జైపూర్: ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మోరిస్ కొత్త చరిత్ర సృష్టించాడు. మోరిస్ కోసం ఆఖరివరకు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరకు వేలంలో రాజస్తాన్ ఎక్కువ మొత్తం వెచ్చించి అతన్ని దక్కించుకుంది. తాజాగా మోరిస్‌కు వేలంలో అంత ఖర్చు చేయడం వెనుక రాజస్తాన్ రాయల్స్ స్పందించింది.
'ఐపీఎల్ వేలంలో పంజాబ్‌తో పోటీ పడి క్రిస్ మోరిస్‌ను దక్కించుకున్నాం. క్రిస్ మోరిస్ లాంటి అనుభవం ఉన్న బౌలర్ మాకు చాలా అవసరం. దక్షిణాఫ్రికా తరపున ఎన్నో మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన అతను డెత్ ఓవర్లలో జట్టుకు కీలకంగా మారి గెలిపించాడు. ఇప్పుడే అదే స్ట్రాటజీని మేము ఉపయోగించనున్నాం. మా ఇప్పటికే జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి లాంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. మోరిస్ వారికి జత కలిస్తే మరింత బలమవుతుంది. గత సీజన్‌లో ఆర్‌సీబీ తరపున 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మోరిస్ 11 వికెట్లు తీశాడు. అంతేగాక బ్యాటింగ్ సమయంలో తన పవర్ హిట్టింగ్‌తో చాలాసార్లు మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మోరిస్ కోసం అంత ఖర్చు చేయాల్సి వచ్చింది. అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాడని ఆశిస్తున్నాము అంటూ తెలిపింది. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: కోహ్లి విచిత్ర భాష.. షాక్‌లో పాండ్యా, అక్షర్
కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!
Comments
Please login to add a commentAdd a comment