
చెన్నై: ‘‘కేకేఆర్ కిడ్స్‌ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా వేలంపాటలో పాల్గొన్నారు’’ అంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా ఆనందంలో తేలిపోయారు. తన కూతురు జాహ్నవి, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షారుఖ్, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా గురువారం జరిగిన ఈ క్యాష్ రిచ్‌లీగ్ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు. తద్వారా వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలి(19)గా నిలిచారు.
ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్ వేలం చరిత్రలో యంగెస్ట్ బిడ్డర్‌గా మా జాహ్నవి మెహతా. చెన్నై పర్యటన, ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఆమె అందిస్తున్నారు’’ అంటూ కేకేఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ విషయంపై స్పందించిన జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో.. ‘‘వీళ్లిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసింది’’ అంటూ కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా జూహీ- జై మెహతా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్ మెహతా. ఇక పర్స్‌లో రూ.10.75 కోట్లతో కేకేఆర్ వేలానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ మినీ వేలం-2021లో కేకేఆర్ దక్కించుకున్న ఆటగాళ్లు:
►షకీబ్ అల్ హసన్- రూ. 3.2 కోట్లు
►హర్భజన్ సింగ్- రూ. 2 కోట్లు
►కరుణ్ నాయర్- రూ. 50 లక్షలు
►బెన్ కటింగ్- రూ.75లక్షలు
►వెంకటేస్ అయ్యర్- రూ.20లక్షలు
►పవన్ నేగి- రూ.50లక్షలు
చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు
So happy to see both the KKR kids, Aryan and Jahnavi at the Auction table .. 🙏😇💜💜💜
— Juhi Chawla (@iam_juhi) February 18, 2021
@iamsrk @KKRiders pic.twitter.com/Hb2G7ZLqeF
Comments
Please login to add a commentAdd a comment