రంజీ ట్రోఫీలో భాగంగా పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాటర్, ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు అబ్దుల్ సమద్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. సమద్ 78 బంత్లుతో 19 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 103 పరుగులు చేశాడు. సమద్ తుపాన్ ఇన్నింగ్స్‌తో తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ 426 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులు చేసింది.
పాండిచ్చేరి బ్యాటర్లలో పీకే డోగ్రా(108), కార్తీక్(63) పరుగులతో రాణించారు. జమ్మూ బౌలర్లలో పార్వేజ్ రసూల్ 4 వికెట్లు పడగొట్టగా, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరగులకు ఆలౌటైంది. జమ్మూ బ్యాటర్లలో కమ్రాన్ ఇక్భాల్(96),సమద్(103) పరుగులతో టాప్ స్కోరర్‌లగా నిలిచారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలం ముందు కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకుంది.
చదవండి: Ranji Trophy 2022: తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్ హిట్టర్
Comments
Please login to add a commentAdd a comment