most expensive players
-
కేఎస్ భరత్ మోగలేదు..
చెన్నై: ఈ ఐపీఎల్ వేలం ముందువరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడమే ఇందుకు కారణం. భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు స్టాండ్ బైగా జట్టులో కొనసాగిన శ్రీకర్ భరత్.. తాజా ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలను మాత్రం ఆకర్షించలేకపోయాడు. ఈ వేలంలో అతని కనీస ధర 20 లక్షలు ఉండగా, కనీసం రెండు కోట్ల వరకూ వెళతాడని విశ్లేషకులు అంచనా వేశారు. చాలామంది అనామాక క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టిన క్రమంలో కేఎస్ భరత్‌పై విశ్లేషకుల అంచనాను తప్పుబట్టలేం. కానీ అనూహ్యంగా కేఎస్ భరత్ కనీస ధరకే అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. కేఎస్ భరత్‌ను 20 లక్షల రూపాయల కనీస ధరకే ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ బిడ్‌కు వెళ్లగా ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దాంతో 20 లక్షలకే ఆర్సీబీ సొంతమయ్యాడు భరత్. ఇప్పటివరకూ 78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కేఎస్ భరత్.. 4283 పరుగులు చేయగా, లిస్ట్-ఎ క్రికెట్లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 48 మ్యాచ్‌లకు గాను 730 పరుగులు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 సెంచరీలు 23 హాఫ్ సెంచరీలు ఉండగా, లిస్ట్-ఎ క్రికెట్లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 క్రికెట్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు భరత్. ఇక్కడ చదవండి: ఏడేళ్ల తర్వాత పుజారా మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
ఏడేళ్ల తర్వాత పుజారా
చెన్నై: తాను ఐపీఎల్‌కు సిద్ధమని గత కొన్ని సీజన్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్న చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు మరొకసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పుజారాను 50 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా.. చివరిసారి 2014లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడాడు. సుమారు ఏడేళ్ల తర్వాత పుజారా మరొకసారి ఐపీఎల్‌కు ఆడటం విశేషం. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. పుజారా కోసం ఎవరూ పోటీ లేకపోవడంతో సీఎస్కే శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. ఈసారి వేలంలో పుజారా పేరు రాగానే సీఎస్కే కనీస ధరకు బిడ్‌కు వెళ్లింది. కాగా, మిగతా ఫ్రాంచైజీలు ఏవీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో కనీస ధరతోనే ఐపీఎల్-14లో అడుగుపెట్టబోతున్నాడు పుజారా. ఇక్కడ చదవండి: మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం -
మరో అన్క్యాప్డ్ ఆటగాడిపై కాసుల వర్షం
చెన్నై: తాజా ఐపీఎల్ వేలంలో మరో విదేశీ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్‌ను 8 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స కొనుగోలు చేసింది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరిసిన మెరిడిత్ కోసం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ వేలానికి అన్క్యాప్డ్ ఆటగాడిగా వేలంలోకి వచ్చిన మెరిడిత్‌ను కొనుగోలు చేయడానికి పంజాబ్ తీవ్ర ఆసక్తికనబరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 కోట్ల 75 లక్షల వరకూ బిడ్‌కు వెళ్లగా, పంజాబ్ మాత్రం మరో 25లక్షలు వేసి అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ మక్కువ కనబరుస్తున్నారు. ఇప్పటికే మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, జై రిచర్డ్‌సన్‌లు అత్యధిక ధర పలకగా, మొయిన్ అలీ కూడా వేలంలో మంచి ధరకే అమ్ముడుపోయాడు. ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం 20 లక్షలు టూ కోట్లు -
20 లక్షలు టూ కోట్లు
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. తమిళనాడుకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ షారుఖ్‌ఖాన్‌ను 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్‌కింగ్స్ దక్కించుకోగా, కర్ణాటకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్‌ను 9 కోట్ల 25 లక్షల రూపాయలకు సీఎస్‌కు సొంతం చేసుకుంది. వీరిద్దరి కనీస ధర 20 లక్షలు ఉండగా కోట్లలో ధర పలకడం విశేషం. ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన గౌతమ్.. చివరగా గతేడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక షారుఖ్‌ఖాన్‌కు ఇదే తొలి ఐపీఎల్. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్, దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న షారుఖ్‌ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ పోటీ పడగా, చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్ మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం! -
ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్ పంట పండింది. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. రిచర్డ్సన్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీ పడగా పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. రిచర్డ్సన్ కనీస ధర 1 కోటి 50 లక్షల రూపాయలు ఉండగా తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఆర్సీబీ పలుసార్లు అతని కోసం బిడ్‌కు వెళ్లగా ఆపై వెనక్కి తగ్గింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. రిచర్డ్సన్కు ఇదే తొలి ఐపీఎల్. ఇదిలా ఉంచితే, ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లు. -
ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్
చెన్నై: అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మోరిస్ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా అతని కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకూ రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ రూ. 12 కోట్ల 50 లక్షల వరకూ వెళ్లగా, పంజాబ్ కింగ్స్ 14 కోట్ల వరకూ బిడ్ వేసింది. కానీ రాజస్తాన్ రాయల్స్ పట్టువదలకుండా మోరిస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కింకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక్కడ చదవండి: మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం!
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోసం తీవ్ర పోటీ నడిచింది. పంజాబ్ కింగ్స్- చెన్నై సూపర్ కింగ్స్‌లు మొయిన్ కోసం చివరి వరకూ పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే అతని ధర పెరుగుతూ పోయింది. మొయిన్ అలీ కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా అతన్ని రూ. 7 కోట్లకు సీఎస్కే పంతం పట్టి మరీ దక్కించుకుంది. ఇక బంగ్లాదేశ్ అల్రౌండర్ షకీబుల్ హసన్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. షకీబుల్‌ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కేకేఆర్ సొంతం చేసుకుంది. షకీబుల్ కోసం పంజాబ్ కింగ్స్ కూడా పోటీ పడినా కేకేఆర్ చివరి దక్కించుకుంది. ఇక్కడ చదవండి: : స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం
-
మ్యాక్స్ ‘వెరీవెల్’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం
చెన్నై: ఐపీఎల్-14 వ సీజన్‌కు సంబంధించి జరుగుతున్న మినీ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ముందుగా ఊహించినట్లుగానే మ్యాక్స్‌వెల్ కోసం తీవ్ర పోటీ జరిగింది. మ్యాక్స్‌వెల్ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం చెల్లించింది ఆర్సీబీ. 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్కే-ఆర్సీబీల మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్లో వదిలేసుకుంది.తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ మరొకసారి జాక్‌పాట్ కొట్టాడు. కాగా, తొలి రౌండ్ వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. అరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, హనుమ విహారి, జేసన్ రాయ్, కేదార్ జాదవ్, ఎవిన్ లూయిస్‌లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. వీరికి సెకండ్ రౌండ్లో ఏమైనా అదృష్టం ఉంటుందో లేదో చూడాలి. ఇక్కడ చదవండి: స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు -
స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు
-
స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్ లేదు
చెన్నై: ఐపీఎల్-2021 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కోసం పెద్దగా పోటీ జరగలేదు. ఈ వేలంలో స్మిత్‌ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా బిడ్‌ను ఆర్సీబీ ఓపెన్ చేసింది. ఆపై ఢిల్లీ మరో రూ. 20 లక్షలు వేసింది. ఆపై మిగతా ఫ్రాంచైజీలు స్మిత్ కోసం బిడ్డింగ్‌కు వెళ్లలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్‌ను తక్కువ మొత్తానికే దక్కించుకోగా, అతనికి జాక్‌పాట్ లభించలేదు. గత సీజన్లో స్మిత్ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-13వ సీజన్లో 12 కోట్లకు పైగా ధరతో స్మిత్‌ను రాజస్తాన్ తీసుకుంది. కాగా, ఈ సీజన్లో స్మిత్‌ను రాజస్తాన్ వదిలేసుకోవడంతో అతను వేలంలోకి రాకతప్పలేదు. -
అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై: క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్- 2021 వేలం) మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 292 మంది ఆటగాళ్లలో అదృష్టం ఎవరిని వరించనుందో తేలనుంది. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మినీ వేలం ప్రారంభం కానుంది. 164 మంది టీమిండియా క్రికెటర్లు , 125 మంది విదేశీ ప్లేయర్లు, ముగ్గురు అసోసియేట్ ఆటగాళ్లలో కేవలం 61 మందిని మాత్రమే ఫ్రాంఛైజీలు ఎంచుకోనున్నాయి. దీంతో క్రీడాభిమానుల్లో ఈ ఈవెంట్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరా అన్న అంశం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో గత సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు, అతడిని దక్కించుకున్న జట్టు, ధర తదితర వివరాలు ఓ సారి పరిశీలిద్దాం. సీజన్ ప్లేయర్ జట్టు ధర 2020 ప్యాట్ కమిన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ .15.5 కోట్లు 2019 జయదేవ్ ఉనద్కత్ రాజస్తాన్ రాయల్స్ రూ.8.4 కోట్లు 2019 వరుణ్ చక్రవర్తి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.8.4 కోట్లు 2018 బెన్‌స్టోక్స్ రాజస్తాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లు 2017 బెన్ స్టోక్స్ రైజింగ్ పుణె సూపర్‌జాయింట్స్ రూ. 14.5 కోట్లు 2016 షేన్ వాట్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 9.5 కోట్లు 2015 యువరాజ్ సింగ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లు 2014 యువరాజ్ సింగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 14 కోట్లు 2013 గ్లెన్ మాక్స్వెల్ ముంబై ఇండియన్స్ 1 మిలియన్ డాలర్లు 2012 రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ 2 మిలియన్ డాలర్లు 2011 గౌతం గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కేకేఆర్ 2.4 మిలియన్ డాలర్లు 2010 కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ 0.75 మిలియన్ డాలర్లు 2010 షేన్ బాండ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 0.75 మిలియన్ డాలర్లు 2009 ఆండ్రూ ఫ్లింటాఫ్ చెన్నై సూపర్ కింగ్స్ 1.55 మిలియన్ డాలర్లు 2009 కెవిన్ పీటర్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 1.55 మిలియన్ డాలర్లు 2008 ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ 1.5 మిలియన్ డాలర్లు చదవండి: శార్దూల్ స్థానంలో సీనియర్ సీమర్ జట్టులోకి -
అత్యంత విలువైన ఆటగాళ్లు వీళ్లే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఈనెల 20న(సోమవారం) వేలం జరగనుంది. వేలానికి 351 మంది ఆటగాళ్లతో తుది జాబితా తయారు చేశారు. ఇందులో 122 మంది అంతర్జాతీయ క్రికెటర్లున్నారు. తొలిసారిగా అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు కొత్త జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇటీవలి కాలంలో విశేషంగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఏకంగా ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వచ్చే ఏడాది తమ ఆటగాళ్లతో అన్ని జట్లకు ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈసారి వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు భారీ మొత్తం చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఐపీఎల్ తాజా వేలం నేపథ్యంలో గతంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1. డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015, ఐపీఎల్ లో రూ. 16 కోట్లుకు దక్కించుకుంది. 2. చెన్నై సూపర్ కింగ్స్ పై రెండేళ్లు నిషేధం పడడంతో ఎంఎస్ ధోనిని దక్కించుకునేందుకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది. 3. రెండుసార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ను తమ వద్దే ఉంచుకునేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 11.05 కోట్లు ముట్టజెప్పింది. 4. బరోడా బ్లాస్టర్ యూసఫ్ పఠాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.6 కోట్లుతో వేలంలో కొనుగోలు చేసింది. 5. రాబిన్ ఊతప్పను పుణే వారియర్స్ 2011 ఐపీఎల్ లో రూ. 9.66 కోట్లతో దక్కించుకుంది. అయితే ధరకు తగినట్టు రాణించలేదు.