చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. తమిళనాడుకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ షారుఖ్‌ఖాన్‌ను 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్‌కింగ్స్ దక్కించుకోగా, కర్ణాటకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్‌ను 9 కోట్ల 25 లక్షల రూపాయలకు సీఎస్‌కు సొంతం చేసుకుంది. వీరిద్దరి కనీస ధర 20 లక్షలు ఉండగా కోట్లలో ధర పలకడం విశేషం.
ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన గౌతమ్.. చివరగా గతేడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక షారుఖ్‌ఖాన్‌కు ఇదే తొలి ఐపీఎల్. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్, దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న షారుఖ్‌ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ పోటీ పడగా, చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.
ఇక్కడ చదవండి:
ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం
ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్
మొయిన్ అలీ కోసం సీఎస్‌కే పంతం!
Comments
Please login to add a commentAdd a comment