షారుఖ్‌ ఖాన్‌ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వెంటనే.. | Shah Rukh Khan Hugs & Kisses Ganguly After KKR Win Over DC, Video Viral | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ ఖాన్‌ చర్యతో ఆశ్చర్యపోయిన గంగూలీ.. వీడియో వైరల్‌

Published Tue, Apr 30 2024 10:03 AM | Last Updated on Tue, Apr 30 2024 10:16 AM

Shah Rukh Khan Hugs & Kisses Ganguly After KKR Win Over DC, Video Viral

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌.. టీమిండియా దిగ్గజం సౌరవ్‌ గంగూలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.

అంతేకాదు.. ఆప్యాయంగా దాదాను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు. షారుఖ్‌ చర్యతో తొలుత ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకుని హర్షం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా సోమవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌- ఢిల్లీ తలపడ్డాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కేకేఆర్‌ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి(3/16) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోగా.. పేసర్లలో మిచెల్‌ స్టార్క్‌(1/43), వైభవ్‌ అరోరా(2/29), హర్షిత్‌ రాణా(2/28), స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌(1/24) రాణించారు.

వీరిలో స్టార్క్‌ ఒక్కడు ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(33 బంతుల్లో 68) సొంతగడ్డపై ఢిల్లీ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ వెనుక నుంచి వెళ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీని హత్తుకున్నాడు. వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆప్యాయత ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

 కాగా ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌కు తొమ్మిదింట ఇది ఆరో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ పదకొండింటికి ఐదు మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement