అబ్దుల్‌ సమద్‌ సూపర్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌ | IPL 2021: Abdul Samad Stunning Catch Of Sanju Samson Became Viral | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌ సమద్‌ సూపర్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published Sun, May 2 2021 5:57 PM | Last Updated on Sun, May 2 2021 7:11 PM

IPL 2021: Abdul Samad Stunning Catch Of Sanju Samson Became Viral - Sakshi

ఢిల్లీ: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు అబ్దుల్‌ సమద్‌ సూపర్‌ క్యాచ్‌తో మెరిశాడు. విజయ్‌ శంకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ నాలుగో బంతిని సామ్సన్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు.  అయితే బౌండరీ లైన్‌ మీదున్న అబ్దుల్‌ సమద్‌ తనను తాను బ్యాలెన్స్‌ చేసుకుంటూ క్యాచ్‌ను నేర్పుగా అందుకున్నాడు. కొంచెం అటూ ఇటైనా సమద్‌ బౌండరీలైన్‌ను తొక్కేసేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బట్లర్‌ సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 64 బంతుల్లో 124 పరుగులు చేసిన బట్లర్‌ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సామ్సన్‌ 48 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement