అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 మినీ వేలంలో కర్ణాటకకు చెందిన ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను సీఎస్‌కే జట్టు రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనీస ధర రూ. 20లక్షలతో వేలం బరిలోకి దిగిన గౌతమ్ ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్‌డ్ ఆటగాడిగా పెద్ద మొత్తం దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అతను నెట్ బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. మూడో టెస్టు జరగనున్న అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో జట్టుతో కలిసి హోటల్ రూమ్‌కు చేరుకొని అక్కడి నుంచే ఐపీఎల్ వేలంను వీక్షించాడు. సీఎస్‌కే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిందని తెలియగానే గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
'మూడోటెస్టు కోసం అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్ రూమ్‌లో దిగాము. టీవీ స్విచ్చాన్ చేయగానే నా పేరు కనిపించింది. నాకోసం సీఎస్‌కే, ఆర్‌సీబీలు తీవ్రంగా పోటీ పడడంతో క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో సీఎస్‌కే రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసిందనడంతో ఎగిరి గంతేశాను. అప్పుడే నా రూమ్ డోరు తీసుకొని వచ్చిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు నన్ను గట్టిగా హగ్ చేసుకొని .. కంగ్రాట్స్ మ్యాన్.. బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకు చెప్పడంతో వారికి కన్నీళ్లు ఆగలేదు. నా విషయంలో ఈరోజు సంతోషంగా ఉన్నారు.
ఇదంతా నిజమేనా అని ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. ఎందుకంటే వేలంలో నేను పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ చాలాసార్లు పాల్గొన్నా.. కానీ ఇంత పెద్ద ధర వస్తుందని మాత్రం ఊహించలేదు. నాపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేసిన సీఎస్‌కేకు థ్యాంక్స్. ధోనీ బాయ్ సారధ్యంలో సీఎస్‌కేకు ఆడనుండడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2020 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కె. గౌతమ్ మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 186 పరుగులు, 13 వికెట్లు పడగొట్టాడు.
చదవండి:
'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం'
కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!
20 లక్షలు టూ కోట్లు
Comments
Please login to add a commentAdd a comment