IPL Auction 2021
-
ఐపీఎల్: నాలుగు రోజులు లేటైంది..లేకపోతే కోట్లు పలికేవి!
న్యూఢిల్లీ: ఇటీవల చెన్నైలో ఐపీఎల్-2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పోటీలో ఉండాలంటే షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆయా క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుంది. అదే ఐపీఎల్ వేలానికి ముందు ఏ ఆటగాడైనా అద్వితీయ ప్రదర్శన చేస్తే అతనికి కాసుల వర్షం కురిసిన సందర్భాలు ఎన్నో చూశాం. ఈసారి ఐపీఎల్ వేలంలో కూడా అదే రుజువైంది. కాగా, ఇక్కడ ఒక ఆటగాడికి మంచి చాన్స్ మిస్సయ్యిందనే చెప్పాలి. న్యూజిలాండ్‌కు చెందిన ఎడమచేతి వాటం ఆటగాడు డేవాన్ కాన్వే రోజుల వ్యవధిలో ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కోల్పోవడమే కాదు.. కోట్ల రూపాయల్ని సంపాదించే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడనే చెప్పాలి. ఇది విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇందుకు కారణం కాన్వే ఒక సూపర్ నాక్‌తో ఆసీస్‌ను చిత్తుచేయడమే. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కాన్వే చెలరేగి ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, ఇటీవల ముగిసిన వేలంలో ఈ ఆటగాడు అమ్ముడుపోలేదు. అతని కనీస ధర 50 లక్షల రూపాయలు ఉన్నా ఎవరూ తీసుకోలేదు. అయితే ఆసీస్‌తో ఆడిన ఇన్నింగ్స్ ముందే వచ్చుంటే విషయాన్ని అశ్విన్ ప్రస్తావించాడు. ‘నాలుగు రోజులు లేటైంది.. కానీ వాటే నాక్’ అని ట్వీట్ చేశాడు. ఒకవేళ వేలానికి ముందు కాన్వే ఈ తరహా సంచలన ఇన్నింగ్స్ ఏమైనా చేసి ఉంటే కోట్లలో అమ్ముడుపోయేవాడు. ఐదు ట్వంటీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన కివీస్.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్‌క్యాప్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా, ఆపై ఆసీస్ 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కివీస్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కాగా, కివీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు గప్టిల్(0), సీఫెర్ట్(1)లు ఇద్దరూ నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్ విలియమ్సన్(12) కూడా ఆకట్టుకోలేదు. కానీ తన కెరీర్లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కాన్వే రెచ్చిపోయి ఆడాడు. కివీస్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించడమే కాదు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కాన్వే అత్యధిక టీ20 స్కోరు 65గా ఉంది. ఇక్కడ చదవండి: కివీస్ చేతిలో ఆసీస్ చిత్తు Devon Conway is just 4 days late, but what a knock 👏👏👏 #AUSvNZ — Ashwin 🇮🇳 (@ashwinravi99) February 22, 2021 Devon Conway & Darren Bravo remain UNSOLD. @Vivo_India #IPLAuction — IndianPremierLeague (@IPL) February 18, 2021 Imagine not taking Devon Conway in the IPL auction and then seeing that performance #NZvsAUS — Alex Chapman (@AlexChapmanNZ) February 22, 2021 -
‘ఇది నీ విజయం.. నీకు మాత్రమే సొంతం అర్జున్’
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ అండగా నిలిచాడు. ఆట పట్ల అర్జున్‌కు అమిత శ్రద్ధ ఉందని, అతడి ఉత్సుకతను హత్య చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నెపోటిజం పేరిట తనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. కాగా సచిన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బంధుప్రీతి కారణంగానే అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన విధానానికి, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఫర్హాన్ అక్తర్.. ‘‘అర్జున్ టెండుల్కర్ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్నెస్ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. అతడి ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి. సరికొత్త ప్రయాణానికి ముందే తనపై విమర్శల భారం మోపకండి’’ అని ట్విటర్ వేదికగా అర్జున్‌కు మద్దతు ప్రకటించాడు. ఇక సచిన్ కుమార్తె, అర్జున్ అక్క సారా టెండుల్కర్ సైతం.. ‘‘ఈ విజయాన్ని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఇది నీ విజయం’’ అంటూ తమ్ముడికి అండగా నిలిచారు. కాగా ప్రతిభ ఆధారంగానే అర్జున్ను తాము ఎంపిక చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ హెచ్‌కోచ్ మహేల జయవర్దనే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ మ్యాచ్‌లో అర్జున్ టెండుల్కర్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం సహా, మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచాడు. చదవండి: అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే! -
'అంత తక్కువ ధర.. ఐపీఎల్ ఆడకపోవచ్చు'
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ క్లార్క్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో స్టీవ్ స్మిత్‌ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్ స్మిత్ కొనుగోలుపై స్పందించాడు. 'ఇంత తక్కువ ధర పలికిన స్మిత్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఫ్లైట్ ఎక్కే తరుణంలో ఏదో ఒక కారణం చెప్పి స్మిత్ దూరంగా ఉంటాడు. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను వేలంలో ఇప్పుడొచ్చిన ధరతో అవమానంగా ఫీలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తరంలో ఉత్తమ బ్యాట్స్మన్లలో స్మిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్మిత్ 11 వారాల పాటు తన కుటుంబానికి దూరంగా ఉంటాడని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ అతను ఐపీఎల్ ఆడాలని భావించినా మధ్యలోనే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో స్మిత్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అటు స్మిత్ బ్యాట్స్‌మన్‌గా 14 మ్యాచ్‌ల్లో 311 పరుగుల సాధించి విఫలమయ్యాడు, దీంతో రాయల్స్ స్మిత్‌ను రిలీజ్ చేసి అతని స్థానంలో సంజూ శామ్సన్ను కెప్టెన్‌గా ఎంపికచేసింది. చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. దానికే బాధపడాలా! -
‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’
న్యూఢిల్లీ: ‘‘గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. మ్యాచ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతన్ సకారియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరచగా, రాజస్తాన్ రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు భారీ మొత్తం దక్కడంతో అతడి పంట పండినట్లయింది. అయితే అదే సమయంలో తమ్ముడిని కోల్పోయిన బాధ అతడిని వెంటాడుతోంది. ఈ విషయాల గురించి చేతన్ మాట్లాడుతూ... ‘‘మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. ఇక ఇప్పుడు ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్ఆర్ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం పూర్తి వివరాలు చదవండి: ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి! -
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్‌లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్‌కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
వేలంలో అమ్ముడుపోలేదు.. దానికే బాధపడాలా!
చెన్నై: ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. దీంతో రాయ్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై జేసన్ రాయ్ ట్విటర్ ద్వారా స్పందించాడు. 'ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు నేనేం బాధపడట్లదు.. అలా అని అవమానభారంగాను ఫీలవ్వను. నా ప్రదర్శన వారిని మెప్పించలేదు.. అందుకే సెలెక్ట్ కాలేకపోయాను. ఈ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. అయితే వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు నా అభినందనలు. ముఖ్యంగా జేమిసన్, క్రిస్ మోరిస్, మ్యాక్స్‌వెల్ లాంటి వారు అధిక ధరకు అమ్ముడుపోవడం మంచి పరిణామం. నేను ఈ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ కచ్చితంగా చూస్తా' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ 2020 సీజన్లో జేసన్ రాయ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా రాయ్ ఒక్క మ్యాచ్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఢిల్లీ అతని స్థానంలో డేనియల్ సామ్స్‌కు అవకాశం ఇచ్చింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్‌ను రిలీజ్ చేయగా.. వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. మరోవైపు అతని సహచర ఆటగాడు మొయిన్ అలీకి మాత్రం వేలంలో మంచి ధర దక్కింది. ఆర్సీబీ రిలీజ్ చేసిన అలీని సీఎస్కే అనూహ్యంగా రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మిగిలిన విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్ 15 కోట్లు(ఆర్సీబీ), ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్లు(ఆర్సీబీ), జై రిచర్డ్సన్ రూ.14 కోట్లు(పంజాబ్ కింగ్స్) దక్కించుకున్నాయి. చదవండి: 'రోహిత్, పాండ్యా గట్టిగా హగ్ చేసుకున్నారు' -
'రోహిత్, పాండ్యా గట్టిగా హగ్ చేసుకున్నారు'
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 మినీ వేలంలో కర్ణాటకకు చెందిన ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను సీఎస్కే జట్టు రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనీస ధర రూ. 20లక్షలతో వేలం బరిలోకి దిగిన గౌతమ్ ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ఆటగాడిగా పెద్ద మొత్తం దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అతను నెట్ బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. మూడో టెస్టు జరగనున్న అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో జట్టుతో కలిసి హోటల్ రూమ్‌కు చేరుకొని అక్కడి నుంచే ఐపీఎల్ వేలంను వీక్షించాడు. సీఎస్కే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిందని తెలియగానే గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'మూడోటెస్టు కోసం అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్ రూమ్‌లో దిగాము. టీవీ స్విచ్చాన్ చేయగానే నా పేరు కనిపించింది. నాకోసం సీఎస్కే, ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడడంతో క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో సీఎస్కే రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసిందనడంతో ఎగిరి గంతేశాను. అప్పుడే నా రూమ్ డోరు తీసుకొని వచ్చిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు నన్ను గట్టిగా హగ్ చేసుకొని .. కంగ్రాట్స్ మ్యాన్.. బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకు చెప్పడంతో వారికి కన్నీళ్లు ఆగలేదు. నా విషయంలో ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇదంతా నిజమేనా అని ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. ఎందుకంటే వేలంలో నేను పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ చాలాసార్లు పాల్గొన్నా.. కానీ ఇంత పెద్ద ధర వస్తుందని మాత్రం ఊహించలేదు. నాపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేసిన సీఎస్కేకు థ్యాంక్స్. ధోనీ బాయ్ సారధ్యంలో సీఎస్కేకు ఆడనుండడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కె. గౌతమ్ మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 186 పరుగులు, 13 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం' కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు! 20 లక్షలు టూ కోట్లు -
నాన్న.. 'ఉంగ తలా సూపర్'
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు. గురువారం జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో పుజారాను చెన్నై సూపర్‌కింగ్స్ కనీస మద్దతు ధర రూ.50 లక్షలకు దక్కించుకుంది.ఐపీఎల్లో ఆడాలని తనకు ఉంటుందని.. కానీ తనను గతంలో జరిగిన వేలంలో కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని ఆసీస్ పర్యటన అనంతరం పుజారా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోని నాయకత్వంలోని సీఎస్కే అతని బాధను అర్థం చేసుకుందో లేక అతనికున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వేలంలో కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా పుజారాకు వెల్కమ్ చెబుతూ అతని సంతోషాన్ని వీడియో రూపంలో పంచుకుంది. ఆ వీడియోలో పుజారా మహీబాయ్ సారధ్యంలో ఆడేందుకు మళ్లీ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. పుజారా మాట్లాడుతున్న సమయంలో అతని కూతురు 'ఉంగ తలా సుపరూ'( మీ బాస్ సూపర్) అంటూ ధోనినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేలంలో సీఎస్కే కొనుగోలు అనంతరం పుజారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్‌కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎల్లో జెర్సీలో బరిలోకి దిగడంతో పాటు మహీ బాయ్ సారధ్యంలో మళ్లీ ఆడుతుండడం కొత్తగా ఉంది. ఇంతకముందు నేను అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం సమయంలో ధోనినే కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో టెస్టు క్రికెట్లో కీలకమైన 3వ స్థానంలో నన్ను ఆడమని ప్రోత్సహించాడు. అతని కారణంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత ధోని సారధ్యంలోనే సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించడం ఆనందాన్ని కలిగిస్తుంది. మహీ నాయకత్వంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. ఇక ఈసారి ఐపీఎల్లో నా గేర్‌ను మార్చనున్నా.. అది ఎలా ఉంటుందనేది మీరు ఐపీఎల్లో చూస్తారు..అప్పటివరకు వేచి చూడండి.ఇప్పటికైతే నేను సెలెక్ట్ అయినందుకు విజిల్ పోడూ.. ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పుజారా 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్( ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)తరపున చివరిసారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధం: పుజారా కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు! A cute yellovely message from the legend of Che Pu to make your day super! @cheteshwar1 💛💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/eZZ4CXDevA — Chennai Super Kings (@ChennaiIPL) February 19, 2021 -
కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. గురువారం జరిగిన మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో సీఎస్కే వద్దనుకొని వదిలేసిన కేదార్ జాదవ్‌కు రూ.2 కోట్లు, బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌కు రూ.1.5 కోట్లు, జగదీశా సుచిత్‌కు రూ. 30లక్షలు వెచ్చించింది. అయితే వేలంలో ఎస్ఆర్హెచ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా కేదార్ జాదవ్ విషయంలో సన్‌రైజర్స్ అభిమానులు పెట్టిన మీమ్స్ వైరల్ అయ్యాయి.'ఫామ్‌లో లేని ఆటగాడిని తీసుకొని ఏం చేస్తుంది.. అసలు సన్‌రైజర్స్ వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టదు.. సీఎస్కే వద్దనుకుంది.. సన్‌రైజర్స్ కావాలనుకుంటుంది.' అంటూ కామెంట్స్ చేశారు. కాగా కేదార్ జాదవ్ గత సీజన్లో సీఎస్కే తరపున 8 మ్యాచ్‌లాడి 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అందుకే కేదార్ జాదవ్ మొదటిసారి వేలంలోకి వచ్చినప్పుడు కనీసం అతన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చిన జాదవ్‌ను అనూహ్యంగా సన్‌రైజర్స్ రూ. 2కోట్ల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు ఫామ్‌లో ఉన్నకృష్ణప్ప గౌతమ్, కెఎస్ భరత్ లాంటి ఆటగాళ్లవైపు ఎస్ఆర్హెచ్ చూస్తే బాగుండేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2016లో వార్నర్ సారథ్యంలో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ 2018లో విలియమ్సన్ కెప్టెన్సీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఇక గత సీజన్లో వార్నర్ నాయకత్వంలో ప్లేఆఫ్‌కు చేరుకున్నా క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: 'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం' Hyderabadis reaction after SRH bought Kedar Jadhav for 2 Cr!👇👇👇 #IPLAuction2021 #IPLAuction pic.twitter.com/WEsJV52pGj — ʀᴀɢʜᴀᴠᴀ🇮🇳 (@raghava216) February 18, 2021 Kedar Jadhav sold to Sunrisers Hyderabad at 2cr... *Meanwhile, Sunrisers Hyderabad fans to the tram management after getting the out of form batsman at this prize : pic.twitter.com/vxehvrf7Yy — 𝘏𝘪𝘮𝘢𝘯𝘴𝘩𝘶 𝘚𝘦𝘵𝘩 (@tereMaalKaYaar) February 18, 2021 SRH and CSK after that Kedar Jadhav trade:#IPLAuction2021 pic.twitter.com/TCSHh9fA1d — Manya (@CSKian716) February 18, 2021 -
'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం'
చెన్నై వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడుకు చెందిన బ్యాట్స్‌మన్ షారుక్‌ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ ఆటగాడి ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ ఆటగాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడటం విశేషం. అయితే క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే ఆర్యన్ ఖాన్ వైపు తిరిగిన ప్రీతి జింటా.. మేము మీ నాన్నను సొంతం చేసుకున్నాం ఆర్యన్ అంటూ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోపై వినూత్న రీతిలో స్పందించారు. అయ్యో షారుక్‌ఖాన్ ఇప్పుడే పంజాబ్ కింగ్స్‌కు సొంతం అయ్యాడా.. షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వేలం మధ్యలో దొరికిన విరామంలో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్లో మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తో పాటు కేకేఆర్ సహా యజమాని జూహీచావ్లా కూతురు జాహ్నవి మెహతా కూడా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించారు. చదవండి: 'ఇద్దరు ఐకాన్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా' Preity zinta to Aryan khan : we got Shah Rukh 😂😂😂😂 #IPLAuction2021 pic.twitter.com/xdvCddxrz7 — 𝐒𝐡𝐫𝐮 ʘ‿ʘ (@lostshruu) February 18, 2021 -
'ఇద్దరు ఐకాన్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను మరోసారి అదృష్టం వరించింది. గత సీజన్లో దారుణంగా విఫలమైన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన అతన్ని రూ.14.25 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే వేలానికి రెండు రోజుల ముందు ఐపీఎల్లో కోహ్లితో కలిసి ఆడాలని ఉందని మ్యాక్స్‌వెల్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఐపీఎల్ తర్వాత టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లోనూ మ్యాక్సీ అద్బుత ప్రదర్శన చేయడంతో వేలంలో అతనికి బాగా క్రేజ్ వచ్చింది. మ్యాక్సీ సరదాగా అన్న మాటను నిజం చేస్తూ వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం ఆర్సీబీ సీఎస్కేతో తీవ్రంగా పోటీ పడింది. చివరకు భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు స్వాగతం పలుకుతూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.'మా ఆర్మీలోకి స్వాగతం మ్యాక్సీ.. నీకోసం ఎదురుచూస్తున్నాం.. ఐపీఎల్ 2021లో కలుద్దాం' అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనిపై మ్యాక్స్‌వెల్ స్పందించాడు. 'గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ వేలంలో నాకోసం సీఎస్కే, ఆర్సీబీ మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరకు పెద్ద మొత్తం వెచ్చించి ఆర్సీబీ నన్ను దక్కించుకుంది. నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కోహ్లి, డివిలియర్స్ లాంటి ఐకాన్ ఆటగాళ్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. అంతేగాక ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌తో పాటు పాత మిత్రుడు యజ్వేంద్ర చహల్‌ను కలుసుకునేందుకు ఉత్సాహంతో ఉన్నా. ఆర్సీబీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తా. ఈసారి పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటాను కాబట్టి ఆర్సీబీకి మొదటి టైటిల్ అందించేందుకు ప్రయత్నిస్తా' అంటూ తెలిపాడు.కాగా గత సీజన్లో మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ రూ. 10.75 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ పంజాబ్ తరపున 13 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్ 108 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. చదవండి: మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం -
లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే!
ముంబై: అర్జున్ టెండుల్కర్‌లో దాగున్న క్రీడా నైపుణ్యాల ఆధారంగానే అతడిని కొనుగోలు చేశామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని, తను కూడా ఈ లీగ్ ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకునే అవకాశం ఉందన్నాడు. కాగా గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో భాగంగా, అంబానీ కుటుంబానికి చెందిన ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు వేలంలోకి రాగా, అదే ధరకు అతడిని సొంతం చేసుకుంది. కాగా ఈ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిన్నాడు. దీంతో అతడి కుమారుడిని జట్టులోకి తీసుకోవడంపై సహజంగానే విమర్శలు వినిపించాయి. ఇందుకుతోడు రైతు ఆందోళనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన తీరు, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో జయవర్ధనే మాట్లాడుతూ.. ‘‘అర్జున్ తలపై సచిన్ కుమారుడు అనే అతిపెద్ద ట్యాగ్ ఉండటం సహజం. అయితే అదృష్టవశాత్తూ అతడు బ్యాట్స్‌మెన్ కాకుండా, బౌలర్ అయ్యాడు. నిజానికి అర్జున్ బౌలింగ్ తీరు పట్ల సచిన్ ఎంతో గర్వపడతారు. అయితే మేం కేవలం బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నాం. ఇంతవరకు ముంబై తరఫున ఆడిన అర్జున్, ఇప్పుడు ఎంఐకి ఆడబోతున్నాడు. ఆట పట్ల తనకున్న శ్రద్ధ అమోఘం. తనపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమే మా బాధ్యత. మిగతాది తనే చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్‌ఖాన్ సైతం అర్జున్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తాడని, తనొక అంకిత భావం గల యువ ఆటగాడు అని కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. తనకు ఐపీఎల్ ఆడే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు చెబుతూ అర్జున్ మాట్లాడిన వీడియోను ముంబై షేర్ చేసింది. A ballboy at Wankhede before 🏟️ Support bowler last season 💪 First-team player now 💙 It's showtime, Arjun! 😎#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/OgU4MGTPe1 — Mumbai Indians (@mipaltan) February 18, 2021 చదవండి: ఒక్క హైదరాబాద్ ప్లేయర్‌కీ చోటులేదు: అజారుద్దీన్ వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! -
ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మినీ వేలం చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. గురువారం నాటి ఈ ఈవెంట్లో సన్‌రైజర్స్ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది. జట్టు కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఈ విషయం మీద స్పందించిన అజారుద్దీన్.. ‘‘హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో, హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది’’ అని ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ వేలంలో భాగంగా హైదరాబాద్ జట్టు నుంచి కె. భగత్ వర్మను రూ. 20 లక్షలు చెల్లించి చెన్నై సూపర్‌కింగ్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా.. ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.20 లక్షలు), హరిశంకర్ రెడ్డిని (రూ. 20 లక్షలు) చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేశాయి. చదవండి: వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు! ఐపీఎల్ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction @SunRisers @IPL — Mohammed Azharuddin (@azharflicks) February 18, 2021 -
వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు!
చెన్నై: ‘‘కేకేఆర్ కిడ్స్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా వేలంపాటలో పాల్గొన్నారు’’ అంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా ఆనందంలో తేలిపోయారు. తన కూతురు జాహ్నవి, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షారుఖ్, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా గురువారం జరిగిన ఈ క్యాష్ రిచ్‌లీగ్ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు. తద్వారా వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలి(19)గా నిలిచారు. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్ వేలం చరిత్రలో యంగెస్ట్ బిడ్డర్‌గా మా జాహ్నవి మెహతా. చెన్నై పర్యటన, ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఆమె అందిస్తున్నారు’’ అంటూ కేకేఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ విషయంపై స్పందించిన జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో.. ‘‘వీళ్లిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసింది’’ అంటూ కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా జూహీ- జై మెహతా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్ మెహతా. ఇక పర్స్‌లో రూ.10.75 కోట్లతో కేకేఆర్ వేలానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మినీ వేలం-2021లో కేకేఆర్ దక్కించుకున్న ఆటగాళ్లు: ►షకీబ్ అల్ హసన్- రూ. 3.2 కోట్లు ►హర్భజన్ సింగ్- రూ. 2 కోట్లు ►కరుణ్ నాయర్- రూ. 50 లక్షలు ►బెన్ కటింగ్- రూ.75లక్షలు ►వెంకటేస్ అయ్యర్- రూ.20లక్షలు ►పవన్ నేగి- రూ.50లక్షలు చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు So happy to see both the KKR kids, Aryan and Jahnavi at the Auction table .. 🙏😇💜💜💜 @iamsrk @KKRiders pic.twitter.com/Hb2G7ZLqeF — Juhi Chawla (@iam_juhi) February 18, 2021 View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
ఐపీఎల్‌లోకి కడప క్రికెటర్ ఎంట్రీ.. చెన్నై ట్వీట్
సాక్షి, రాయచోటి(కడప): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్ సీజన్లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది. ఇక బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్ వచ్చాడని సీఎస్కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ హరిశంకర్ ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. కాగా హరిశంకర్‌కు ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాయచోటి ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆయన ఆకాక్షించారు. చదవండి: కాసుల వర్షం .. 20 లక్షలు టూ కోట్లు ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ 2021 వేలం: ముంబైకి అర్జున్ టెండూల్కర్ LION ALERT! 🦁 From the land of #Bahubali we rope in Harishankar Reddy! #WhistlePodu #Yellove #SuperAuction 💛🦁 — Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021 -
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ కొత్త రికార్డు
ఐపీఎల్–2021 వేలంలో విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఇప్పటికే నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. బెంగళూరు జట్టు ఇద్దరు ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 29.25 కోట్లు వెచ్చించడం మరో చెప్పుకోదగ్గ అంశం. ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్ల విలువ పలుకగా, న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ కైల్ జేమీసన్ ఏకంగా రూ. 15 కోట్లు అందుకోనున్నాడు. ఆసీస్ పేసర్ జాయ్ రిచర్డ్సన్ను సొంతం చేసుకునేందుకు పంజాబ్ టీమ్ రూ.14 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఈ నలుగురు క్రికెటర్లే రూ. 10 కోట్లకంటే ఎక్కువ ధర పలికారు. చెన్నై: ఎప్పటిలాగే ఐపీఎల్ వేలం అంచనాలకు భిన్నంగా అనూహ్యంగా సాగింది. కచ్చితంగా భారీ ధర పలకగలరని భావించిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోగా, అనామకులుగా కనిపించిన మరికొందరు మంచి విలువతో లీగ్‌లోకి దూసుకొచ్చారు. మరికొందరు ఆటగాళ్ల స్థాయి, సామర్థ్యం, గత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే ఆశించిదానికంటే చాలా ఎక్కువ మొత్తం లభించింది. దాదాపు అన్ని జట్లు వారి వ్యూహాలకు తగినట్లుగా ఆటగాళ్లను కొనసాగించడంతో మిగిలిన ఖాళీల కోసం, ఒక్క ఐపీఎల్ – 2021 కోసం మాత్రమే వేలం జరిగింది. 2015లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డు ధర (రూ. 16 కోట్లు– ఢిల్లీ)ని ఇప్పుడు మోరిస్ బద్దలు చేయడం విశేషం. ఐపీఎల్–2021 వేలం విశేషాలు చూస్తే... ► గత ఏడాది క్రిస్ మోరిస్‌కు బెంగళూరు రూ. 10 కోట్లు చెల్లించింది. వేలానికి ముందు అతడిని విడుదల చేసిన జట్టు ఆశ్చర్యకరంగా తాజా వేలంలో ఒక దశలో మోరిస్‌కు రూ. 9.75 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధం కావడం విశేషం. రూ. 10 కోట్లు దాటిన తర్వాత కూడా ముంబై, పంజాబ్ మోరిస్ కోసం ప్రయత్నించగా, చివరకు రాజస్తాన్ అతడిని తీసుకుంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్... 6.63 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ► 6.8 అడుగుల పొడగరి అయిన కివీస్ పేసర్ కైల్ జేమీసన్ అనూహ్యంగా భారీ ధర పలికాడు. గత ఏడాది భారత్‌పై కివీస్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతని కోసం ఆర్సీబీ మొదటినుంచీ పోటీ పడింది. చివరి క్షణంలో పంజాబ్ తప్పుకోవడంతో జేమీసన్ బెంగళూరు సొంతమయ్యాడు. ► మ్యాక్స్‌వెల్ కోసం చివరి వరకు చెన్నై, బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. రూ.4.40 కోట్లనుంచి ఈ రెండు జట్లూ అతడిని సొంతం చేసుకునేందుకు విలువ పెంచుకుంటూ పోయాయి. చివరకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. గత ఏడాది పంజాబ్ అతనికి రూ. 10.75 కోట్లు చెల్లించగా... ఘోరంగా విఫలమైన తర్వాత కూడా మ్యాక్సీ విలువ పెరగడం విశేషం. గత ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 108 పరుగులే చేయగలిగాడు. అతని స్ట్రైక్‌రేట్ కూడా అతి పేలవంగా 101.88గా మాత్రమే ఉంది. ► బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాయ్ రిచర్డ్సన్ కోసం సాగిన వేలం అందరినీ ఆశ్చర్యపరచింది. 9 అంతర్జాతీయ టి20లే ఆడిన అతని రికార్డు గొప్పగా లేకపోయినా భారీ విలువ పలికాడు. రూ.13.25 కోట్ల వరకు పోటీ పడిన ఆర్సీబీ చివరకు తప్పుకుంది. ► ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేస్ బౌలర్ రిలీ మెరిడిత్ కోసం పంజాబ్ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ► వేలంకు ముందు ఒకే ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉన్న చెన్నై, మొయిన్ అలీని ఎలాగైనా తీసుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌తో పోటీ పడి ఆ జట్టు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను భారీ మొత్తానికి ఎంచుకుంది. ► వరల్డ్ నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కేవలం రూ.1.50 కోట్లకే దక్కించుకుంది. ► రూ. 12.50 కోట్ల విలువతో గత ఐపీఎల్ వరకు రాజస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ కేవలం రూ. 2.20 కోట్లకే సొంతం చేసుకుంది. ► ఆస్ట్రేలియా వన్డే, టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రూ. 1 కోటి కనీస ధరకు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ► గత ఐపీఎల్లో రూ. 8.5 కోట్లు పలికిన విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ను ఎవరూ ఎంచుకోలేదు. ► వేలంలో అందరికంటే చివరగా వచ్చిన పేరు అర్జున్ టెండూల్కర్. కనీస ధర రూ. 20 లక్షలు ముంబై బిడ్డింగ్ చేయగా మరే జట్టూ స్పందించలేదు. దాంతో అతను తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టులోకి వచ్చేశాడు. విహారికి నిరాశ... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారికి ఈ సారి కూడా ఐపీఎల్ అవకాశం దక్కలేదు. రూ. 1 కోటి కనీస విలువతో అతను వేలంలోకి రాగా, ఏ జట్టూ తీసుకోలేదు. భారత సీనియర్ టీమ్ సభ్యులలో లీగ్ అవకాశం దక్కనిది ఒక్క విహారికే! రెండో సారి అతని పేరు వచ్చినప్పుడు కూడా ఫ్రాంచైజీలు స్పందించలేదు. మళ్లీ ఐపీఎల్లో పుజారా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ అవకాశం దక్కింది. అతని కనీస ధర రూ.50 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్‌లోకి రావడం ఇదే తొలిసారి. పుజారాను చెన్నై ఎంపిక చేసుకున్న సమయంలో వేలంలో పాల్గొంటున్న అన్ని ఫ్రాంచైజీల సభ్యులందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించడం విశేషం! ఉమేశ్‌కు రూ. 1 కోటి మాత్రమే... భారత సీనియర్ పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ప్రైస్‌కే చివరకు ఢిల్లీ తీసుకుంది. గౌతమ్‌కు రికార్డు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్‌కు బంగారు అవకాశం లభించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్న చెన్నై ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోటీ పెరిగింది. హైదరాబాద్ రూ. 9 కోట్ల వరకు తీసుకు రాగా, చివరకు అతను చెన్నై చేరడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 37 బంతుల్లో సెంచరీ చేసిన మొహమ్మద్ అజహరుద్దీన్‌ను రూ. 20 లక్షలకే బెంగళూరు ఎంచుకుంది. షారుఖ్ ఖాన్‌ను కొన్న ప్రీతి జింటా! తమిళనాడు జట్టు ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్టర్ షారుఖ్ ఖాన్‌పై అందరి ఆసక్తి కనిపించింది. రూ. 20 లక్షల కనీస ధరనుంచి ఢిల్లీ బిడ్డింగ్ మొదలు పెట్టగా, ఆర్సీబీ దానిని రూ. 5 కోట్ల వరకు తీసుకెళ్లింది. చివరకు అతను రూ.5.25 కోట్లకు పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. ముగ్గురిని మాత్రమే... గురువారం జరిగిన వేలంలో సన్‌రైజర్స్ టీమ్ కేదార్ జాదవ్ (రూ. 2 కోట్లు), ముజీబ్ ఉర్ రహమాన్ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్ (రూ. 30 లక్షలు)లను మాత్రమే తీసుకుంది. టీమ్‌లో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేడు. వేలంలో ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్ భరత్ (రూ.20 లక్షలు – బెంగళూరు), హరిశంకర్ రెడ్డి (రూ. 20 లక్షలు – చెన్నై), హైదరాబాద్ జట్టునుంచి కె. భగత్ వర్మ (రూ. 20 లక్షలు – చెన్నై) ఎంపికయ్యారు. ► కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు – బెంగళూరు) ► మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు – బెంగళూరు) ► జాయ్ రిచర్డ్సన్ (రూ. 14 కోట్లు – పంజాబ్) ► కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు – చెన్నై) ► రిలీ మెరిడిత్ (రూ. 8 కోట్లు – పంజాబ్) ► మొయిన్ అలీ (రూ. 7 కోట్లు – చెన్నై) -
కేఎస్ భరత్ మోగలేదు..
చెన్నై: ఈ ఐపీఎల్ వేలం ముందువరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే ఇందుకు కారణం. భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు స్టాండ్ బైగా జట్టులో కొనసాగిన శ్రీకర్ భరత్.. తాజా ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలను మాత్రం ఆకర్షించలేకపోయాడు. ఈ వేలంలో అతని కనీస ధర 20 లక్షలు ఉండగా, కనీసం రెండు కోట్ల వరకూ వెళతాడని విశ్లేషకులు అంచనా వేశారు. చాలామంది అనామాక క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టిన క్రమంలో కేఎస్ భరత్‌పై విశ్లేషకుల అంచనాను తప్పుబట్టలేం. కానీ అనూహ్యంగా కేఎస్ భరత్ కనీస ధరకే అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. కేఎస్ భరత్‌ను 20 లక్షల రూపాయల కనీస ధరకే ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ బిడ్‌కు వెళ్లగా ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దాంతో 20 లక్షలకే ఆర్సీబీ సొంతమయ్యాడు భరత్. ఇప్పటివరకూ 78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కేఎస్ భరత్.. 4283 పరుగులు చేయగా, లిస్ట్-ఎ క్రికెట్లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 48 మ్యాచ్‌లకు గాను 730 పరుగులు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 సెంచరీలు 23 హాఫ్ సెంచరీలు ఉండగా, లిస్ట్-ఎ క్రికెట్లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు భరత్. ఇక్కడ చదవండి: ఏడేళ్ల తర్వాత పుజారా మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
ఏడేళ్ల తర్వాత పుజారా
చెన్నై: తాను ఐపీఎల్‌కు సిద్ధమని గత కొన్ని సీజన్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్న చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు మరొకసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పుజారాను 50 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా.. చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడాడు. సుమారు ఏడేళ్ల తర్వాత పుజారా మరొకసారి ఐపీఎల్‌కు ఆడటం విశేషం. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. పుజారా కోసం ఎవరూ పోటీ లేకపోవడంతో సీఎస్కే శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. ఈసారి వేలంలో పుజారా పేరు రాగానే సీఎస్కే కనీస ధరకు బిడ్‌కు వెళ్లింది. కాగా, మిగతా ఫ్రాంచైజీలు ఏవీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో కనీస ధరతోనే ఐపీఎల్-14లో అడుగుపెట్టబోతున్నాడు పుజారా. ఇక్కడ చదవండి: మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం
చెన్నై: తాజా ఐపీఎల్ వేలంలో మరో విదేశీ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్‌ను 8 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స కొనుగోలు చేసింది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరిసిన మెరిడిత్ కోసం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ వేలానికి అన్క్యాప్డ్ ఆటగాడిగా వేలంలోకి వచ్చిన మెరిడిత్‌ను కొనుగోలు చేయడానికి పంజాబ్ తీవ్ర ఆసక్తికనబరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 కోట్ల 75 లక్షల వరకూ బిడ్‌కు వెళ్లగా, పంజాబ్ మాత్రం మరో 25లక్షలు వేసి అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ మక్కువ కనబరుస్తున్నారు. ఇప్పటికే మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, జై రిచర్డ్‌సన్‌లు అత్యధిక ధర పలకగా, మొయిన్ అలీ కూడా వేలంలో మంచి ధరకే అమ్ముడుపోయాడు. ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం 20 లక్షలు టూ కోట్లు -
20 లక్షలు టూ కోట్లు
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. తమిళనాడుకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ షారుఖ్‌ఖాన్‌ను 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్‌కింగ్స్ దక్కించుకోగా, కర్ణాటకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్‌ను 9 కోట్ల 25 లక్షల రూపాయలకు సీఎస్‌కు సొంతం చేసుకుంది. వీరిద్దరి కనీస ధర 20 లక్షలు ఉండగా కోట్లలో ధర పలకడం విశేషం. ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన గౌతమ్.. చివరగా గతేడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక షారుఖ్‌ఖాన్‌కు ఇదే తొలి ఐపీఎల్. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్, దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న షారుఖ్‌ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ పోటీ పడగా, చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్ మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం! -
ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్ పంట పండింది. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. రిచర్డ్సన్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీ పడగా పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. రిచర్డ్సన్ కనీస ధర 1 కోటి 50 లక్షల రూపాయలు ఉండగా తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆర్సీబీ పలుసార్లు అతని కోసం బిడ్‌కు వెళ్లగా ఆపై వెనక్కి తగ్గింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. రిచర్డ్సన్కు ఇదే తొలి ఐపీఎల్. ఇదిలా ఉంచితే, ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లు. -
ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్
చెన్నై: అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మోరిస్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా అతని కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకూ రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ. 12 కోట్ల 50 లక్షల వరకూ వెళ్లగా, పంజాబ్ కింగ్స్ 14 కోట్ల వరకూ బిడ్ వేసింది. కానీ రాజస్తాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కింకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక్కడ చదవండి: మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం!
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోసం తీవ్ర పోటీ నడిచింది. పంజాబ్ కింగ్స్- చెన్నై సూపర్ కింగ్స్‌లు మొయిన్ కోసం చివరి వరకూ పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే అతని ధర పెరుగుతూ పోయింది. మొయిన్ అలీ కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా అతన్ని రూ. 7 కోట్లకు సీఎస్కే పంతం పట్టి మరీ దక్కించుకుంది. ఇక బంగ్లాదేశ్ అల్రౌండర్ షకీబుల్ హసన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. షకీబుల్‌ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కేకేఆర్ సొంతం చేసుకుంది. షకీబుల్ కోసం పంజాబ్ కింగ్స్ కూడా పోటీ పడినా కేకేఆర్ చివరి దక్కించుకుంది. ఇక్కడ చదవండి: : స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం
-
మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం
చెన్నై: ఐపీఎల్-14 వ సీజన్‌కు సంబంధించి జరుగుతున్న మినీ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముందుగా ఊహించినట్లుగానే మ్యాక్స్‌వెల్ కోసం తీవ్ర పోటీ జరిగింది. మ్యాక్స్‌వెల్ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం చెల్లించింది ఆర్సీబీ. 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్కే-ఆర్సీబీల మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్లో వదిలేసుకుంది.తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ మరొకసారి జాక్‌పాట్ కొట్టాడు. కాగా, తొలి రౌండ్ వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. అరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, హనుమ విహారి, జేసన్ రాయ్, కేదార్ జాదవ్, ఎవిన్ లూయిస్‌లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. వీరికి సెకండ్ రౌండ్లో ఏమైనా అదృష్టం ఉంటుందో లేదో చూడాలి. ఇక్కడ చదవండి: స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు