IPl 2023 SRH Vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకో పో! | Fans Trolls Sunrisers Batter Abdul Samad - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకో పో!

Published Wed, Apr 19 2023 7:44 AM | Last Updated on Wed, Apr 19 2023 9:13 AM

IPl 2023  SRH vs MI: Fans trolls sunrisers batter Abdul Samad - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో పరాభావం ఎదురైంది. ఉప్పల్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 178 పరుగులకు ఆలౌటైంది.

ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మెరిడిత్‌, చావ్లా తలా రెండు వికెట్లు సాధించగా.. గ్రీన్‌, అర్జున్‌ టెండ్కూలర్‌ చెరో వికెట్‌ సాధించారు. ఎస్ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌(48) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

సమద్ చెత్త ఇన్నింగ్స్‌
ఆఖరి 5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 60 పరుగులు కావాలి. ఈ సమయంలో సన్‌రైజర్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సమద్‌ 13 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక బౌండరీ మాత్రమే ఉంది. జట్టును గెలిపించాలన్న కనీస ప్రయత్నం అతడు చేయనట్లు సృష్టంగా కన్పించింది. అతడి కన్న ఆల్‌రౌండర్లు జానెసన్‌(13), సుందర్‌(10) 100 రెట్లు బెటర్‌. ఉన్న కాసేపు అయిన తమ వంతు న్యాయం చేశారు. 

ఇక ఆఖరి ఓవర్‌ వరకు క్రీజులో ఉన్న సమద్‌.. అవసరములేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన అబ్దుల్ సమద్ ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు మండిపడుతున్నారు. సమద్‌ వల్లే మ్యాచ్‌ ఓడిపోయింది అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నీ ఆటకు ఓ దండం అంటూ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. కాగా గత కొన్ని సీజన్‌ల నుంచి సమద్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: #WashingtonSundar: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement