
కోచ్‌లు చంద్రకాంత్ పండిట్, బ్రావో, కెప్టెన్ రహానే(PC: KKR X)
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR). తద్వారా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈసారి లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర(RCB)తో కేకేఆర్ తలపడనుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న ఈ మ్యాచ్ జరుగనుంది.
అయితే, గత సంవత్సరం జట్టుని ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి తప్పుకోవడంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించాడు. దీనితో నైట్ రైడర్స్ కొత్త తరహా జట్టుతో ఈ సారి రంగ ప్రవేశం చేయబోతోంది.
నైట్ రైడర్స్‌పై ఒత్తిడి
ఈ నేపథ్యంలో మళ్ళీ టైటిల్ నిలబెట్టుకోవాలన్న ఆశాభావంతో ఉన్న నైట్ రైడర్స్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ అతనికి వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతను కూడా అప్పగించింది.
ఇక బంగ్లాదేశ్‌లో ఫాస్ట్ బౌలింగ్ విప్లవానికి బీజాలు నాటడంలో విజయం సాధించిన వెస్టిండీస్ మాజీ పేసర్ ఒట్టిస్ గిబ్సన్‌ను నైట్ రైడర్స్ ఇటీవల తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
అతడు రావడం ప్లస్ పాయింట్
తాజాగా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జే జట్టులో చేరుతున్నట్టు జట్టు అధినేత, నటుడు షారుఖ్ ఖాన్ రెండ్రోజుల క్రితం ప్రకటించాడు. 2025 వేలంలో నైట్ రైడర్స్ రూ. 6.50 కోట్లకు నోర్జేను తిరిగి కొనుగోలు చేసింది.
ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీలోకి వచ్చిన నోర్జే అనుభవం, అపార వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉంది. ఇంకా జట్టులో సునీల్ నరైన్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో కీలక భూమిక వహించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి వర్ధమాన బౌలర్లతో బలీయంగానే కనిపిస్తోంది.
రహానేకు కెప్టెన్‌గా బాధ్యతలు.. గొ ప్ప రికార్డు లేదు
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యుత్తమ రికార్డులు లేనందున రహానేపై పెద్ద భారమే కనిపిస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కు 24 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన రహానే వాటిలో తొమ్మిది మ్యాచ్‌లలో మాత్రమే విజయాన్ని రుచిచూశాడు. 15 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రహానే రికార్డు ఏ విధంగానూ ఆశాజనకంగా లేదు.
ఇక వ్యక్తిగతంగా చూస్తే రహానే 25 మ్యాచ్‌ల్లో ఆడి 25.34 సగటుతో 583 పరుగులు మాత్రమే చేశాడు. అతను హైదరాబాద్ వేదికపై 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో తన అత్యధిక స్కోరు 70 ని నమోదు చేసుకున్నాడు.
కానీ రహానెకి నైట్ రైడర్స్ కొత్త ఫ్రాంచైజీ ఏమీ కాదు. 2022లో నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించిన రహానే ఏడు మ్యాచ్‌ల్లో 103.90 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. కాబట్టి గొప్ప రికార్డులేమీ లేని కెప్టెన్ ఉండటం ఒక బలహీనతగా పరిణమించింది అనడంలో సందేహం లేదు.
వేలంలో నైట్ రైడర్స్ ఎలా రాణించింది?
వేలానికి ముందు వెంకటేష్ అయ్యర్‌ను విడుదల చేసిన తర్వాత, నైట్ రైడర్స్ అతన్ని అధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకరైన ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్‌ను తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నించింది. సాల్ట్ లేకపోయినా, నైట్ రైడర్స్ వద్ద క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్‌ల రూపంలో ఇద్దరు మంచి వికెట్టుకీపర్లు ఉన్నారు.
సన్‌రైజర్స్ జట్టు నుంచి తప్పుకున్న తర్వాత తన కెరీర్‌ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను కూడా నైట్ రైడర్స్ కనుగోలుచేసింది.
ఐపీఎల్ 2025 వేలంలో కొన్న ఆటగాళ్లు:
వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 2 కోట్లు), క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), ఆంగ్క్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (రూ. 6.50 కోట్లు), వైబ్హవ్ 8 కోట్లు. మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), రోవ్‌మన్ పావెల్ (రూ. 1.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 75 లక్షలు), స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు), లువ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), అజింక్యా రహానె (రూ. 30 లక్షలు), అనీక్లీ ఎ. 4 లక్షలు (రూ. 1.50 లక్షలు), అనూక్లీ రోయ్ లక్షలు (రూ. 1.50 లక్షలు), 2 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 75 లక్షలు).
ప్రధాన ఆటగాళ్లు:
వరుణ్ చక్రవర్తి: ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లతో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నైట్ రైడర్స్ తరఫున 82 వికెట్లు తీసిన వరుణ్ ఈ సీజన్‌లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
సునీల్ నరైన్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ గత సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న నరైన్ 17 వికెట్లు పడగొట్టడమే కాకుండా, 34.85 సగటుతో 488 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.
ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్ దశాబ్ద కాలంగా నైట్స్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. అందువల్ల యాజమాన్యం అతనిపై విశ్వాసం చూపించింది. గత సంవత్సరం రస్సెల్ 222 పరుగులు చేసి 19 వికెట్లు పడగొట్టి, నైట్ రైడర్స్ టైటిల్ సాధనలో కీలక పాత్ర పోషించాడు.
అజింక్య రహానే: అజింక్య రహానేకు చాలా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ లో అపార అనుభవం ఉంది.
చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?