
చెన్నై: అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మోరిస్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా అతని కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు అతని కోసం పోటీ పడ్డాయి.
చివరకూ రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ. 12 కోట్ల 50 లక్షల వరకూ వెళ్లగా, పంజాబ్ కింగ్స్ 14 కోట్ల వరకూ బిడ్ వేసింది. కానీ రాజస్తాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కింకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఇక్కడ చదవండి:
మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం
స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు
Comments
Please login to add a commentAdd a comment