ఐపీఎల్‌ 2021: పొలార్డ్‌ విధ్వంసం.. ముంబై ఘన విజయం | IPL 2021: Mumbai Indians Vs CSK Match Live Updates | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: పొలార్డ్‌ విధ్వంసం.. ముంబై ఘన విజయం

Published Sat, May 1 2021 7:02 PM | Last Updated on Sat, May 1 2021 11:41 PM

IPL 2021: Mumbai Indians Vs CSK Match Live Updates - Sakshi

Photo Courtesy: BCCI

పొలార్డ్‌ విధ్వంసం.. ముంబై ఘన విజయం
సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పొలార్డ్‌ (87 నాటౌట్‌, 34 బంతులు;  6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా రెచ్చిపోయిన పొలార్డ్‌ ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టాడు. రోహిత్‌ 38, డికాక్‌ 35, కృనాల్‌ 32, హార్దిక్‌ 16 పరుగులు చేశారు. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరన్‌ 3 వికెట్లు తీశాడు.

అంతకముందు సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు(72 నాటౌట్‌, 27 బంతులు; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. జడేజా 22 పరుగులతో రాయుడుకు సహకరించాడు. అంతకముందు ఓపెనర్‌ డుస్లెసిస్‌ 50, మొయిన్‌ అలీ 58 పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో పొలార్డ్‌ 2, బుమ్రా 1,బౌల్ట్‌ 1 వికెట్‌ తీశారు. 

పొలార్డ్‌ విధ్వంసం.. ముంబై 153/3
ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ పొలార్డ్‌ సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ సాగుతుంది. ఈ క్రమంలోనే 17 బంతుల్లోనే 3 ఫోర్లు.. 6 సిక్సర్లతో అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పొలార్డ్‌ 54, కృనాల్‌ 17 పరుగులతో ఆడుతున్నారు.

దూకుడుగా ఆడుతున్న పొలార్డ్‌.. 130/3
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. పొలార్డ్‌ 35 పరుగులు(5 సిక్సర్లు) దూకుడు కనబరుస్తుండగా.. కృనాల్‌ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.

మూడు వికెట్లు కోల్పోయిన ముంబై.. 81/3
ముంబై ఇండియన్స్‌ వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్‌ శార్ధుల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో 3 పరుగులు చేసిన సూర్యకుమార్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 38 పరుగులు చేసిన డికాక్‌ కూడా మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో ముంబై స్కోరు 81/3 గా ఉంది

ధీటుగా బదులిస్తున్న ముంబై.. 7 ఓవర్లలో 68/0
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ధీటుగా బదులిస్తుంది. 7 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 34, డికాక్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ స్కోరు 30/0
219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 12, డికాక్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

రాయుడు సిక్సర్ల వర్షం.. ముంబై టార్గెట్‌ 219
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు(72 నాటౌట్‌, 27 బంతులు; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. జడేజా 22 పరుగులతో రాయుడుకు సహకరించాడు. అంతకముందు ఓపెనర్‌ డుస్లెసిస్‌ 50, మొయిన్‌ అలీ 58 పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో పొలార్డ్‌ 2, బుమ్రా 1,బౌల్ట్‌ 1 వికెట్‌ తీశారు.

15 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 136/4
15 ఓవర్ల ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రాయుడు 15, జడేజా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పొలార్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో వరుస బంతుల్లో డుప్లెసిస్‌, రైనాలు పెవిలియన్‌ చేరారు.

పొలార్డ్‌ దెబ్బ.. వరుస బంతుల్లో రెండు వికెట్లు
సీఎస్‌కే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. పొలార్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో వరుస బంతుల్లో డుప్లెసిస్‌(50), రైనా(2) క్యాచ్‌ అవుట్‌లుగా వెనుదిరిగారు. ప్రస్తుతం సీఎస్‌కే 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

మొయిన్‌ అలీ ఔట్‌.. సీఎస్‌కే 112/2
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 58 పరుగులు చేసిన అలీ బుమ్రా బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 48, రైనా 0 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

ధాటిగా ఆడుతున్న సీఎస్‌కే..10 ఓవర్లలో 95/1
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ధాటిగా ఆడుతుంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది. రుతురాజ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్‌ అలీ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అలీ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. డుస్లెసిస్‌ 28 పరుగులతో సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 91 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

4 ఓవర్లలో సీఎస్‌కే  స్కోరు 33/1
తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ రుతురాజ్‌ వికెట్‌ను కోల్పోయిన సీఎస్‌కే 4 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 33 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 13, మొయిన్‌ అలీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సీఎస్‌కేకు ఆదిలోనే  షాక్‌
చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతికి సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ ఔటయ్యాడు.  ఫోర్‌ కొట్టి ఊపుమీద కనిపించిన రుతురాజ్‌.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని హార్దిక్‌ చేతుల్లో పడటంతో రుతురాజ్‌ ఔటయ్యాడు.  దాంతో  సీఎస్‌కే 4 పరుగులకే తొలి వికెట్‌ను నష్టపోయింది.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే తలపడనున్నాయి. ఒకరేమో ఐదుసార్లు చాంపియన్‌.. మరొకరు మూడుసార్లు చాంపియన్‌... మరి ఇద్దరిలో విజేతగా నిలిచేది ఎవరో చూడాలి. ఇక టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే ఈ సీజన్‌లో చూసుకుంటే మాత్రం సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఆరు మ్యాచ్‌లాడిన సీఎస్‌కే తొలి మ్యాచ్‌లో ఓటమి మినహా ఐదు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడి మూడు విజయాలు.. మూడు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. రాజస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ట్రాక్‌ ఎక్కినట్లే కనిపిస్తుంది.

ఇక ముఖాముఖి పోరును పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌కు సీఎస్‌కేపై అత్యధిక స్కోరు 202 కాగా.. అత్యల్ప స్కోరు 141గా ఉంది. ఇక సీఎస్‌కేకు ముంబై ఇండియన్స్‌పై అత్యధిక స్కోరు 208 కాగా.. అత్యల్ప స్కోరు 79గా ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై, సీఎస్‌కే మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా .. ఇరు జట్లు చెరొక విజయాన్ని నమోదు చేశాయి.

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, సూర్యకుమార్ యాదవ్, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్‌ నీషమ్‌, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

సీఎస్‌కే: డుప్లెసిస్‌, రుతురాజ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోని, రవీంద్ర జడేజా, లుంగీ ఎన్గిడి, సామ్‌ కర్రన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement