LIVE: IPL Auction 2021 Updates, in Telugu, Players List With Price, Highest Paid Player - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: ముగిసిన వేలం

Published Thu, Feb 18 2021 2:49 PM | Last Updated on Sat, Apr 3 2021 6:24 PM

LIVE: IPL Auction 2021 Updates In Telugu - Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 మినీ వేలం ముగిసింది. మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా 57 మంది మాత్రమే వేలంలో అమ్ముడపోయారు. ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా, మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.  రిచర్డ్‌సన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.  ఇక న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కైల్‌ జేమిసన్‌‌ రూ. 15కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. అతని కనీస ధర 75 లక్షల రూపాయలు ఉండగా ఆర్సీబీ పోటీపడి మరీ అతన్ని కొనుగోలుచేసింది. కైల్‌ జేమిసన్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ చివరి వరకూ బిడ్డింగ్‌ వెళ్లినా చివరకు ఆర్సీబీ దక్కించుకొంది. ఈసారి వేలంలో చివరి ఆటగాడిగా వచ్చిన అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. 2021 ఐపీఎల్‌ వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

స్టీవ్‌ స్మిత్ (కనీస ధర: రూ.2 కోట్లు)‌- రూ.2.20 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ 


గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 14.25 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. ఐపీఎల్‌ వేలంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మరోసారి జాక్‌పాట్‌ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్‌సీబీకి పోటీ పడగా చివరకు రూ. 14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది.

షకీబ్‌ ఆల్‌ హసన్(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 3.20 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మొయిన్‌ అలీ(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 7కోట్లు- చెన్నై సూపర్‌కింగ్స్‌. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కొనుగోలు కోసం సీఎస్‌కే, పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడ్డాయి. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు.

శివమ్‌ దూబే (కనీస ధర: రూ. 50 లక్షలు) - రూ.4.40 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌.

క్రిస్‌ మోరిస్‌(‍ కనీస ధర: రూ. 75లక్షలు)- రూ. 16.25 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. మోరిస్‌ కోసం మొదట పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య భారీ పోటీ నడిచింది. అయితే రూ. 5 కోట్లు దాటగానే ముంబై పక్కకు తప్పుకోగా.. రూ.12 కోట్ల వద్ద రాయల్స్ ఎంటరైంది. దీంతో పంజాబ్‌, రాజస్తాన్‌ పోటీ పడ్డాయి. చివరకు రూ. 16.25 కోట్లకు ఆర్‌ఆర్‌ దక్కించుకుంది.

డేవిడ్‌ మలాన్‌(కనీస ధర: రూ. 1.50 కోట్లు)- రూ.1.50 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌. టీ20 ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్న మలాన్‌ కోసం పెద్ద పోటీ లేకపోవడంతో పంజాబ్‌ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసింది.

ఆడమ్‌ మిల్నే(కనీస ధర : రూ.50 లక్షలు)- రూ.3.20 కోట్లు- ముంబై ఇండియన్స్‌ 

ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌( కనీస ధర : రూ. కోటి)- రూ. కోటి- రాజస్తాన్‌ రాయల్స్‌

జై రిచర్డ్‌సన్‌ (కనీస ధర: రూ. 1.50 కోట్లు) - రూ. 14 కోట్లు - పంజాబ్‌ కింగ్స్‌.ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జై రిచర్డ్‌సన్‌ ఐపీఎల్‌ వేలంలో అదరగొట్టాడు. పంజాబ్‌, ఢిల్లీ, చెన్నైలు రిచర్డ్‌సన్‌ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. కానీ చివరకు రికార్డు స్థాయిలో 14 కోట్ల రూపాయలకు పంజాబ్‌ కిం‍గ్స్‌ కొనుగోలు చేసింది.

నాథర్‌ కౌల్టర్‌నీల్(కనీస ధర: రూ. 1.50 కోట్లు)-  రూ. 5 కోట్లు- ముంబై ఇండియన్స్

► ఉమేశ్‌ యాదవ్‌(కనీస ధర: రూ.కోటి)- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్‌‌

► పియూష్‌ చావ్లా(కనీస ధర: రూ.50 లక్షలు)- రూ. 2.40 కోట్లు- ముంబై ఇండియన్స్

► సచిన్‌ బేబి‌(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ. 20లక్షలు- ఆర్‌సీబీ

రాజత్‌ పాటిదార్‌(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ. 20లక్షలు- ఆర్‌సీబీ

షారుక్‌ఖాన్‌(కనీస ధర: రూ. 20లక్షలు)-రూ. 5.25 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌. తమిళనాడుకు చెందిన దేశవాలీ ఆటగాడైన షారుక్‌ఖాన్‌కు వేలంలో రూ.5.25 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. రూ.20 లక్షల కనీస మద్దతు ధరతో బరిలోకి దిగిన షారుక్‌ను పంజాబ్‌ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. కాగా  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోపీలో షారుక్‌ఖాన్‌ మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే.

► కె. గౌతమ్‌‌(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ.9.25 కోట్లు- చెన్నై సూపర్‌కింగ్స్‌. కర్ణాటక ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ ఐపీఎల్‌ వేలంలో లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. రూ.20 లక్షల కనీస మద్దతు ధరతో బరిలోకి దిగిన గౌతమ్‌ను సీఎస్‌కే రూ.9.25 కోట్లు పెట్టి కొనడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత సీజన్‌లో గౌతమ్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడాడు.

షెల్డన్‌ జాక్సన్(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ.20లక్షలు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

విష్ణు వినోద్‌(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ.20లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్‌

మహ్మద్‌ అజారుద్దీన్(కనీస ధర: రూ. 20లక్షలు)- రూ.20లక్షలు- ఆర్‌సీబీ

► లక్మన్‌ హుస్సేన్‌‌(కనీస ధర: రూ.20 లక్షలు)-రూ.20 లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్

► చేతన్‌ సకారియా(కనీస ధర: రూ.20 లక్షలు)- రూ.1.20 కోట్లు-రాజస్తాన్‌ రాయల్స్‌

► రిలే మెరిడిత్‌(కనీస ధర: రూ.40 లక్షలు)- రూ. 8కోట్లు- పంజాబ్‌ కింగ్స్. ఆస్ట్రేలియాకి చెందిన రిలే మెరిడిత్ వేలంలో భారీ ధర దక్కించుకున్నాడు. ఒక అన్‌క్యాప్‌ ఆటగాడికి ఇంత మొత్తంలో దక్కడం ఇదే మొదటిసారి. బీబీఎల్‌ 10లో హోబర్ట్‌ హరికేన్స్‌ తరపున మెరిడిత్‌ దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు.‌

► ఎం సిద్దార్థ్‌‌(కనీస ధర: రూ.20 లక్షలు)-రూ.20 లక్షలు- ఢిల్లీ క్యాపిటల్స్‌

► జగదీశా సుచిత్‌‌‌(కనీస ధర: రూ.20 లక్షలు)-రూ.30 లక్షలు- సన్‌రైజర్స్ ‌ హైదరాబాద్‌

► చతేశ్వర్‌ పుజారా(కనీస ధర : రూ.50లక్షలు)- రూ.50లక్షలు- చెన్నై సూపర్‌కింగ్స్


► కైల్‌ జేమిసన్‌‌(కనీస ధర:రూ.75లక్షలు)- రూ. 15కోట్లు - ఆర్సీబీ‌. న్యూజిలాండ్‌ ఆటగాడు కైల్‌ జేమిసన్‌ వేలంలో నక్కతోక తొక్కాడు. ఎవరు ఊహించని విధంగా జేమిసన్‌ను ఆర్సీబీ రూ.15కోట్లకు దక్కించుకుంది. జేమిసన్‌ కోసం పంజాబ్‌ చివర వరకూ పోటీ పడినా కొనులేకపోయింది.

