Abdul Samad Sheikh
-
పోయి గల్లీ క్రికెట్ ఆడుకో నాయనా.. కావ్య మారన్ ఎందుకు భరిస్తుంది?
-
నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో!
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో పరాభావం ఎదురైంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మెరిడిత్, చావ్లా తలా రెండు వికెట్లు సాధించగా.. గ్రీన్, అర్జున్ టెండ్కూలర్ చెరో వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సమద్ చెత్త ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ విజయానికి 60 పరుగులు కావాలి. ఈ సమయంలో సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సమద్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక బౌండరీ మాత్రమే ఉంది. జట్టును గెలిపించాలన్న కనీస ప్రయత్నం అతడు చేయనట్లు సృష్టంగా కన్పించింది. అతడి కన్న ఆల్‌రౌండర్లు జానెసన్(13), సుందర్(10) 100 రెట్లు బెటర్. ఉన్న కాసేపు అయిన తమ వంతు న్యాయం చేశారు. ఇక ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న సమద్.. అవసరములేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన అబ్దుల్ సమద్ ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. సమద్ వల్లే మ్యాచ్ ఓడిపోయింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నీ ఆటకు ఓ దండం అంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. కాగా గత కొన్ని సీజన్ల నుంచి సమద్ ఎస్ఆర్హెచ్కే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: #WashingtonSundar: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే You made whole Kashmir proud today. Everyone bow down to KING SAMAD🙇♂️ pic.twitter.com/1kFhJFMLzP — crazystalker🇮🇹 (@nanakostan) April 18, 2023 Samad in whole match pic.twitter.com/Kfi6U7bR2w — Hoiii (@killuaaaa09) April 18, 2023 -
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.. ఆ పని ముందే చేయాల్సింది!
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ తమ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాది సీజన్లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ ఆరంభం నుంచే తడబడింది. పిచ్‌పై బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పవర్‌ప్లే లోపే స్పిన్నర్లను రంగంలోకి దించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా.. అగర్వాల్ వికెట్ పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ హైదరాబాద్ బ్యాటర్లు లక్నోకు పోటీఇవ్వలేకపోయారు. ఆ పని ముందే చేయాల్సింది.. 9 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్ఆర్హెచ్ కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ పెద్ద తప్పు చేసింది. బ్యాటింగ్ లైనప్‌లో ముందు ఉన్న అబ్ధుల్ సమద్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను పంపింది. ఇదే సన్‌రైజర్స్ కొంపముంచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఔటైన వెంటనే అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. అయితే సమద్ క్రీజులోకి వచ్చినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 121 పరుగులైనా చేయగల్గింది. ఇక సుందర్ స్థానంలో సమద్ బ్యాటింగ్ వచ్చే పరిస్ధితి మరోవిధంగా ఉండేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అదే విధంగా రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ 32 పరుగులు చేసి అందరని అకట్టుకున్నాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
19 ఫోర్లు..2 సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ ఆటగాడు!
రంజీ ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్, ఎస్ఆర్హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. సమద్ 78 బంత్లుతో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. సమద్ తుపాన్ ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ 426 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసింది. పాండిచ్చేరి బ్యాటర్లలో పీకే డోగ్రా(108), కార్తీక్(63) పరుగులతో రాణించారు. జమ్మూ బౌలర్లలో పార్వేజ్ రసూల్ 4 వికెట్లు పడగొట్టగా, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరగులకు ఆలౌటైంది. జమ్మూ బ్యాటర్లలో కమ్రాన్ ఇక్భాల్(96),సమద్(103) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం ముందు కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకుంది. చదవండి: Ranji Trophy 2022: తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ హిట్టర్ -
అబ్దుల్ సమద్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. విజయ్ శంకర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతిని సామ్సన్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ మీదున్న అబ్దుల్ సమద్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ క్యాచ్‌ను నేర్పుగా అందుకున్నాడు. కొంచెం అటూ ఇటైనా సమద్ బౌండరీలైన్‌ను తొక్కేసేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బట్లర్ సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 64 బంతుల్లో 124 పరుగులు చేసిన బట్లర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సామ్సన్ 48 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. Abdul Samad's ice-cool catch https://t.co/GBrXLRclRW — varun seggari (@SeggariVarun) May 2, 2021 -
కొత్తగా సత్తా చాటేందుకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సూపర్ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. దేశవాళీ, జూనియర్ క్రికెట్లో ఇప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నా... ఐపీఎల్ అందించే కిక్కే వేరు. అలాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కూడా ఏరికోరి జట్టులోకి తీసుకున్నాయి. రాబోయే ఐపీఎల్ –2020లో అలా అందరి దృష్టీ నిలిచిన కొందరు ‘అన్క్యాప్డ్’ యువ భారత ఆటగాళ్ల వివరాలు... యశస్వి జైస్వాల్ (రాజస్తాన్ రాయల్స్) ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించి ముంబైలో స్థిరపడ్డ 18 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే యశస్వి పేరిట దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో ఘనతలున్నాయి. 13 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలోనే అతను ఆరుసార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. సగటు 70.81 కాగా, అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టులో దాదాపుగా చోటు ఖాయం. మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్పలతో ఓపె నర్ స్థానానికి పోటీ పడుతున్న యశస్వికే ఎక్కువ చాన్స్ ఉంది. అబ్దుల్ సమద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల సమద్‌ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. గత సీజన్లో అద్భుత బ్యాటింగ్‌తో రంజీ మ్యాచ్‌లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో విరుచుకుపడగల సత్తా ఉంది. గత రంజీ సీజన్లో గరిష్ట మ్యాచ్‌ల కంటే రెండు మ్యాచ్‌లు తక్కువే ఆడినా అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత అతని సొంతం. సన్‌రైజర్స్ ఆరు లేదా ఏడో స్థానంలో ఆడించి ఫినిషర్‌గా వాడుకునేందుకు మంచి అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) చక్కటి టెక్నిక్ ఉన్న దూకుడైన మహారాష్ట్ర బ్యాట్స్‌మన్. గత రెండు సీజన్లలో కలిపి చూస్తే భారత దేశవాళీ వన్డేల్లో అతను అందరికంటే ఎక్కువ పరుగులు (15 ఇన్నింగ్స్‌లలో 843) సాధించాడు. ధోని మాటల్లో చెప్పాలంటే ‘చురుకైన బుర్ర’ కలవాడు. సాధారణంగా అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానాల్లో ఆడతాడు. రైనా గైర్హాజరులో 23 ఏళ్ల రుతురాజ్‌కు సత్తా ఇది సువర్ణావకాశం. జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ కూడా ఇదే మాట చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆరంభ మ్యాచ్‌లకు ఒకవేళ దూరమైనా...తర్వాతి నుంచైనా రుతురాజ్ చెలరేగిపోగలడు. దేవ్‌దత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఏడాది కాలంలో భారత దేశవాళీ క్రికెట్లో తన దూకుడైన ఆటలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న క్రికెటర్ 20 ఏళ్ల దేవ్‌దత్. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడుతున్న దేవ్‌దత్ గత దేశవాళీ సీజన్లో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్ రేట్‌తో అతను 580 పరుగులు సాధించడం విశేషం. బెంగళూరు జట్టులో ఓపెనర్ స్థానంలో అతను పార్థివ్ పటేల్‌తో పోటీ పడుతున్నాడు. రవి బిష్ణోయ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అండర్–19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్ స్పిన్నర్. 6 మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీసిన అతడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. రాజస్తాన్‌కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్ క్రికెటర్ల మాట. పంజాబ్ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్ మురుగన్ నుంచి పోటీ ఉన్నా... బిష్ణోయ్‌పై అందరి దృష్టి ఉంది. టీమ్ కోచ్‌గా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలినట్లు టీమ్ వర్గాలు చెబుతున్నాయి. -
48 ఏళ్లలో 17, 532 మొక్కలు
అబ్దుల్ సమద్ షేక్.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధుడికి మరో పేరు కూడా ఉందండోయ్! అందరూ ఇతడిని ముద్దుగా ‘ట్రీ సమద్’ అని పిలుస్తున్నారు. సమద్కున్న ఓ అలవాటు వల్ల ఈ పేరు వచ్చింది. అదే గత 48 ఏళ్లుగా ప్రతిరోజూ ఒక మొక్కను నాటడం! ఇతని స్వస్థలం బంగ్లాదేశ్‌లోని ఫరీద్పూర్. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజుకి సుమారుగా రూ. 80 సంపాదిస్తుంటాడు. తాను సంపాదించిన ఆదాయంలో నుంచే ఫరీదా పూర్ హార్టికల్చర్ సెంటర్లో రోజూ ఒక మొక్కను కొని నాటుతూ వస్తున్నాడు. ఇతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఫరీద్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకు చెందిన స్థలంలో రెండు రేకుల షెడ్లు వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. సమాజానికి అబ్దుల్ చేస్తున్న కృషిని గుర్తించి ది డైలీ స్టార్ అనే వార్తా సంస్థ అతడికి రూ. 80 వేల నగదు బహుమతిని అందజేసి గౌరవించింది. 48 ఏళ్లలో ఆయన మొత్తం 17,532 మొక్కలను నాటాడు. ‘నా పదకొండో ఏట నుంచే మొక్కలను నాటడం ప్రారంభించాను. ప్రభుత్వ స్థలంలోనే వాటిని నాటుతాను. దీంతో వాటిని ఎవరూ పెరికేందుకు ప్రయత్నించరు. ఎవరైనా మొక్కలు పీకితే నాకు చాలా కోపం వస్తుంది. రోజూ ఒక మొక్క అయినా నాటనిదే నాకు నిద్ర పట్టదు. నాకు ప్రాణులు, జంతువులన్నా ఇష్టమే’ అని సమద్ ప్రేమగా చెబుతున్నాడు.