చెన్నై: తాజా ఐపీఎల్ వేలంలో మరో విదేశీ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్‌ను 8 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స కొనుగోలు చేసింది. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరిసిన మెరిడిత్ కోసం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ వేలానికి అన్‌క్యాప్‌డ్ ఆటగాడిగా వేలంలోకి వచ్చిన మెరిడిత్‌ను కొనుగోలు చేయడానికి పంజాబ్ తీవ్ర ఆసక్తికనబరిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ 7 కోట్ల 75 లక్షల వరకూ బిడ్‌కు వెళ్లగా, పంజాబ్ మాత్రం మరో 25లక్షలు వేసి అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ మక్కువ కనబరుస్తున్నారు. ఇప్పటికే మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, జై రిచర్డ్‌సన్‌లు అత్యధిక ధర పలకగా, మొయిన్ అలీ కూడా వేలంలో మంచి ధరకే అమ్ముడుపోయాడు. ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రిచర్డ్‌సన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.
ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment