Photo Courtesy: BCCI/IPL
ముంబై: ‘‘ఆరోజు సంజూ ఎంతో చక్కగా హిట్టింగ్ ఆడుతున్నాడు. కాబట్టి నా వికెట్ త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేవాడిని కాదు. నేనెంత త్వరగా వెనక్కి వెళ్లిపోగలనో నాకు తెలుసు. ఈ విషయంలో చాలా మంది నన్ను తక్కువగా అంచనా వేశారు. నా కాళ్లు సన్నగా ఉండవచ్చు. కానీ వేగంగా పరిగెత్తగలను. సంజూ చక్కటి షాట్‌తో ఇన్నింగ్స్ ముగిస్తాడనుకున్నాను. చివరి బంతిని సిక్సర్‌గా మలుస్తాడని భావించా. అదే జరిగితే ఇంకా బాగుండేది’’ అని రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్ అన్నాడు.
కాగా పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్ కెప్టెన్ సంజూ సామ్సన్ సిక్స్ కొట్టడంలో విఫలమై అవుట్ కావడంతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సింగిల్ తీసే అవకాశం ఉన్నా మోరిస్‌కు స్ట్రైక్ రొటేట్ చేయకుండా షాట్ ఆడటం పట్ల విమర్శలు వినిపించాయి. ఒకవేళ సింగిల్ తీస్తే మోరిస్ ఫోర్ కొట్టే అవకాశం ఉండేదని, అప్పుడు కచ్చితంగా విజయం వరించేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే, గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. 18 బంతుల్లోనే 36 పరుగులు(4 సిక్సర్లు, నాటౌట్) చేసి జట్టును విజయతీరాలకు తీర్చాడు.
ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘‘నేను హిట్టర్‌ను అని నాకు తెలుసు. గోల్ఫ్ కూడా ఆడతాను. మైదానంలో వేగంగా కదలగలను కూడా. నిజానికి ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మా జట్టులో డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. అదృష్టవశాత్తూ మేం మ్యాచ్ గెలిచాం. వాంఖడే స్టేడియంలో తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ బౌలర్లు రాణించినట్లుగానే మా వాళ్లు కూడా అనుభవరీత్యా చక్కని బంతులు వేస్తూ ఆకట్టుకున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింగిల్ వివాదాన్ని విలేకర్లు ఈ సందర్భంగా ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించాడు.
చదవండి: Chris Morris: ఇజ్జత్ అంటే ఇదేనేమో.. వెల్‌డన్ మోరిస్!
Comments
Please login to add a commentAdd a comment