కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షారూఖ్ ఖాన్. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ, పంటి కింద బాధల్ని భరిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. సినిమాల్లోకి రావాలనుకునే చాలామందికి ఆయనొక ఇన్‌స్పిరేషన్. ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదని, తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడంటోంది హీరోయిన్ జుహీ చావ్లా.
నాకు ఇప్పటికీ గుర్తు..
ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షారూఖ్ ఇబ్బంది పడ్డ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. తనకు ముంబైలో ఇల్లు లేదు. ఢిల్లీ నుంచి వచ్చేవాడు. తనకు వంట చేసేవారు లేరు. ఎక్కడ ఉండేవాడో తెలీదు. సెట్‌లో అందరి కోసం చేసిన వంటను ఆరగించేవాడు. సెట్‌లోని వారితో కలివిడిగా ఉండేవాడు. ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండేవాడు.
గడియారంతో పోటీపడుతూ..
అప్పట్లో తనకు జిప్సీ కారుండేది. అందులోనే వచ్చేవాడు. మూడు షిఫ్టుల్లోనూ పని చేసేవాడు. మేమిద్దరం రాజు బన్‌గయా జెంటిల్‌మెన్, దిల్ ఆష్నా హై సినిమాల్లో కలిసి పని చేశాం. అప్పుడే దివ్య భారతితో మరో మూవీ చేశాడు. గడియారంతో పోటీపడి వర్క్ చేసేవాడు. ఏదో కారణాల వల్ల తన కారు ఈఎమ్‌ఐ కట్టలేకపోయాడు.
ఇప్పుడీ స్థాయిలో..
దీంతో అతడి కారును తీసుకెళ్లిపోయారు. అప్పుడు దిగాలుగా సెట్‌కు వచ్చాడు. నువ్వేం బాధపడకు.. భవిష్యత్తులో ఎన్నో కార్లు కొనే స్థాయికి ఎదుగుతావు.. చూస్తూ ఉండు అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏ రేంజ్‌లో ఉన్నాడో మీరూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా షారూఖ్ కారును తీసుకెళ్లిన సమయంలో జుహీ చావ్లా తన కారును వాడుకోమని ఇచ్చింది.
చదవండి: అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment