
చెన్నై: ఐపీఎల్-2021 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కోసం పెద్దగా పోటీ జరగలేదు. ఈ వేలంలో స్మిత్‌ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా బిడ్‌ను ఆర్సీబీ ఓపెన్ చేసింది. ఆపై ఢిల్లీ మరో రూ. 20 లక్షలు వేసింది. ఆపై మిగతా ఫ్రాంచైజీలు స్మిత్ కోసం బిడ్డింగ్‌కు వెళ్లలేదు.
దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్‌ను తక్కువ మొత్తానికే దక్కించుకోగా, అతనికి జాక్‌పాట్ లభించలేదు. గత సీజన్‌లో స్మిత్ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-13వ సీజన్‌లో 12 కోట్లకు పైగా ధరతో స్మిత్‌ను రాజస్తాన్ తీసుకుంది. కాగా, ఈ సీజన్‌లో స్మిత్‌ను రాజస్తాన్ వదిలేసుకోవడంతో అతను వేలంలోకి రాకతప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment