Krishnappa Gowtham
-
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా -
నా డార్లింగ్‌కే అంకితమన్న గౌతమ్.. తొడగొట్టిన గబ్బర్.. బెయిర్‌స్టో రెడీ!
IPL Today Trending Videos: ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ అదరగొట్టింది. సమిష్టి కృషితో పంత్ సేనపై రాహుల్ బృందం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక చాలా రోజుల తర్వాత లక్నో తుది జట్టులోకి వచ్చిన కర్ణాటక బౌలింగ్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కీలక సమయంలో వికెట్ తీసి సత్తా చాటాడు. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాను అవుట్ చేసి లక్నో గెలుపులో తానూ భాగమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ ఒకటి, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి రెండు వికెట్లు కూల్చాడు. తద్వారా ఢిల్లీని తక్కువ స్కోరుకే వీరు కట్టడి చేయగా.. క్వింటన్ డికాక్ మెరుపులతో లక్నో విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం గౌతమ్ మాట్లాడుతూ.. గురువారం నాటి మ్యాచ్‌లో తన ప్రదర్శనను తన కుటుంబానికి.. ముఖ్యంగా తన చిన్నారి పాపాయి, ముద్దుల కూతురు నితారాకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. Crucial breakthroughs 💪 Energetic celebrations 🔥 K Gowtham's special dedication 😊@gowthamyadav88 & @bishnoi0056 chat after @LucknowIPL complete a hat-trick of wins in the #TATAIPL 2022. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #LSGvDC https://t.co/zaEryYY18b pic.twitter.com/o3PgPgMpDk — IndianPremierLeague (@IPL) April 8, 2022 ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనితో పాటు ఐపీఎల్ ప్రేమికుల మది దోచుకుంటున్న మరికొన్ని వీడియోలు మీకోసం.. ఢిల్లీపై విజయంతో లక్నో ఖాతాలో హ్యాట్రిక్ Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 లక్నో తరఫున డికాక్ సూపర్ ఇన్నింగ్స్(52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు) Our best performer from the second innings is Quinton de Kock for his match-winning knock of 80. A look at his batting summary here 👇 #TATAIPL pic.twitter.com/YPUfgRLwxH — IndianPremierLeague (@IPL) April 7, 2022 పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 8న తలపడనున్న గుజరాత్ టైటాన్స్. తమ యువ ఆటగాడు యశ్ దయాల్ ప్రయాణానికి సంబంధించిన వీడియో పంచుకున్న గుజరాత్. Ep 2: The journey from a promising youngster to a #TitanYoungStar… 🎬 We wish you all the ‘Yash’ in life! 🙌#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/X3yFF89C5y — Gujarat Titans (@gujarat_titans) April 8, 2022 టైటాన్స్‌తో పోరుకు సై అంటున్న పంజాబ్ ప్లేయర్ గబ్బర్. తొడగొట్టి మరీ సవాల్ విసురుతున్న శిఖర్ ధావన్ 𝘼 𝙂𝙖𝙗𝙗𝙖𝙧 𝙨𝙩𝙧𝙞𝙙𝙚 𝙞𝙣𝙩𝙤 #𝙋𝘽𝙆𝙎𝙫𝙂𝙏! 😎#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ @SDhawan25 pic.twitter.com/w8pvbFWz1F — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2022 విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్న పంజాబ్ ఆటగాడు బెయిర్‌స్టో 𝐑𝐞𝐚𝐝𝐲 • 𝐒𝐞𝐭 • 𝐑𝐨𝐚𝐫 • 🦁 Bair𝙨𝙩𝙤𝙧𝙢 loading… 🌪#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ #PBKSvGT @jbairstow21 pic.twitter.com/VoW5CT9Muw — Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2022 దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, పంజాబ్ బౌలర్ కగిసో రబడ.. రైజ్ ఆఫ్ రబడ.. యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే వీడియో The Rise of Rabada! 🔥 Watch Kagiso Rabada talk about soaring through the ranks of South African youth cricket, rising to the🔝 in international cricket and what he aims to achieve at #SaddaPunjab! 💪🏻#IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ @KagisoRabada25 pic.twitter.com/ujZEaMVMda — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2022 -
IPL 2022: మొన్నటి దాకా బెంచ్‌కే పరిమితం.. ఇప్పుడేమో!
IPL 2022 LSG Vs DC: కృష్ణప్ప గౌతమ్.. ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రికార్డు ధర 9.25 కోట్లకు అతడిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడికి నామమాత్రపు ధర దక్కింది. కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంఛైజీలు ఈ కర్ణాటక బౌలింగ్ ఆల్‌రౌండర్‌పై ఆసక్తి చూపగా... కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ 90 లక్షలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. కానీ.. లక్నో జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో గౌతమ్‌కు ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ టీమిండియా ఆటగాడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు మనీశ్ పాండే స్థానంలో గౌతమ్ జట్టులోకి వచ్చాడు. లక్నోకు కొరకరాని కొయ్యగా మారి బౌండరీలతో విరుచుకుపడ్డ ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(34 బంతుల్లో 61 పరుగులు- 9 ఫోర్లు, రెండు సిక్సర్లు)ను పెవిలియన్‌కు పంపి బ్రేక్ ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న గౌతమ్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్ కూల్చి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గౌతమ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ మాట్లాడుతూ.. గౌతమ్ జట్టులోకి రావడం తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించాడు. అతడు బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించగలడని కొనియాడాడు. ఆ 4 ఓవర్లు కీలకం.. స్పోర్ట్స్ కీడా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తనలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల నైపుణ్యం దాగుంది. ఈ మ్యాచ్‌లో తను వేసిన నాలుగు ఓవర్లు మాకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి. ముఖ్యంగా కీలకమైన వికెట్ తీసి, భారీ భాగస్వామ్యాన్ని అతడు బ్రేక్ చేయడం కలిసి వచ్చింది. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎలా ముగించామన్నదే పరిగణనలోకి వస్తుంది. ఎవరి బౌలింగ్‌ను ఎవరు ఎప్పుడు చీల్చిచెండాడుతారో తెలియదు. కాబట్టి సంయమనంగా ఉంటూ ఛాన్స్ వచ్చినపుడు వికెట్ పడగొట్టడమే తెలివైన పని. నిజానికి నేను మొదటి ఓవర్ వేసిన తర్వాత బంతి ఎక్కువగా స్వింగ్ కావడం లేదని మా వాళ్లకు చెప్పాను. పవర్ ప్లేలో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావించాము. మాకు మంచి స్పిన్నర్లు ఉన్నారు. రవి బిష్ణోయి అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. గౌతమ్ మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. మా ప్రణాళికలను మైదానంలో చక్కగా అమలు చేశాం. ఇది సమిష్టి విజయం’’ అని చెప్పుకొచ్చాడు. లక్నో సూపర్‌జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ స్కోర్లు: ఢిల్లీ- 149/3 (20) లక్నో- 155/4 (19.4) ఆరు వికెట్ల తేడాతో లక్నో విజయం చదవండి: IPL 2022: పంత్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో? Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 -
IPL 2022 Auction: ఏడాదిలో అంతా తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడేమో!
ఐపీఎల్లో అంకెలు.. అంచనాలు తారుమారు కావడం మామూలే. టీమిండియా ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. ఒక్క ఏడాదిలోనే అతడి విలువ ఆకాశం నుంచి అట్టడుగుకు పడిపోయింది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గతేడాది గౌతమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి మెగా వేలంలో మాత్రం అతడికి నామమాత్రపు ధర దక్కింది. అయితే ఇది కనీస ధర కంటే ఎక్కువ విలువే కావడం గమనార్హం. కర్ణాటక ఆల్‌రౌండర్ గౌతమ్‌ను గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రికార్డు ధర 9.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. అయితే, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2022 నేపథ్యంలో సీఎస్కే గౌతమ్‌ను వదిలేసింది. దీంతో అతడు 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. రెండో రోజు వేలంలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ అతడిపై ఆసక్తి కనబరచగా... లక్నో 90 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. కాగా గతంలో 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలకు అమ్ముడుపోవడంపై కృష్ణప్ప గౌతమ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘అప్పుడు లక్కీగా భారీ ధర. తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం... ఇప్పుడు కూడా పర్లేదు. నీకు ఇది మంచి ధరే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌తో కృష్ణప్ప అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ వేలంలో అతడు 2017లో 2 కోట్లు, 2018లో 6.20 కోట్లు, 2021లో 9.25 కోట్లు పలికాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి గురించి ప్రశ్న.. అసలేం మాట్లాడుతున్నావు అన్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..!
IPL 2022 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్.. త్వరలో జరగనున్న 15వ ఐపీఎల్ మెగా వేలంలోనూ భారీ ధరను ఆశిస్తున్నాడు. గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను ఏకంగా రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్..ఈ ఏడాది ఆటగాళ్ల రిటెన్షన్‌లో భాగంగా అతన్ని వదులుకుంది. గత సీజన్ వేలంలో కృష్ణప్ప కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లు తీవ్రంగా పోటీపడినప్పటికీ చివరికి సీఎస్కే అతన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అన్ని కోట్లు వెచ్చించి, ప్రత్యర్ధి జట్లతో పోటీపడి మరీ చేజిక్కించుకున్న ఆటగాడిని సీఎస్కే ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అయినప్పటికీ, కృష్ణప్పకు లక్కీగా శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో అతను ఓ వికెట్, 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో తదనంతర పరిణామాల్లో అతను కనుమరుగయ్యాడు. తాజాగా ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడడటంతో అతని పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కుడి చేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్.. తన ఐపీఎల్ కెరీర్లో 24 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు, 186 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్లలో కృష్ణప్ప గౌతమ్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్‌పై 16 కోట్లు వెచ్చించగా, కివీస్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్‌పై ఆర్సీబీ 15 కోట్లు, జే రిచర్డ్సన్పై పంజాబ్ 14 కోట్లు, గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆర్సీబీ 14.2 కోట్లు వెచ్చించాయి. వీరి తర్వాత అత్యంత భారీ ధర పలికిన అనామక క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ కావడం విశేషం. చదవండి: IND VS WI 2nd ODI: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
T20 World Cup: అయ్యో అయ్యర్.. వాళ్లందరినీ వెనక్కి పిలిపించారు!
Team India send back four net bowlers: టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి నెట్ బౌలర్లుగా ఎంపికైన నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ వెనక్కి పిలిపించినట్లు సమాచారం. కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్, క్రిష్ణప్ప గౌతం ఇప్పటికే యూఏఈని వీడి భారత్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీరంతా.. నవంబరు 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రమంలో కావాల్సినంత ప్రాక్టీసు ఉండాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ వీరిని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు... ‘‘అవును.. ఒక్కసారి అసలు టోర్నీ(టీ20) ప్రారంభమైన తర్వాత పెద్దగా నెట్ సెషన్లు ఉండవు. కాబట్టి ఈ ఆటగాళ్లందరూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతించేందుకు వీలుగా జాతీయ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సినంత ప్రాక్టీసు లభిస్తుంది’’ అని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించినట్లు క్రికెట్.కామ్ పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్, ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సహా కరణ్, షాబాజ్, వెంకటేశ్ అయ్యర్, గౌతంను నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అత్యవసర సమయంలో వీరు జట్టుతో చేరేందుకు వీలుగా ఈ మేరకు సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ సూపర్-12 రౌండ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబరు 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్‌తో కోహ్లి సేన వరల్డ్‌కప్ టోర్నీ ప్రయాణం ఆరంభించనుంది. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది? T20 World Cup 2021: నమీబియా సంచలనం.. శ్రీలంక హ్యాట్రిక్.. సూపర్-12కు చేరిన జట్లు ఇవే -
తండ్రి కాబోతున్న సీఎస్కే ప్లేయర్.. ఎమోషనల్ పోస్టుతో..
Krishnappa Gowtham: టీమిండియా క్రికెటర్ క్రిష్ణప్ప గౌతం తండ్రికాబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన అతడు.. చిన్నారి రాక కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ఆవిష్కృతమయ్యే అద్భుతం కోసం ఎదురుచూస్తున్నాం. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జనవరి, 2022లో బుజ్జాయి రాక.. సరికొత్త ఆరంభాలు’’ అని ఈ కర్ణాటక ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న భార్య అర్చనా సుందర్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కాగా శ్రీలంకతో ఈ ఏడాది జూలైలో జరిగిన వన్డే సిరీస్‌తో గౌతం భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ 2021 ఐపీఎల్- వేలంలో 9 కోట్ల 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు అతడు చెన్నై తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెకండ్ ఫేజ్ సెప్టెంబరు 19న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. చదవండి: IPL 2021 Second Phase: ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం View this post on Instagram A post shared by Krishnappa Gowtham (@gowthamyadav1) -
చహల్, గౌతమ్‌లకు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్పిన్నర్ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు శుక్రవారం కోవిడ్–19 పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దీపక్ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్‌లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్ పాజిటివ్‌గా తేలారు. మిగిలిన టీమ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆ ముగ్గురి పరిస్థితేంటి? పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్‌గా తేలితే భారత్‌కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్‌లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. -
చహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్
-
IND Vs SL: చహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్
కొలంబో: టీ20 సిరీస్ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు మరోషాక్ తగిలింది. తాజాగా భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, కె. గౌతమ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్, గౌతమ్‌లు క్వారంటైన్లో ఉన్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్‌కు ముందు కృనాల్ పాండ్యా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కృనాల్‌తో క్లోజ్‌గా ఉన్న 8 మందిని క్వారంటైన్‌కు తరలించగా.. అందులో చహల్, గౌతమ్‌లు కూడా ఉన్నారు. తాజాగా వీరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్కించుకున్న భారత్ టీ20 సిరీస్‌లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మొదటి టీ20 మ్యాచ్ నెగ్గిన టీమిండియా తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల అనంతరం నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత అదే గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సీనియర్ జట్టు ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. -
ధోని మళ్లీ గెలిపించగలడా!
మూడుసార్లు చాంపియన్... ఐదుసార్లు రన్నరప్... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్లో టాప్–4లో స్థానం... ఐపీఎల్లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రికార్డు ఎంతో ప్రత్యేకం. నిషేధం తర్వాత తిరిగొచ్చి ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా కూడా చెన్నై నిలవగలిగింది. కానీ 2020లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత ఒక్కసారిగా అభిమానులకు కూడా నీరసం వచ్చేసింది. ఒక్క ఆటగాడు కూడా తగినంతగా రాణించకపోవడంతో ‘సీనియర్ సిటిజన్ టీమ్’ అంటూ వినిపించే వ్యంగ్యాస్త్రాలు మళ్లీ మొదలయ్యాయి. ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ఈసారి కూడా దాదాపు అదే ‘కోర్ గ్రూప్’తో సీఎస్కే బరిలోకి దిగుతుండటం వల్ల కావచ్చు అంచనాలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే సూపర్ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది. బలమైన నాయకత్వంలో వెటరన్ ఆటగాళ్లతో నిండిన చెన్నై టీమ్ ఎలాంటి ఫలితాలు సాధించగలదనేది ఆసక్తికరం. కొత్తగా వచ్చినవారు... ఐపీఎల్ వేలానికి ముందు చెన్నైకి ఒక విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ అవసరం కనిపించింది. లీగ్‌లో ఆ జట్టు భారీ మొత్తం వెచ్చించిన ఇద్దరు టాప్ ప్లేయర్లు ఆఫ్ స్పిన్ వేస్తూ ధాటిగా బ్యాటింగ్ చేయగలవారే కావడం విశేషం. వేలంలో సీఎస్కే కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు), మొయిన్ అలీ (రూ. 7 కోట్లు)లను తీసుకుంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా (రూ. 50 లక్షలు) ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా... నెమ్మదైన చెపాక్ స్టేడియం పిచ్‌లపై అతని శైలి ఆటగాడు ఒకరు జట్టులో ఉంటే మంచిదని భావించి ఉండవచ్చు. ఈ ముగ్గురు కాకుండా కనీస ధర రూ. 20 లక్షల చొప్పున ముగ్గురు వర్ధమాన క్రికెటర్లను ఎంపిక చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భగత్ వర్మ, ఆంధ్ర ఆటగాడు హరిశంకర్ రెడ్డిలతో పాటు సి.హరి నిశాంత్ టీమ్‌లోకి వచ్చారు. విదేశీ టాపార్డర్ బ్యాట్స్‌మన్ లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా డుప్లెసిస్ విఫలమైతే మరో ప్రత్యామ్నాయాన్ని అందుబాటులో ఉంచుకుంటే బాగుండేది. తుది జట్టు అంచనా/ఫామ్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపర్చిన తర్వాత కూడా చెన్నై మరోసారి దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉండటంతో మెరుగైన ఫలితాలపై మళ్లీ సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే నలుగురు విదేశీ ఆటగాళ్లుగా తొలి ప్రాధాన్యత డు ప్లెసిస్, స్యామ్ కరన్, అలీ, తాహిర్‌లకు దక్కవచ్చు. సీజన్ మధ్యలో బ్రేవో, సాన్‌ట్నర్‌లకు అవకాశం దక్కవచ్చు. అలీ, కరన్‌లకు ఇటీవలే భారత గడ్డపై ఆడిన అనుభవం ఉండటం జట్టుకు మేలు చేసే అంశం. అయితే 37 ఏళ్ల డు ప్లెసిస్ ఇటీవల పేలవంగా ఆడుతున్న నేపథ్యంలో ఏమాత్రం ప్రభావం చూపించగలడో చూడాలి. రైనా పునరాగమనం చేయడం మంచిదే అయినా... 2019 ఐపీఎల్ నుంచి రాబోయే ఐపీఎల్ వరకు దాదాపు రెండేళ్ల మధ్య కాలంలో అతను కేవలం ఐదంటే ఐదు టి20 మ్యాచ్‌లే ఆడి మూడింట్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కేవలం నెట్స్ సాధనతో అతను ఏమాత్రం సత్తా చాటుతాడనేది సందేహమే! గాయం నుంచి కోలుకున్న జడేజా నేరుగా లీగ్ బరిలోకి దిగుతుండగా... టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఒక్కడే. పుజారాకు ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం వస్తుందో చూడాలి. గత సీజన్లో రాయుడు పెద్దగా ప్రభావం చూపలేదు. ఉతప్ప, రుతురాజ్లపై బ్యాటింగ్ భారం ఉండగా ... ఆల్‌రౌండర్‌గా గౌతమ్ ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో దీపక్ చహర్ కీలకం కానున్నా డు. ఈసారి కూడా మ్యాచ్‌లు చెన్నైలో లేకపోవడం మరో ప్రతికూలత. అయితే అన్నింటికి మించి ఎప్పటిలాగే ధోని బ్యాటింగ్, అతని నాయకత్వంపైనే అందరి దృష్టీ ఉంది. ఆటగాడిగా ఇది అతనికి ఆఖరి సీజన్ కావచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా టీమ్‌ను నడిపిస్తాడనేది చూడాలి. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: ధోని (కెప్టెన్), రైనా, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, రాయుడు, పుజారా, కరణ్ శర్మ, రాబిన్ ఉతప్ప, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, భగత్ వర్మ, హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్, జగదీశన్, కేఎస్ ఆసిఫ్, సాయి కిషోర్. విదేశీ ఆటగాళ్లు: తాహిర్, మొయిన్ అలీ, డు ప్లెసిస్, బ్రేవో, ఇన్‌గిడి, సాన్‌ట్నర్, స్యామ్ కరన్. సహాయక సిబ్బంది: ఫ్లెమింగ్ (హెడ్ కోచ్), హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎల్.బాలాజీ (బౌలింగ్ కోచ్), రాజీవ్ (ఫీల్డింగ్ కోచ్). అత్యుత్తమ ప్రదర్శన 2010, 2011, 2018లో చాంపియన్ 2020లో ప్రదర్శన: చెన్నై ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ప్రదర్శన 2020లో నమోదు చేసింది. 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచిన టీమ్, ఒక దశలో ఆఖరి స్థానంలో నిలిచేలా కనిపించినా... స్వల్ప రన్‌రేట్ తేడాతో రాజస్తాన్‌ను వెనక్కి నెట్టి చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆడిన 11 సీజన్లలో ఆ జట్టు టాప్–4లో నిలబడకపోవడం ఇదే మొదటిసారి. లీగ్ ఆరంభానికి ముందే వ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ తప్పుకున్నా వారి స్థానంలో మరెవరినీ తీసుకోకపోవడం... రెండో అర్ధభాగానికి వచ్చేసరికి సత్తువ సన్నగిల్లడంతో వరుస పరాజయాలు తప్పలేదు. మిడిలార్డర్లో ధోని, జాదవ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... చెన్నై పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టులోకి తీసుకున్న స్పిన్నర్లు యూఏఈకి వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సాక్షి క్రీడావిభాగం: -
అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం మా కెప్టెన్‌కు బాగా తెలుసు
ముంబై: ఏ బౌలర్ నుంచి ఎలాంటి ప్రదర్శన రాబట్టాలనేది ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పేర్కొన్నాడు. ఇప్పటికే చెన్నై టీమ్‌తో చేరిన గౌతమ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఈ సందర్భంగా గౌతమ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడటాన్ని బౌలర్లు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అతను బౌలర్ల బలాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. అలాగే బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ఎలాగో ధోనీకి బాగా తెలుసు’’ అని వెల్లడించాడు. కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. సీఎస్కే తన తొలి మ్యాచ్‌ని ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో కృష్ణప్ప గౌతమ్‌ని రూ.9.25 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారి చెన్నైకి ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ ధోని కెప్టెన్సీలో ఆడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్లో ఏ జట్టుకు హోం అడ్వాంటేజ్ లేకపోవడంతో.. ఆయా జట్లు తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాల్సి ఉంటుంది. చదవండి: ఐపీఎల్ 2021: ఆర్సీబీ ఈసారైనా.. పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా! -
'రోహిత్, పాండ్యా గట్టిగా హగ్ చేసుకున్నారు'
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 మినీ వేలంలో కర్ణాటకకు చెందిన ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను సీఎస్కే జట్టు రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనీస ధర రూ. 20లక్షలతో వేలం బరిలోకి దిగిన గౌతమ్ ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ఆటగాడిగా పెద్ద మొత్తం దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అతను నెట్ బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. మూడో టెస్టు జరగనున్న అహ్మదాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో జట్టుతో కలిసి హోటల్ రూమ్‌కు చేరుకొని అక్కడి నుంచే ఐపీఎల్ వేలంను వీక్షించాడు. సీఎస్కే పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిందని తెలియగానే గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'మూడోటెస్టు కోసం అహ్మదాబాద్‌కు వచ్చి హోటల్ రూమ్‌లో దిగాము. టీవీ స్విచ్చాన్ చేయగానే నా పేరు కనిపించింది. నాకోసం సీఎస్కే, ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడడంతో క్షణక్షణానికి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ దశలో సీఎస్కే రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసిందనడంతో ఎగిరి గంతేశాను. అప్పుడే నా రూమ్ డోరు తీసుకొని వచ్చిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు నన్ను గట్టిగా హగ్ చేసుకొని .. కంగ్రాట్స్ మ్యాన్.. బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకు చెప్పడంతో వారికి కన్నీళ్లు ఆగలేదు. నా విషయంలో ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇదంతా నిజమేనా అని ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. ఎందుకంటే వేలంలో నేను పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ చాలాసార్లు పాల్గొన్నా.. కానీ ఇంత పెద్ద ధర వస్తుందని మాత్రం ఊహించలేదు. నాపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేసిన సీఎస్కేకు థ్యాంక్స్. ధోనీ బాయ్ సారధ్యంలో సీఎస్కేకు ఆడనుండడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కె. గౌతమ్ మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 186 పరుగులు, 13 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం' కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు! 20 లక్షలు టూ కోట్లు -
20 లక్షలు టూ కోట్లు
చెన్నై: ఈ ఐపీఎల్ వేలంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. తమిళనాడుకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ షారుఖ్‌ఖాన్‌ను 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్‌కింగ్స్ దక్కించుకోగా, కర్ణాటకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్‌ను 9 కోట్ల 25 లక్షల రూపాయలకు సీఎస్‌కు సొంతం చేసుకుంది. వీరిద్దరి కనీస ధర 20 లక్షలు ఉండగా కోట్లలో ధర పలకడం విశేషం. ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన గౌతమ్.. చివరగా గతేడాది ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక షారుఖ్‌ఖాన్‌కు ఇదే తొలి ఐపీఎల్. కేవలం ఫస్ట్‌క్లాస్ క్రికెట్, దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న షారుఖ్‌ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ పోటీ పడగా, చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ చదవండి: ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు బ్రేక్ మొయిన్ అలీ కోసం సీఎస్కే పంతం! -
4,6,4,6,6... గౌతమ్ షో
-
4,6,4,6,6... గౌతమ్ షో
