courtesy : IPL Twitter
ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్ 70 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కృనాల్ 39 పరుగులతో అతనికి సహకరించాడు. రాజస్తాన్ బౌలర్లలో మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1 వికెట్ తీశాడు.
అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. 147/3
39 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. డికాక్ 64, పొలార్డ్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై విజయానికి 18 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉంది.
13 ఓవర్ల ఆట ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. డికాక్ 55, కృనాల్ పాండ్యా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు డికాక్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. డికాక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
9 ఓవర్లలో ముంబై స్కోరు 83/1
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 9 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. డికాక్ 47, సూర్యకుమార్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 49 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ(14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది
రోహిత్ శర్మ ఔట్.. ముంబై 49/1
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ(14) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో మోరిస్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ సకారియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది.
4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు 27/0
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డికాక్ 21 పరుగులతో దూకుడు ప్రదర్శిస్తుండగా.. రోహిత్ 4 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.అంతకముందు రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. స్కోరును పెంచే ప్రయత్నంలో రాజస్తాన్ చివరి ఓవర్లలో సామ్సన్, దూబే వికెట్లను కోల్పోయింది. ఇక రాజస్తాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు.
17 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 145/2
రాజస్తాన్ రాయల్స్ ధాటిగా ఆడుతుంది. 17 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 145పరుగులు చేసింది. సామ్సన్ 41, దూబే 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 54 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
14 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 113/2
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. 14 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సామ్సన్ 23, దూబే 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 91/2
పది ఓవర్ల ఆట ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రాహుల్ చహర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని భారీ సిక్స్ బాదిన జైస్వాల్(32) ఐదో బంతికి కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. సామ్సన్ 16, దూబే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్ .. 71/1
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన బట్లర్(41) రాహుల్ చహర్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 8 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. జైస్వాల్ 23, సామ్సన్ 5 పరుగుతో క్రీజులో ఉన్నారు.
4 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 20/0
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. బట్లర్ 12, జైస్వాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్‌లో నేడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడిన ముంబై రెండింటిలో మాత్రమే గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా ఐదు మ్యాచ్‌లాడి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై.. రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇక ఐపీఎల్‌లో ఇరుజట్ల ముఖాముఖి పోరు పరిశీలిస్తే.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై, రాజస్తాన్‌లు చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్థాన్‌పై ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులు కాగా.. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులుగా ఉంది. ఇక గత సీజన్‌లో ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నీల్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
రాజస్తాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్: సంజూ సామ్సన్(కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, మిల్లర్, రియాన్ పరాగ్, తెవాతియా, మోరిస్, ఉనాద్కట్, సకారియా, ముస్తాఫిజుర్
Comments
Please login to add a commentAdd a comment