► టామ్‌ కర్జన్‌(కనీస ధర : రూ. 1.5 కోట్లు)- రూ.5.25 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్‌

► మొయిసిస్‌ హెన్రిక్స్‌‌(కనీస ధర: రూ.కోటి)- రూ.4.20కోట్లు- పంజాబ్‌ కింగ్స్

వైభవ్‌ అరోరా(కనీస ధర : రూ.20లక్షలు): రూ.20లక్షలు-కేకేఆర్‌

జలజ్‌ సక్సేనా(కనీస ధర : రూ.30లక్షలు)- రూ.30లక్షలు- పంజాబ్‌ కింగ్స్‌

ఉత్కర్ష్‌ సింగ్‌(కనీస ధర : రూ.20లక్షలు)- రూ.20లక్షలు-పంజాబ్‌ కింగ్స్‌

ఫాబియన్‌ అలెన్‌(కనీస ధర : రూ.75లక్షలు)- రూ.75లక్షలు- పంజాబ్‌ కింగ్స్‌

డేనియల్‌ క్రిస్టియన్‌(కనీస ధర : రూ.75లక్షలు) - రూ.4.80 కోట్లు- ఆర్‌సీబీ 

లియామ్‌ లివింగ్‌స్టన్‌‌(కనీస ధర : రూ.75లక్షలు)- రూ.75లక్షలు- రాజస్థాన్‌ రాయల్స్‌

కెఎస్‌ భరత్(కనీస ధర : రూ.20లక్షలు)- రూ.20లక్షలు- ఆర్‌సీబీ

సుయేష్‌ ప్రభుదేశాయ్‌(కనీస ధర : రూ.20లక్షలు)- రూ.20లక్షలు- ఆర్‌సీబీ

కుల్దీప్‌ యాదవ్‌(కనీస ధర : రూ.20లక్షలు)-  రూ.20లక్షలు-రాజస్థాన్‌ రాయల్స్‌


కేదార్ జాదవ్ (కనీస ధర : రూ. 2కోట్లు)- రూ. 2కోట్లు- ఎస్‌ఆర్‌హెచ్

జేమ్స్‌ నీషమ్‌(కనీస ధర : రూ.50లక్షలు)- రూ.50లక్షలు- ముంబై ఇండియన్స్‌

మార్కో జాన్సెన్‌(కనీస ధర : రూ.20లక్షలు)-రూ.20లక్షలు-ముంబై ఇండియన్స్‌

ఎమ్‌ హరిశంకర్‌రెడ్డి(కనీస ధర : రూ.20లక్షలు)-రూ.20లక్షలు-సీఎస్‌కే

రిపల్‌ పటేల్‌(కనీస ధర : రూ.20లక్షలు)-రూ.20లక్షలు-ఢిల్లీ క్యాపిటల్స్‌

యుధ్వీర్ చారక్‌(కనీస ధర : రూ.20లక్షలు)-  రూ.20లక్షలు- ముంబై ఇండియన్స్‌

కెఎస్‌ భగత్‌వర్మ‌(కనీస ధర : రూ.20లక్షలు)-  రూ.20లక్షలు- సీఎస్‌కే

సౌరబ్ కుమార్‌(కనీస ధర : రూ.20లక్షలు)-  రూ.20లక్షలు- పంజాబ్‌ కింగ్స్‌

కరుణ్‌ నాయర్‌(కనీస ధర : రూ.50లక్షలు)- రూ.50లక్షలు- కేకేఆర్‌

సామ్ బిల్లింగ్స్ (కనీస ధర : రూ. 2కోట్లు)- రూ. 2కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌

ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌(కనీస ధర : రూ. 1.5 కోట్లు)- రూ. 1.5 కోట్లు-  ఎస్‌ఆర్‌హెచ్


హర్భజన్‌ సింగ్‌(కనీస ధర : రూ.2కోట్లు)- రూ.2కోట్లు- కేకేఆర్‌

బెన్‌ కటింగ్‌(కనీస ధర : రూ.75లక్షలు)- రూ.75లక్షలు- కేకేఆర్‌

వెంకటేస్‌ అయ్యర్‌(కనీస ధర : రూ.20లక్షలు)- రూ.20లక్షలు- కేకేఆర్‌

పవన్‌ నేగి(కనీస ధర : రూ.50లక్షలు)- రూ.50లక్షలు- కేకేఆర్‌


అర్జున్‌ టెండూల్కర్‌(కనీస ధర : రూ.20లక్షలు)- రూ.20లక్షలు- ముంబై ఇండియన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement