుగులతో నత్తనడకన సాగుతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కోహ్లి దూభేతో కలిసి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత మోరిస్ మూడు కీలక వికెట్లు తీయడంతో సీఎస్కే ఓటమిపాలయింది. మ్యాచ్ అనంతరం మోరిస్ స్పందించాడు.( చదవండి :రాహుల్ ఎవరి మాట వినడా.. అంతేనా?) 'మా కెప్టెన్ విరాట్ కోహ్లి నిజంగా జీనియస్. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కోహ్లి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తూ టెస్టు మ్యాచ్‌లకు సరిపోలిన వికెట్‌పై మొదట్లో ఆచితూచి ఆడిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 16వ ఓవర్ వరకు చెన్నై బౌలర్లకు మంచి అవకాశంగా కనిపించింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను నిలదొక్కుంటే ఎంత ప్రమాదమో చేసి చూపించాడు. కఠిన పరిస్థితుల్లో చెన్నై బౌలర్లను తట్టుకొని కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లో ఇన్నాళ్ల అంతర్జాతీయ అనుభవం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో ఐపీఎల్లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో కోహ్లి పేరు కూడా ఉంటుంది. ఒక లీడర్‌గా జట్టును గెలిపించాలని చూసే అతని మార్గదర్శనంలో నడవడం నాకు అదృష్టమనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టిన నేను మొదట్టో కాస్త ఒత్తడికి లోనయ్యాను. కానీ నా వంతు ప్రయత్నంగా జట్టును గెలిపించాలనే ప్రయత్నం చేశా. మొదటి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీయడం ద్వారా కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టాను అందుకు సంతోషంగా ఉన్నానంటూ మోరిస్ తెలిపాడు. (చదవండి : గేల్.. నువ్వు త్వరగా కోలుకోవాలి) కాగా ఆర్సీబీ జట్టు 2019 డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్‌ను రూ.10 కోట్లు చెల్లించి మరీ కొనుక్కున్న విషయం తెలిసిందే. కానీ ఆర్సీబీ తాను ఆడిన మొదటి 5 మ్యాచ్‌ల్లో మోరిస్‌ను ఆడించలేదు. స్టెయిన్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, యజ్వేంద్ర చాహల్‌తోనే నెట్టుకొచ్చింది. డెత్ ఓవర్ల స్పెషలిస్టగా ముద్ర పడిన క్రిస్ మోరిస్ బ్యాటింగ్‌లో కూడా రాణించగల సత్తా ఉంది. మరి అలాంటి మోరిస్‌ను ఆర్సీబీ ఎందుకు ఆడించలేదన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే మోరిస్ విషయంలో ఆర్సీబీ స్పందన పక్కనపెడితే కోహ్లి అభిమానులు మాత్రం మోరిస్ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. మోరిస్ లాంటి అస్ర్తాన్ని మంచి సమయం చూసి దించాలనేది కోహ్లి ఆలోచన అని తెలిపారు. అందుకే సీఎస్కేతో జరిగిన ఆరో మ్యాచ్ ముందు వరకు మోరిస్‌ను బరిలోకి దించలేదు. అయితే సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో మోరిస్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 12న కేకేఆర్‌తో తలపడనుంది. -
బంతితో ఫుట్‌బాల్ ఆడేసి.. వికెట్ తీశాడు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతున్న మోరిస్ బంతిని ఫుట్‌బాల్ తరహాలో తన్ని వికెట్‌ను సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ తొలి ఓవర్ ఆడటానికి సిద్ధం కాగా, థండర్స్ మోరిస్ చేతికి బంతినిచ్చింది. ఆ ఓవర్ ఐదో బంతికి డానియల్ హ్యూజ్స్ బంతిని డిఫెన్స్ ఆడి పరుగు తీయడానికి యత్నించాడు. అయితే బౌలింగ్ ఎండ్ నుంచి పరుగెత్తుకొంటూ వచ్చిన మోరిస్ బంతిని అమాంతంపై వికెట్లవైపు కాలితో తన్నేశాడు. ఫుట్‌బాల్ తరహాలో తన్నిన ఆ బంతి కాస్తా వికెట్లకు తగలడం, ఆ సమయానికి డానియల్ క్రీజ్‌లో చేరుకోలేకపోవడంతో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించి వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్వీటర్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 15.5 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌటైంది. అటు తర్వాత సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికి వర్షం పడింది. సిడ్నీ థండర్స్ 5.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం థండర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. రాబోవు ఐపీఎల్ సీజన్లో మోరిస్ ఆర్సీబీ తరఫున బరిలో దిగుతున్నాడు. Goodness gracious 😱 Elite footwork from Chris Morris. Not ideal running from Dan Hughes and Josh Philippe... #BBL09 pic.twitter.com/k0cD7ARqh1 — KFC Big Bash League (@BBL) January 18, 2020 -
మోరిస్‌కు పిలుపు
జొహన్నెస్‌బర్గ్: ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ అన్రిచ్ నోర్జి గాయంతో ఇంగ్లండ్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని కుడి బొటనవేలికి ఫ్రాక్చర్ కావడంతో 6 నుంచి 8 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ నెల 30 నుంచి మొదలయ్యే ప్రపంచకప్ కోసం నోర్జి స్థానంలో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. మోరిస్ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన వన్డేలో బరిలోకి దిగాడు. అనంతరం అతన్ని వన్డేల నుంచి తప్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఈ ఆల్‌రౌండర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లాడిన మోరిస్ 13 వికెట్లు తీశాడు. -
జూనియర్ డాలాకు పిలుపు
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నుంచి సఫారీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడుతున్న మోరిస్ టోర్నీ నుంచి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకే చెందిన పేసర్ జూనియర్ డాలాతో భర్తీ చేసేందుకు ఢిల్లీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ మేనేజ్మెంట్ నుంచి జూనియర్ డాలాకు పిలుపు అందింది. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో డాలా కలిసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతేడాది భారత్‌తో జరిగిన టీ 20 సిరీస్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేసిన డాలా.. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఆకట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో డాలా ఏడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/35గా ఉంది. -
మేము తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం: మోరిస్
జోహన్నెస్‌బర్గ్ : మొదటి మూడు వన్డేలు సొంత గడ్డపై ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా టీం సభ్యులంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని..అయినా ఫాంలోకి వస్తామని ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. సిరీస్ సొంతం చేసుకోవడానికి నాలుగో వన్డే తమకు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదని అభిప్రాయపడ్డారు. వన్డేల్లో 2013 నుంచి తమ టీం సిరీస్‌లో వెనకబడలేదని, మొదటి సారి టీం ఇండియా ఆధిక్యత కనబరుస్తోందని చెప్పారు. ఒక వేళ నాలుగో వన్డేలో కూడా ఓడిపోతే సిరీస్ పోయినట్లేనని మోరిస్ అన్నారు. ఎటువంటి ఒత్తిడి లేకపోతే క్రికెట్లో ఏం మజా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదంతా క్రికెట్లో భాగమేనన్నారు. రేపు జరగబోయే మ్యాచ్‌లో తాము తమ శక్తికి మించి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ నాలుగో వన్డేలో జట్టుతో చేరడంతో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. నాలుగో వన్డేలో డేవిడ్ మిల్లర్ కానీ ఖాయా జోండోలలో ఒకరికే అవకాశం లభించవచ్చునని తెలిపారు. మణికట్టు బౌలర్లైన చాహల్ ,కుల్దీప్లను దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్లు ఎదుర్కోవడం పెద్ద ఛాలెంజేనని వ్యాఖ్యానించారు. మూడు వన్డేల్లో మొత్తం 30 వికెట్లలో 21 వికెట్లు వీరిద్దరే సాధించారని పేర్కొన్నారు. వీరిని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్లాన్లు సిద్ధం చేయలేదని, కాస్త హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనకు ఫండ్స్ కలెక్ట్ చేసేందుకు నిర్వహించబోయే పింక్ వన్డేలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా టీం ఓడిపోలేదని గుర్తు చేశారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 10న నాలుగో వన్డే జరుగనుంది. -
సూపర్మ్యాన్లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను ఆపి!
-
సూపర్మ్యాన్లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను ఆపి!
బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచులు పట్టడం ఇప్పుడు ఒకింత మామూలు విషయమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు బౌండరీ లైన్ దగ్గర గాలిలో ఎగిరి క్యాచ్‌లు ఎలా పట్టాలో తీవ్రంగా శిక్షణ తీసుకుంటోంది. కానీ, ఇటీవల ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూ సామ్సన్ అద్భుతమైన ఫీట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను క్యాచ్ పట్టుకోవడమే కాదు.. తాను బౌండరీలైన్ అవతల పడుతున్నట్టు గుర్తించి వెంటనే బంతిని విసిరేశాడు. దీంతో సంజు సిక్సర్‌ను ఆపినట్టు అయింది. 19 ఓవర్ రెండో బంతికి నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టాడు. అది దాదాపు సిక్సర్ అని అందరూ అనుకున్నారు. కానీ సంజూ అనూహ్యంగా కుడివైపు జంప్ చేస్తూ.. గాలిలోకి ఎగిరి బంతిని అదుకొని.. రెప్పపాటులోనే దానిని మైదానంలోకి విసిరేశాడు. దీంతో సంజు బౌండరీలైన్ అవతల పడినా.. సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇది అద్భుతమైన ఫీట్ అని క్రికెట్ అభిమానులు పొగుడుతున్నారు. ఈ అద్భుతమైన ఫీట్‌ను మీరూ ఇక్కడ చూడొచ్చు. -
మోరిస్ మోత మోగించాడు!
పుణె: ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ క్రిస్ మోరిస్ ఐపీఎల్-10లో అభిమానులకు అసలుసిసలు మజా అందించాడు. పుణెతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. మోరిస్ విజృంభణతో డేర్ డెవిల్స్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు సాధించింది. వీర బాదుడుతో మోరిస్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. సునామీ ఇన్నింగ్స్ తో అత్యధిక స్ట్రైక్ రేటు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 422.22గా నమోదు కావడం విశేషం. ఐపీఎల్ లో ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేటు. ఇంతకుముందు ఈ రికార్డు అల్బీ మోర్కల్ పేరిట ఉండేది. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోర్కల్ 400 స్ట్రైక్ రేటుతో 7 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. మోరిస్ విజృంభణతో అతడి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సంజూ శామ్సన్, మోరిస్ చెలరేగడంతో చివరి 4 ఓవర్లలో డేర్ డెవిల్స్ 76 పరుగులు సాధించింది. ఇది కూడా మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. -
'నా టీ 20 కెరీర్లో ఇదే నా బెస్ట్'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ లయన్స్ పై 17 బంతుల్లో నమోదు చేసిన హాఫ్ సెంచరీనే తన టీ 20 కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ స్పష్టం చేశాడు. ఆ ఇన్నింగ్స్ తనకు సంతృప్తినిచ్చినా చివరి వరకూ క్రీజ్‌లో ఉండి ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోవడం నిరాశకల్గించదన్నాడు. చివరి బంతికి నాలుగు బంతులు చేయాల్సిన క్రమంలో రెండు పరుగులే సాధించి ఓటమి పాలుకావడం బాధ కల్గించిదన్నాడు. ' నా టీ 20 కెరీర్ లో ఇదే అత్యత్తమ ఇన్నింగ్స్. నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చేసరికి మా జట్టు ఓవర్ కు సగటున 13 పరుగులు చేయాల్సి ఉంది. నా సహజసిద్ధమైన ఆట తీరునే ప్రదర్శించాలని క్రీజ్‌లోకి వచ్చే సమయంలోనే అనుకున్నా. కేవలం బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టా. నా వ్యూహం ఫలించింది. వికెట్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. దాంతో బౌలర్ ఎవరన్నది చూడకుండా విరుచుకుపడ్డా. కానీ చివరి ఓవర్ వరకూ క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయా' అని మోరిస్ తెలిపాడు. ఐపీఎల్-లో భాగంగా బుధవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. క్రిస్ మోరిస్ 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8 సిక్సర్లతో పరుగుల వరద సృష్టించినా ఢిల్లీని పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. గుజరాత్ విసిరిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 171 పరుగులకే పరిమితమై పాలైంది. -
దక్షిణాఫ్రికాను గెలిపించిన మోరిస్
జొహన్నెస్‌బర్గ్: ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (38 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు గట్టెక్కింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. నిర్ణాయక ఆఖరి వన్డే నేడు (ఆదివారం) కేప్‌టౌన్‌లో జరుగుతుంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ 210 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోరిస్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. తొమ్మిదో వికెట్‌కు అబాట్ (3 నాటౌట్)తో కలిసి 52 పరుగులు జత చేసి విజయానికి మరో పరుగు దూరంలో అవుటయ్యాడు. తాహిర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 262 పరుగులు చేసింది. జో రూట్ (124 బంతుల్లో 109; 10 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... హేల్స్ (56 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రబడాకు నాలుగు, తాహిర్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు
ఈసారి ఐపీఎల్ వేలాన్ని గమనిస్తే... భారత జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లతో పాటు తుది జట్టులో ఎక్కువ అవసరం ఉన్న దేశవాళీ హిట్టర్స్ ప్రాముఖ్యాన్ని ప్రాంఛైజీలు గుర్తించినట్లు కనిపిస్తోంది. వేలానికి వచ్చే ముందే తమ జట్టు కూర్పు ఎలా ఉండాలనే స్పష్టతతోనే అన్ని జట్లూ వచ్చాయి. విదేశీ ఆల్‌రౌండర్లు క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)లకు భారీ మొత్తాలు ఇచ్చిన ప్రాంఛైజీలు... ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తోన్న మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) లాంటి క్రికెటర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. గత ఎనిమిది సీజన్ల పాటు ఎవరికి పడితే వారికి లెక్కలేకుండా డబ్బులు ఇచ్చిన జట్లు ఈసారి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాయి. వేలంలో డబ్బు వృథా కాకుండా జాగ్రత్తపడ్డాయి. భారీ కసరత్తు తర్వాత... ఐపీఎల్లో దేశవాళీ క్రికెటర్లు జట్టులో ఎక్కువ మం ది అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని మొత్తం అన్ని ఫ్రాంచైజీలు గుర్తించాయి. దీంతో గత ఏడాది దేశవాళీ క్రికెట్లో అన్ని మ్యాచ్‌లనూ అన్ని జట్లూ జాగ్రత్తగా పరిశీలించాయి. ముంబై కోచ్ జాన్‌రైట్ దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు తిరిగి మ్యాచ్‌లు చూశారు. కొన్ని ఫ్రాంచైజీలు కేవలం ఈ పని కో సమే నిపుణులను తీసుకుని 2 నెలల పాటు దేశంలో అన్ని మ్యాచ్‌లూ చూపించాయి. మొత్తమ్మీద బాగా హోమ్‌వర్క్ చేశారు. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు అడిగిన కొందరు క్రికెటర్ల ఫొటోలు కూడా ఐపీఎల్ కౌన్సిల్ దగ్గర కూడా లేవు. దీనిని బట్టి ఏ స్థాయిలో కసరత్తు చేశారో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే... ఈసారి వేలంలో అనూహ్యంగా మనోజ్ తివారీ (బెంగాల్), ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్)లను ఎవరూ కొనకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా ‘దాదా’ గంగూలీ శిష్యుడుగా భావించే మనోజ్ తివారీ కోల్‌కతా క్రికెట్లో పెద్ద సంచలనం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఐపీఎల్లో ముంబై జట్టులో మొదటి నుంచీ కీలక ఆటగాడిగా ఉన్న హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు ఓజానూ ఏ జట్టూ తీసుకోలేదు. స్పిన్నర్ రాహుల్ శర్మనూ లెక్కలోకి తీసుకోలేదు. భారత జట్టుకు దూరమైన మునాఫ్ పటేల్, పంకజ్ సింగ్, సుదీప్ త్యాగిలనూ ఎవరూ తీసుకోలేదు. అయితే ఆర్పీ సింగ్ ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు... ధోనికి సన్నిహితుడైనందున అతణ్ని పుణే తీసుకుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తన సీనియర్ సహచరుడు ప్రవీణ్ కుమార్ పట్ల గుజరాత్ లయన్స్ కెప్టెన్ రైనా ఆసక్తిచూపడంతో ఆ జట్టు కాస్త భారీ మొత్తమే వెచ్చించి ప్రవీణ్‌ను తీసుకుంది. విదేశీయులపై చిన్నచూపు ప్రతి జట్టులోనూ తుది జట్టులో నలుగురు మాత్రమే విదేశీ క్రికెటర్లు ఉండాలి. ప్రతి జట్టులోనూ గరిష్టంగా తొమ్మిది మందిని తీసుకోవచ్చు. గత ఏడాది వరకు దాదాపు అన్ని జట్లూ తొమ్మిది మందిని తీసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం దీనిని పట్టించుకోలేదు. పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే నలుగురు స్టార్ క్రికెటర్లు ఉంటే చాలనుకున్నారు. దాదాపు అన్ని జట్లకూ వేలానికి ముందే విదేశీ స్టార్స్ ఉన్నారు. నిజానికి న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయినా ఎవరూ తీసుకోలేదు. కనీసం 50 లక్షల రూపాయలు ఇచ్చి రిజర్వ్‌గా అయినా తీసుకోవచ్చు. అయినా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక శ్రీలంక క్రికెటర్లను పూర్తిగా చిన్నచూపు చూశారు. అలాగే వెటరన్స్ మైక్ హస్సీ, జయవర్ధనేల పట్లా ఆసక్తి చూపలేదు. ఏ లీగ్‌లో పడితే ఆ లీగ్‌లో పది వేలు, 20 వేల డాలర్లకు ఆడుతూ ఐపీఎల్లో మాత్రం భారీగా సంపాదించుకుంటున్న, సంపాదించాలనుకున్న విదేశీ క్రికెటర్లందరికీ ఈసారి ఐపీఎల్ వేలం షాక్‌ను మిగి ల్చిందనే అనుకోవాలి. -సాక్షి క్రీడావిభాగం