రాంచీ: దేవధార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ దుమ్మురేపాడు. విజృంభించి ఆడి భారత్ ‘బి’ జట్టును విజేతగా నిలపడంతో కీలకపాత్ర పోషించాడు. భారత్ ‘సి’ జట్టుతో సోమవారం జరిగిన తుదిపోరులో గౌతమ్ చెలరేగిపోయాడు. 10 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి సత్తా చాటాడు. వరుస బంతుల్లో (4,6,4,2,6,6,0,4,2,1) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికీ ‘బి’టీమ్ 48 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది. వచ్చి రావడంతో గౌతమ్ దంచుడు మొదలు పెట్టడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దివేశ్ పఠానియా వేసిన 49 ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. ఇందులో గౌతమ్ ఒక్కడే 28 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లోనూ బౌండరీ బాదాడు. గౌతమ్ విజృంభించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో అతడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్వి20 సిరీస్‌కు గౌతమ్ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టి20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. (చదవండి: కోహ్లి రికార్డును శుభ్‌మన్ బ్రేక్ చేశాడు..) -
గౌతమ్ భీకర ఇన్నింగ్స్, 134 నాటౌట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేటి ప్రతిభ చూపి అదరహో అనిపించాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్‌తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన షిమోగా లయన్స్ టీమ్‌ను బంతితో గౌతమ్ వణికించాడు. అతడి ధాటికి లయన్స్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి లయన్స్‌ను మట్టికరిపించాడు. కేపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గౌతమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 70 పరుగుల తేడాతో లయన్స్ పరాజయం పాలైంది. 16.3 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. బలాల్(40), దేశ్‌పాండే(46) మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఒంటిచేత్తో టస్కర్స్ను గెలిపించిన కృష్ణప్ప గౌతమ్ ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
-
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
నాగ్‌పూర్: క్రికెట్లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్ సీకే నందన్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా-విదర్భ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు. -
జైపూర్‌కు ‘గౌతం సిటీ’ అని పేరు పెట్టాలి!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్‌లు, ఊహించని ట్విస్టులు, అనూహ్య ఫలితాలతో రోజురోజుకు అభిమానులను అలరిస్తోంది. మొన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బలమైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు షాక్ ఇచ్చింది. కానీ, బెంగళూరును ఓడించిన ముంబై.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తయింది. జైపూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో రోహిత్ సేనను రాజస్థాన్ రాయల్స్ మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో 33 పరుగులతో చెలరేగి ఆడి.. రాజస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించిన కృష్ణప్ప గౌతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 29 ఏళ్ల గౌతం ఆటతీరుకు ఫిదా అయిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో అతన్ని ఆకాశానికెత్తుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ పేజీలో గౌతమ్ కొనియాడుతూ.. ‘పింక్ గౌతం సిటీ’ అంటూ పేర్కొంది. దాంతో కనీసం ఒక్కరోజైనా జైపూర్ పేరును గౌతం సిటీగా మార్చాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘గోథం బ్యాట్మన్ (సూపర్‌హీరో సిరీస్)ను ఇస్తే.. గౌతం బ్యాట్స్‌మన్‌ను ఇచ్చాడు’ అని చమత్కరిస్తున్నారు. గౌతం సిటీలో అద్భుతమైన బ్యాట్మన్ ప్రతిభ చూశామని పేర్కొంటున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్(52), బెన్‌స్టోక్స్ (40), కృష్ణప్ప గౌతమ్(33) పరుగులు చేశారు. ముంబై బౌలర్లో పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు దక్కాయి. మెక్లెనగన్, క్రునాల్, ముస్తాఫిజుర్‌లు తలో వికెట్ నేలకూల్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(72), ఇషాన్ కిషన్ (58), పొలార్డ్(21)లు రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌కు 3, ధవల్ కులకర్ణికి 2, ఉనద్కత్‌కు ఒక్క వికెట్ లభించాయి. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్(4 ఓవర్లు 22 పరుగులకు 3 వికెట్లు)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. P̴i̴n̴k̴ Gowtham's City! The hero #RR needed, K Gowtham won the Royals a thriller! #RRvMI — Star Sports (@StarSportsIndia) April 22, 2018 RENAME JAIPUR TO GOWTHAM CITY FOR A DAY #RRvMI — Gabbbar (@GabbbarSingh) April 22, 2018 #RRvMI Gotham gave us Batman. Gowtham gave us Batsman. — Ramesh Srivats (@rameshsrivats) April 22, 2018 Today we saw the Batsman from Gowtham City! — Keh Ke Peheno (@coolfunnytshirt) April 22, 2018