courtesy : IPL/bcci
ఢిల్లీ : ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక చతికిలపడుతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. మూడు ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ వేదికగా రేపు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతుంది.ఐపీఎల్ 13వ సీజన్‌లో స్మిత్ సారధ్యంలోని రాయల్స్ దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దాంతో ఈ సీజన్‌కు స్మిత్‌ను రిలీవ్ చేసిన రాజస్తాన్ సంజూ సామ్సన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. అదే జట్టులో ఉన్న బట్లర్ ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో సంజూకు కెప్టెన్సీ విషయంలో ఏమైనా సలహాలు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు.
''ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రాజస్తాన్ రాయల్స్ ఆటగాడిగా మాత్రమే ఉన్నా. కానీ కెప్టన్సీలో నాకున్న అనుభవాన్ని పంచుకుంటా. ఎందుకంటే సంజూ సామ్సన్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఇదే తొలి ఏడాది. అతను కెప్టెన్సీ చేయడంలో తడబడితే నా సలహాలు తప్పకుండా ఉంటాయి. ఇంగ్లండ్ జట్టుకు ఆడినప్పుడు వైస్ కెప్టెన్‌గా నా సలహాలు అందించా.. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆ స్థానంలో లేకపోయినా సామ్సన్‌కు నా సలహాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటా. ఒక జట్టుకు ఆటగాడిగా కెప్టెన్‌కు సలహాలు ఇవ్వడం నా కర్తవ్యం.
నేనే కాదు.. మిల్లర్, మోరిస్ లాంటి సీనియర్ క్రికెటర్లు సంజూ లాంటి యువ కెప్టెన్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మా సలహాలు అతనికి ఉపయోగపడుతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఇక ఈ సీజన్‌లో మా ప్రదర్శన పడుతూ లేస్తు సాగుతున్న ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మాకు రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి అంటూ ''చెప్పుకొచ్చాడు.
కాగా రాజస్తాన్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో విదేశీ ఆటగాళ్ల కొరత ఎక్కువైంది. బట్లర్, మిల్లర్, మోరిస్ మినహా పేరున్న విదేశీ ఆటగాళ్లు లేకపోవడం ఎదురుదెబ్బగా మారింది. గాయాలతో స్టోక్స్, ఆర్చర్‌లు దూరమవడం.. కరోనా దృష్యా బయోబబూలో తాము ఉండలేమంటూ లివింగ్ స్టోన్, ఆండ్రూ టైలు అర్థంతరంగా టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయారు.
చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు
Comments
Please login to add a commentAdd a comment